Shivalayam Pradakshina: శివాలయ ప్రదక్షిణ
'ప్ర' అంటే భయాన్ని పోగొట్టేది. 'డ' అంటే మోక్షాన్ని ఇచ్చేది. 'క్షి' అంటే రోగాలను పారద్రోలేది. 'ణ' అంటే సకలసాభాగ్యాలను కలిగించేది. ఈ నాలుగు అక్షరాలను కలిపితే ప్రదక్షిణం అవుతుంది. ఈ ప్రదక్షిణ వలన కలిగే లాభాలు ఇన్ని అన్ని కావు. కానీ దాన్ని నియమంగా ఆచరిస్తేనే సత్ఫలితం కలుగుతుంది.
ప్రదక్షిణ సూత్రాలు:
- మెల్లగా నడవాలి
- తనచుట్టూ తాను కుడివైపుగా తిరగడం ఆత్మప్రదక్షిణం అంటారు.
- ఒక ప్రదక్షిణం చేస్తే బ్రహ్మహత్యాదిపాతకాలు, రెండు ప్రదక్షిణాలతో శివానుగ్రహం, మూడు ప్రదక్షిణలతో ఇంద్రుని వంటి ఐశ్వర్యం కలుగుతుంది.
- ఇదంతా మానవులచే నిర్మించబడిన శివాలయంలో చేస్తే కలిగే ఫలితం.
ప్రదక్షిణ ఫలం:
- మానవులచే నిర్మించబడిన శివాలయాలలో చేసే ప్రదక్షిణం కంటే ఋషులతో ప్రతిష్ఠించబడిన శివాలయాల్లో చేసే ప్రదక్షిణ రెండు రెట్లు ఫలితాన్ని ఇస్తుంది.
- దేవతలచే ప్రతిష్ఠించబడిన శివాలయాలలో మూడు రెట్లు
- గాణపలింగాల చుట్టూ చేస్తే నాలుగురెట్లు
- శ్రీశైలం వంటి స్వయంభులింగం చుట్టూ చేస్తే ఐదు రెట్లు ఫలితం కలుగుతుంది.
- ఒక వేళ ప్రయాణాలలో ఈ ప్రదక్షిణ భాగ్యం కలగకపోతే ఆయా లింగాలను స్మరించి ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటే అంత ఫలితమూ కలుగుతుంది.
ప్రదక్షిణ మూడురకాలుగా చెప్పబడింది. వీటిలో ఒక్కోటి ఒక్కొక్కరికి నియమించడం జరిగింది. సవ్యం అంటే గుడికి కుడివైపుగా తిరిగిరావడం, అపసవ్యం అంటే ఎడమవైపుగా తిరిగిరావడం. సవ్యాపసవ్యం అంటే కుడి, ఎడమలలో తిరగడం, సవ్య ప్రదక్షిణం బ్రహ్మచారులకు, అపసవ్య ప్రదక్షిణం యతులకు, సవ్యాపసవ్య ప్రదక్షిణం గృహస్తులకు విధించబడింది. ఇందులో చందప్రదక్షిణ సవ్యాపసవ్య ప్రదక్షిణకు ఉదాహరణ. కనుక చందప్రదక్షిణను గృహస్థులే ఆచరించాలని చెప్పబడింది. సవ్య ప్రదక్షిణతో భోగము, అపసవ్య ప్రదక్షిణతో మోక్షము, సవ్యాపసవ్యంతో భుక్తి, ముక్తులు లభిస్తాయి.
తూర్పున మొదలుపెట్టి గుడికి ఎడమవైపుగా తిరిగి అక్కడికే చేరడం అపసవ్య ప్రదక్షిణకు ఉదాహరణ. వృషభం దగ్గర నుండి చండేశ్వరుడి వరకు, చండేశ్వరుడి నుండి తిరిగి వృషభం వద్దకు, తిరిగి సోమసూత్రం వద్దకు, సోమసూత్రం నుండి అపసవ్యంగా వృషభం వద్దకు, మరలా వృషభం నుండి చండేశ్వరుడి వద్దకు, మళ్లీ అక్కడి నుంచి చందేశ్వరుడి వద్దకు, అక్కడినుంచి తిరిగి వృషభం వరకు ఇలా చేసే చందప్రదక్షిణ సవ్యాపసవ్యప్రదక్షిణకు ఉదాహరణ.
ప్రదక్షిణం ఎక్కడ చేస్తే ఏం ఫలితం:
- భక్తితో చేసే ప్రదక్షిణకు అశ్వమేధయాగఫలం లభిస్తుందని అజితాగమం చెప్తూ ఇంకా అనేక రకాలైన ప్రదక్షిణాఫలితాలను తెలిపింది.
- అంతర్జారం (రెండవ ప్రాకారం)లో చేసే ప్రదక్షిణకు రెండు రెట్లు ఫలం.
- మధ్యహారం (మూడవ ప్రాకారం)లో మూడురెట్లు ఫలితం.
- మర్యాది (నాలుగవప్రాకారం)లో చేస్తే నాలుగురెట్లు ఫలితం.
- మహామర్యాది (ఐదవప్రాకారం)లో చేస్తే ఐదురెట్లు ఫలితం లభిస్తుంది.
