Magha Amavasya: మాఘ అమావాస్య
మాఘ మాసంలో చివరి రోజు మాఘ అమావాస్యగా జరుపుకుంటారు
మాఘ అమావాస్య రోజున మౌనం పాటించడం వలన సహనం, స్వీయ విగ్రహం పెంపొందుతుంది. అందుకే దీనిని మౌని అమావాస్య అనికూడా అంటారు. ఈ రోజు, దానాలు, విరాళాలు ఇవ్వడానికి శ్రేష్టమైన రోజు. అలాగే నదీ స్నానాలకు కూడా ఈ రోజు చాలా మంచి దినం.
చాలా మంది స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం పాటించేందుకు ఈ రోజును ఎంచుకుంటారు. మాఘ అమావాస్య శాంతి కలిగిస్తుంది. ఈ రోజు, స్నానం చేసేటప్పుడు నిశ్శబ్దం పాటించాలి. ఈ రోజున గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మదేవుడిని పూజిస్తారు. ఈ రోజు నువ్వులు పిండిలో కలిపి రొట్టెలు తయారు చేయాలి. వాటిని ఆవులకు తినిపించాలి. ఇది కుటుంబంలో శాంతి, శ్రేయస్కర వాతావరణాన్ని కలిగిస్తుంది.
మాఘ అమావాస్య రోజు పిండి ముద్దలను చేపలకు తినిపించాలి. దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతికూలతలు తొలగిపోతాయి.
పూర్వీకులను స్మరించుకుంటూ పేదలకు దానం చేయాలి. పవిత్ర భగవద్గీతలోని ఏడవ అధ్యాయం పఠించాలి. ఈ రోజు పాలలో మీ ప్రతిబింబాన్ని చూడండి. ఆ పాలను నల్ల కుక్కకు తాగించాలి. దీంతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
మాఘ అమావాస్య రోజు తప్పకుండా రావి చెట్టు దగ్గర ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. దాన్ని 'పితృదీపం లేదా ద్వాదశ ఆదిత్య దీపం' అనే పేరుతో పిలుస్తారు. మాఘ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పెద్ద మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేయాలి. అలాంటి వత్తులు 12 విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి, మాఘ అమావాస్య రోజు వెలిగించే ఈ దీపానికి విశేష ఫలితం లభిస్తుంది.
- మాఘ అమావాస్య రోజు పాదరక్షలు, గొడుగు దానం ఇచ్చిన మంచి జరుగుతుంది.
- ఈ రోజున గ్రామ దేవతల ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది.
- గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించాలి. అలాగే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. అమ్మవారికి పులిహోర నైవేద్యం సమర్పించి అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే శత్రు బాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు.
- ఈ రోజున నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసినా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని చెప్పారు.
- మాఘ పౌర్ణమికి సముద్ర స్నానం చేయడం వీలు కాని వాళ్లు ఎవరైనా సరే ఈ మాఘ అమావాస్య రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. దానివల్ల శత్రు బాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు.
- ఈ రోజున కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. అమ్మవారికి 108 నిమ్మకాయల దండను సమర్పిస్తే మంచిది.
2025: ఫిబ్రవరి 27.
Comments
Post a Comment