Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట ఆలయం త్రేతాయుగం కాలం నాటిది.శ్రీరాముని బావగారైన ఋష్యశృంగ మహర్షి కుమారుడే యాదర్షి. ఆయన తపస్సు వల్లనే లక్ష్మీనరసింహ స్వామి యాదగిరిపై పంచనారసింహ రూపాలలో వెలిశాడు. ఆనాడు యాదమహర్షి చూసిన ఉగ్రనారసింహ రూపమే యాదగిరి గుట్ట అయిందని చెబుతారు. యాదాద్రికి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. ఆయన ఆజ్ఞ మేరకే యాదర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి వచ్చాడు. యాదర్షి తపస్సుకు కూడా ఆంజనేయుడు ఎంతో సహాయం చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. యాదాద్రిలో ప్రసన్నాంజనేయుని మనం దర్శించుకోవచ్చు. అక్కడే గండభేరుండ స్వామి దర్శనం కూడా అవుతుంది. ఆయనకు ప్రదక్షిణలు చేస్తే సర్వరోగాలు, భూతప్రేత పిశాచాదుల బాధలు పోతాయి. యోగానంద నారసింహుడు. దక్షిణాభిముఖుడై యోగముద్రలో జ్ఞానదాయకునిగా ప్రసిద్ధి పొందాడు. దేవప్రాచీదిశలో వెలిసిన లక్ష్మీనృసింహస్వామి దర్శన మాత్రంతో కోరికలను నెరవేరుస్తాడు. రెండు శిలాఫలకాల మధ్య సర్పాకారంలో శ్రీచూర్డరేఖను ధరించివున్న రూపం జ్వాలానృసింహమూర్తి. ఇక యాదాద్రి కొండంతా ఆవరించివున్న మహారూపం ఉగ్రనృసింహమూర్తి. మూలమూర్తిగా విరాజిల్లుతున్న స్వయం భూనృసింహమూర్తి ఈ పంచనృసింహుల సమ్మేళన రూపం. యాదగిరిగుట్టలోని గుహలో కృతయుగం ను...