Skip to main content

Ksheerabdi Dwadasi: క్షీరాబ్ది ద్వాదశి

కార్తిక మాసంలో వచ్చే శుక్ల ద్వాదశి అత్యంత పుణ్యప్రదమైన రోజు. ఈ రోజును క్షీరాబ్ధి ద్వాదశి అని పిలుస్తారు. హరిబోధినీ ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి, చిలుకు ద్వాదశి, కైశిక ద్వాదశి, తులసి ద్వాదశి అనే పేర్లు కూడా ఈ రోజుకు వ్యాప్తిలో ఉన్నాయి.

శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశి రోజున శ్రీమహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి తన భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా అంటారు. బృందావనం అంటే మన ఇంట్లో ఉండే తులసి. ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం వస్తుందని ప్రతీతి. 

దుర్వాస మహర్షి చేత శపించబడి వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు సూచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగరమథనం ప్రారంభించారు. అలా క్షీరసాగరాన్ని మధించినరోజు కాబట్టి ఈరోజు 'క్షీరాబ్ధి ద్వాదశి'గా పేరు పొందింది. ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొని మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శనమిచ్చింది ఈ ద్వాదశినాడే కాబట్టి ఈ రోజుకు క్షీరాబ్ది ద్వాదశి అనే పే ఏర్పడింది.

కార్తిక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుంచి మేల్కొని మరునాడు ద్వాదశి రోజున బృందావనాన్ని ప్రవేశిస్తాడు. స్వామి బృందావనం చేరుకున్న సందర్భం చాలా గొప్పది. ఆ సందర్భంగా స్వామిని శ్రద్ధగా పూజించిన వారికి ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి. ధన ధాన్య సంపదలు కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల సమకూరుతాయి. ప్రత్యేకంగా ద్వాదశి రోజు సాయం సంధ్యాసమయంలో పూజలు చేసి, దానధర్మాలు చేస్తే మరింత ఎక్కువ పుణ్యఫలితం కలుగుతుంది. పాలసముద్రం నుంచి లక్ష్మీ సమేతంగా వచ్చిన స్వామి కొలువై ఉన్న బృందావన క్షేత్రంలో తులసీ సమేతంగా విష్ణుమూర్తికి అర్చనలు చెయ్యాలి. అలా చేసిన వారికి సకల పాపాలు తొలగిపోయి, శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతారు. దేవతలతో పాటు యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, మహర్షులు కూడా బృందావనంలో ఉన్న శ్రీమహావిష్ణువును పూజిస్తారు.

బృందావనంలో ఉన్న శ్రీహరిని ద్వాదశి రోజున పూజించినట్లయితే అన్ని పాపాల నుంచి విముక్తి లభించి, మరణించిన తర్వాత పుణ్యలోకాల్లో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది. బృందావనంలో స్వామికి ద్వాదశి రోజున చేసే పూజలు, అర్చనలు ఎంతో పుణ్యప్రదమైనవి. అవి స్వామికి ఎంతో ప్రీతి కలిగిస్తాయి. బృందావనంలో ఉన్న స్వామిని కార్తిక శుద్ధ ద్వాదశి రోజున ఆరాధించిన వారికి బ్రహ్మహత్యాదోషం, బంగారాన్ని దొంగిలించిన దోషం, సురాపానం చేసిన దోషం, గురువు గారి మంచం మీద పడుకున్న దోషం మొదలైన విపరీత దోషాలు కూడా మంటల్లో పడిన దూది వలే క్షణకాలంలో నశిస్తాయి. బృందావనంలో ఉన్న స్వామిని తులసీ సమేతంగా అర్చించినట్లయితే శ్రీహరికి ఎంతో ప్రీతి కలుగుతుంది.

బృందావనంలో ఉన్న స్వామిని పూజించటానికి ముందుగా ఆ ప్రాంతమంతా ముగ్గులు వెయ్యాలి. శంఖం, చక్రం, గద, కౌముది, ఆవు పాదాలు మొదలైన వాటిని కూడా ముగ్గుతో వెయ్యాలి. దీపారాధన చెయ్యాలి. చక్కటి స్వరంతో సంగీత వాద్యాలు మోగించాలి. బ్రాహ్మణుల చేత వేదపారాయణ చేయించాలి. లక్ష్మీనారాయణుల విగ్రహాలను తులసీ సమేతంగా పీఠం మీద ఉంచి, ఆ ప్రతిమలకు చక్కగా అలంకారం చెయ్యాలి. శాస్త్రవిధానంగా పూజ చేసి, పు పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి. కొత్త బట్టలు, ఆభరణాలతో కూడా అలంకారం చెయ్యాలి. పుష్పాలతో పూజచేసి, సిద్ధం చేసుకున్న పిండివంటలు, కొబ్బరికాయలు, బెల్లపు పానకం, ఖర్జూర పండ్లు, అరటి పండ్లు మొదలైనవాటిని స్వామికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పించాలి. శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో పూజ చెయ్యాలి. ఆడంబరాల కన్నా పరిశుద్ధమైన మనస్సు ఎంతో ముఖ్యం. శక్తిలోపం లేకుండా అర్చనలు చెయ్యాలి. శాస్త్రం చెప్పిన విధంగా స్వామికి అర్చనలు చేసిన వారికి అన్ని విధాలైన సుఖసంపదలు, విజయం కలుగుతాయి.

