Antarvedi Tirukalyanam 2025: శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవములు 2025 - అంతర్వేది
శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవములు మాఘ శుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
04/02/2025 - జయవారం :- రథసప్తమి రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు స్వామి వారి అభిషేకం, 10 గంటల కు సుదర్శన హోమం, సాయత్రం 4:30 గంటలకు ' సూర్య వాహనం ' పై గ్రామెత్సవం.
-> సాయంత్రం 6:30 గంటలకు శ్రీస్వామివారిని పెండ్లి కుమారుని, అమ్మవారిని పెండ్లికుమార్తె ( ముద్రికాలంకరణ) ను చేస్తారు..
◆ రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనం పై గ్రామోత్సవం.
¤ 05/02/2025 - బుధవారం : ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు స్వామి వారి అభిషేకం, 10 గంటల కు సుదర్శన హోమం,
అష్టమి రోజు సాయంత్రం
-> సాయంత్రం 4.గంటలకు ' గరుడ పుష్పక' వాహనం పై గ్రామోత్సవం..
-> సాయంత్రం 7 గంటలకు థూపసేవ అనంతరం " పుష్పక వాహనం ' పై గ్రామోత్సవం.
¤ 06/02/2025 :: నవమి, గురువారం, రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు స్వామి వారి అభిషేకం, 10 గంటల కు సుదర్శన హోమం,
-> సాయంత్రం 4.గంటలకు ' హంస వాహనం ' పై గ్రామోత్సవం.
-> సాయంత్రం 6:30 గంటలకు థూపసేవ, "ధ్వజారోహణం" అనంతరం 'శేష వాహనం ' పై గ్రామోత్సవం.
¤ 07/02/2025 : దశమి, శుక్ర వారం, రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
-> సాయంత్రం 4:00.గంటలకు ' పంచముఖ ఆంజనేయ స్వామి ' వాహనం పై స్వామి గ్రామోత్సవం.
-> రాత్రి 8 గంటలకు ' కంచు గరుడ ' వాహనం పై స్వామి
గ్రామోత్సవం .
->> రాత్రి 12:55 నిముషములకు మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు
""శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కల్యాణం.""
¤ 08/02/2025- : భీష్మ ఏకాదశి స్ధిరవారం , రోజునఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
మథ్యాహ్నం 2:05 గంటలకు
""స్వామి వారి రథోత్సవం""
¤ 09/02/2025 -ద్వాదశి, ఆదివారం , రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
-> సాయంత్రం 4.గంటలకు 'గజ వాహనం ' పై స్వామి గ్రామోత్సవం .
-> సాయంత్రం 7:00 గంటలకు ' అన్నపర్వత మహానివేదన '.అనంతరం 'పొన్న వాహనం 'పై స్వామి గ్రామోత్సవం.
¤ 10/02/2025- త్రయోదశి, సోమవారం, రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
->మథ్యాహ్నం 4 గంటలకు ' హనుమ వాహనం ' పై స్వామి గ్రామోత్సవం.
-> సాయంత్రం 5 గంటలకు 'సదస్యం' అనంతరం థూపసేవ.
-> రాత్రి 7 గంటలకు ' సింహ వాహనం' పై స్వామి గ్రామోత్సవం.
¤11/02/2025: చతుర్దశి, జయవారం,
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
-> సాయంత్రం 4 గంటలకు 'రాజాధిరాజ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం.
-> రాత్రి 7 గంటలకు'అశ్వ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం, అనంతరం 16 స్థంభముల మండపం వద్ద " చోరసంవాదం " .
¤12/02/2025 : మాఘ పౌర్ణమి, బుధవారం రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు. ఉదయం 8:00
గంటలకు గరుడ పుష్పక వాహనం పై స్వామి వారి
" చక్రవారి " ; సముద్ర స్నానం.
రాత్రి థ్వజ అవరోహణ.
¤13/02/2025- బహుళ పాడ్యమి, గురువారం, రోజున
ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, అలంకారం,బాలబోగం అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనములు.
సాయంత్రం 5:00
గంటలకు ' పుష్పక వాహనం ' పై గ్రామోత్సవం.
-> సాయంత్రం 6 గంటలకు ' హంసవాహనం ' పైస్వామివారి " తెప్పోత్సవము " అనంతరం తిరుమంజనము, దర్పణసేవ, ధూపసేవ, ద్వాదశతిరుమంజనం, విష్వక్సేనఆరాధన, పుణ్యహవచనం, శ్రీ పుష్పోత్సవం, చెంగోలం విన్నపం, తీర్ధగోష్టి, స్వామి వారి పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
Comments
Post a Comment