Rathasaptami: రథసప్తమి - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, January 29, 2025

Rathasaptami: రథసప్తమి



రథసప్తమిని మాఘసప్తమి అని కూడా పిలుస్తారు. మాఘ మాసం లో వస్తుంది కాబట్టి మాఘ సప్తమి అని అంటారు. ఈ పండుగ మాఘమాసంలో శుక్ల పక్ష సప్తమి రోజు వస్తుంది. ఈ రోజు సూర్యభగవానుని పుట్టినరోజుగా భావించి దీనిని సూర్య జయంతిగా కూడా పిలుస్తారు.

మాఘ సప్తమి రోజు సూర్యభగవానుడు తన రథంని ఉత్తర వైపు త్రిప్పుతాడు కాబట్టి దీనికి రథసప్తమి అని పేరు.  ఈ పండుగను భారతదేశంలోని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధల తో జరుపుకుంటారు . అని సూర్య దేవాలయాలులలో ఈ పండుగ సంబరాలు ముందు గానే మొదలు అవుతాయి. రథ సప్తమి తో వసంత ఋతువు మొదలు అవుతుంది,కొంత మంది రైతులు సాగుకి అనువైన సమయంగా భావిస్తారు.

సూర్యభగవానుడు రథానికి  వున్నా ఏడు తెల్ల  గుర్రాలు ,ఇంద్రధనస్సులోని  ఏడు రంగులను సూచిస్తాయి, అలాగే వారంలోని ఏడు రోజులుకు గుర్తు. రథానికి వున్నా పన్నెండు చక్రాలు సంవత్సరానికి వున్నా పన్నెండు నెలలు సూచిస్తాయి.రథ సప్తమి నుంచి దక్షిణ భారతదేశంలో క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు కూడా రావణుని చంపడానికి ముందు సూర్యభగవానుడుని పూజించి ఆదిత్య హృదయం పఠించాడు అని చెప్తారు.మహాభారతం లో కుంతీ దేవి సూర్యభగవానుడు ని పూజించడం వల్ల కర్ణుడు పుట్టాడు అని చెప్తారు. పాండవులలో పెద్ద అయిన ధర్మరాజు కూడా   సూర్యభగవానుడుని పూజించిన తరువాత అక్షయ పాత్ర లభించింది. హనుమంతుడు కూడా సూర్యభగవానుడు నుంచే "నవ  వ్యాకర్ణ" నేర్చుకున్నాడు .భీష్మ  పితామహుడు కూడా రథ సప్తమి తరువాత రోజు  మరణించాడు.

రథ సప్తమి రోజు ఉదయానే స్నానం చేసి సూర్య నమస్కారం చేయాలి. నైవేద్యం తో పాటు పండ్లు కూడా సూర్యభగవానుడు సమర్పించి పూజ ముగించాలి. ఆ రోజు అంత ఆదిత్యహృదయం, సూర్యాష్టకం, సూర్యసహస్ర  నామం, మొదలైన వాటిని పఠించాలి. సూర్యోదయంకి గంట  తరువాత  పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని భావిస్తారు.

రథసప్తమి ఆచరణ వల్ల ఎదురకాలైన పాపాలు అంటే
  • ఈ జన్మలో చేసినవి
  • గత జన్మలో చేసినవి
  • మనసులో చేసినవి
  • మాటలతో చేసినవి
  • శరీరంతో చేసినవి
  • తెలిసి చేసినవి
  • తెలియక చేసినవి
అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ రోజు సూర్యారాధన వల్ల అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుంది. అకాల మృత్యువు హరింపబడుతుంది.

రథ సప్తమి వేడుకలు తిరుమల, శ్రీరంగం , మేలుకొట్టే మొదలగు వైష్ణవ దేవాలయాలలో వైభావంగా జరుగుతాయి.ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని అరసవల్లి సూర్య దేవాలయం, కోణార్క్ దేవాలయంలో కూడా అంగరంగ వైభావంగా ఉత్సవాలు చేస్తారు.

తిరుమలలో అయితే శ్రీవారికీ ఒక రోజు బ్రహ్మోత్సవం చేస్తారు. స్వామి వారు ఏడు వాహనాలు మీద భక్తులకు దర్శనం ఇస్తారు. దీనిని మినీ బ్రహ్మోత్సవంగా వ్యవహరిస్తారు.సప్తమి అంటే ఏడు కనుక ఏడు వాహనాల మీద స్వామి వారు తిరుమాడావీధులలో విహరిస్తారు. రోజు ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలై, శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభతో ముగుస్తుంది.

2025:  ఫిబ్రవరి 04

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages