Magha Puranam Telugu: మాఘ పురాణం 3వ అధ్యాయం- శివపార్వతుల సంవాదం- సుమిత్రుడు తపస్సు చేసి మోక్షం పొందిన కథ

శివపార్వతుల సంవాదం కైలాసంలో పార్వతీదేవి పరమ శివునితో "నాథా! సుదేవుని కుమార్తె తన భర్తతో కలిసి మోక్షం పొందిన తర్వాత ఏ పాపం తెలియని సుమిత్రుడు ఏమయ్యాడు? అతని పాపాలకు ఏ విధంగా పరిహారం లభించింది? సవివరంగా తెలియజేయండి" అని కోరగా పరమ శివుడు పార్వతితో "పార్వతీ! సుదేవుని శిష్యుడు సుమిత్రుడు కొంత కాలానికి తన గురువుతో 'గురువర్యా! మీ కుమార్తె ప్రోద్భలంతోనే నేను చేయరాని పాపం చేశాను. తాను చెప్పినట్లుగా వినకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. నాతో కలిసి వచ్చిన గురు పుత్రిక మరణిస్తే మీరు నన్ను శపిస్తారేమో అన్న భయంతో ఆ రోజు ఆమె చెప్పినట్లుగా చేయరాని పాపానికి ఒడిగట్టాను. ఇప్పుడు నేను ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే నా పాపం పోతుందో మార్గం చెప్పండి' అని దీనంగా వేడుకుంటున్నాడు. దీనితో సుమిత్రుని చూసి గురువు అనునయంగా ఇలా పలికాడు. సుమిత్రునికి పాపవిమోచనం చెప్పిన సుదేవుడు సుదేవుడు సుమిత్రునితో "నీవు వెంటనే గంగానదీ తీరానికి వెళ్లి అక్కడ 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తే నీకు పాపం నుంచి విముక్తి కలుగుతుంది" అని చెప్పగా, సుమిత్రుడు వెంటనే గంగా నది తీరానికి బయలు దేరాడు. మార్గమ...