- గర్భగుడి చుట్టూ ఉండే తొలిప్రాకారంలో ప్రదక్షిణలు చేయడానికి అర్చకులు, దీక్షితులు(దీక్ష పొందిన వారు) మొదలైన వారికి తప్ప ఇతరులకు అవకాశం లేదు.
- ఇది కాక క్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వందరెట్లు ఫలితం ఇస్తుందని చెప్పబడింది. సాధారణంగా తమిళనాడులోని అరుణాచలంలో కొండచుట్టూ ప్రదక్షిణ చేయడం అందరికీ తెలిసిన విషయమే.
- శ్రీశైలంలో క్షేత్రంచుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలు ఉంది. శివరాత్రికి ముందువచ్చే మాఘపౌర్ణిమ నాడు స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగిస్తూ భక్తులు కూడా కలిసి ఈ ప్రదక్షిణ చేస్తారు. శివరాత్రిదీక్షా సందర్భంగా దీక్షాధారులైన కొందరు భక్తులు కూడా ఈ ప్రదక్షిణ చేస్తారు. దీన్నే 'శ్రీశైలప్రదక్షిణ' అని కూడా అంటారు.
ప్రదక్షిణకు కాలనియమం:
ప్రతిరోజూ చేసే ప్రదక్షిణకు, నియమిత కాలంలో చేసే ప్రదక్షిణకు చాలా తేడా ఉంది. ముఖ్యంగా అష్టమి, చతుర్దశి, పౌర్ణమి, ఆదివారంతో కలిసి వచ్చిన ఆరుద్ర నక్షత్రం, విష్టి కరణం, దక్షిణాయన, ఉత్తరాయణ ప్రారంభంలో, విషువకాలం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, సంక్రమణకాలం, ఉత్సవకాలం మొదలైన సమయాల్లో ఆలయపుష్కరిణిలో స్నానమాచరించి ప్రదక్షిణలు చేస్తే సాధారణ ప్రదక్షిణ ఫలం కంటే వందరెట్లు పుణ్యం లభిస్తుంది. అదే విధంగా స్వయంభూలింగాన్ని తాకినా ఇదే ఫలితం లభిస్తుంది.
శివక్షేత్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్న భక్తుడు తన ఇంట్లో సంకల్పించుకుని పెద్దవారిని సంప్రదించి వారి అనుమతి పొంది కామక్రోధాది ఆరు గుణాలను విడిచిపెట్టి భక్తి పూర్వకంగా యాత్రకు బయల్దేరాలి. యాత్రలో భాగంగా శివభక్తులకు అనేక దానాలు చేయాలి. అక్కడ చేసే ప్రదక్షిణ ఫలితాలను శివాలయంలో దర్శించే దేవతాక్రమం ఇక చెప్పబడుతుంది.
శివరాత్రికి, విశేష సందర్భాలలో, తిరుణాళ్లకు అనేక మంది భక్తులు అతిపవిత్రంగా దీక్షను తీసుకుని మరియు మొక్కుకుని కాలినడకన క్షేత్రానికి ప్రయాణం ప్రారంభిస్తారు. ఇలా ఆ దూరప్రాంతం నుండి క్షేత్రం వద్దకు రావడానికి భక్తుడు వేసే ప్రతి అడుగు శివలింగ ప్రదక్షిణతో సమానమవ్వడమే కాక, ముందు చెప్పిన ఫలితం కంటే ఐదురెట్లు ఫలితం లభిస్తుందని అజితాగమం చెప్పింది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు చేసే ప్రదక్షిణతో సకల అభీష్టాలు నెరవేరుతాయి. రాత్రింబవళ్లు చేసే ప్రదక్షిణ అనంతఫలితాలను ఇస్తుంది. సవ్యప్రదక్షిణ గానీ, అపసవ్యప్రదక్షిణగానీ కోరిన కోరికలను తీరుస్తుంది.
దీనికి వందరెట్లు ఫలితం ఒక అంగప్రదక్షిణతో లభిస్తుంది.
శివరాత్రికి, విశేష సందర్భాలలో, తిరుణాళ్లకు అనేక మంది భక్తులు అతిపవిత్రంగా దీక్షను తీసుకుని మరియు మొక్కుకుని కాలినడకన క్షేత్రానికి ప్రయాణం ప్రారంభిస్తారు. ఇలా ఆ దూరప్రాంతం నుండి క్షేత్రం వద్దకు రావడానికి భక్తుడు వేసే ప్రతి అడుగు శివలింగ ప్రదక్షిణతో సమానమవ్వడమే కాక, ముందు చెప్పిన ఫలితం కంటే ఐదురెట్లు ఫలితం లభిస్తుందని అజితాగమం చెప్పింది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు చేసే ప్రదక్షిణతో సకల అభీష్టాలు నెరవేరుతాయి. రాత్రింబవళ్లు చేసే ప్రదక్షిణ అనంతఫలితాలను ఇస్తుంది. సవ్యప్రదక్షిణ గానీ, అపసవ్యప్రదక్షిణగానీ కోరిన కోరికలను తీరుస్తుంది.
దీనికి వందరెట్లు ఫలితం ఒక అంగప్రదక్షిణతో లభిస్తుంది.
Comments
Post a Comment