ఏదైనా కారణం వల్ల ఈ వ్రతాన్ని చెయ్యలేకపోయినవారు పండితులవద్ద తులసీ మాహాత్మ్య కథను వినాలి. భక్తిశ్రద్ధలతో ఈ కథను విన్నవారికి కూడా విష్ణులోక నివాస యోగ్యత కలుగుతుంది. ఎవరైనా ఈ వ్రతాన్ని చేస్తుండగా చూసినవారికి కూడా గంగానదిలో స్నానం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. స్వామికి ఇచ్చిన హారతిని కళ్ళకు అద్దుకుని, భక్తితో నమస్కరించినవారికి విష్ణుమూర్తిని పూజించిన పుణ్యం కలుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత అక్షతలను స్వీకరించి శిరస్సు మీద వేసుకోవాలి.

ద్వాదశి రోజున బృందావనంలో దీపదానం చెయ్యాలి. దీనివల్ల పాపదోషాల నుంచి విముక్తి కలుగుతుంది. పది దీపాలు దానం చేస్తే శివసన్నిధిలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది. అంతకన్నా ఎక్కువ దీపాలు దానం చేసిన వారికి స్వర్గానికి అధిపతి అయ్యేంతటి పుణ్యం కలుగుతుంది. దీపాలను చూసి నమస్కారం చేసిన వారికి ఆయుష్షు పెరుగుతుంది. బుద్ధిబలం, ధైర్యం, సంపదలు కలుగుతాయి. పూర్వజన్మకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది.

దీపారాధన చెయ్యటానికి ఆవునెయ్యి ఉపయోగించాలి. అది దొరకని వారు నువ్వులనూనె, అదీ దొరకకపోతే కొబ్బరినూనె, చివరకు మంచినూనెతో అయినా దీపారాధన చెయ్యవచ్చు. ఆవునెయ్యి ఉత్తమ ఫలితాన్ని, మంచి నూనె మధ్యమ ఫలితాన్ని, విప్పనూనె మొదలైనవి అధమ ఫలితాన్ని ఇస్తాయి. దీపం వెలిగించి, దానం చేస్తే జ్ఞానవృద్ధి జరుగుతుంది. దీపారాధన చెయ్యటానికి నూనె దానం చేస్తే సంపదలు, కీర్తి కలుగుతాయి. విప్పనూనెతో దీపం వెలిగిస్తే లౌకికమైన భోగాలు కలుగుతాయి. వసతైలంతో చేస్తే కోరికలు తీరుతాయి. అవ, అవిశ నూనెలతో దీపారాధన చేస్తే శతృవుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. గేదె నెయ్యి, ఆముదంతో దీపం వెలిగిస్తే పూర్వపుణ్యం కూడా నశిస్తుంది. గేదె నెయ్యి, ఆవు నెయ్యి కలిపి దీపం వెలిగిస్తే దోషం ఉండదు. ఒకటే వత్తితో వెలిగించిన దీపాన్ని దానం చేస్తే అన్నివిధాలైన పాపాలు తొలగి, చక్కటి బుద్ధి, తేజస్సు కలుగుతాయి. నాలుగు వత్తులతో వెలిగించిన దీపాన్ని దానం చేస్తే రాజయోగం కలుగుతుంది. పదివత్తులు వేసిన దీపాన్ని దానం చేస్తే చక్రవర్తి యోగం కలుగుతుంది. యాభై వత్తులతో చేసిన దీపాన్ని దానం చేస్తే దేవతాగణాల్లో స్థానం కలుగుతుంది. వంద వత్తులతో చేసిన దీపాన్ని దానం చేస్తే విష్ణుశక్తి కలుగుతుంది. ఈ దానాన్ని విష్ణుక్షేత్రంలో తులసి సన్నిధిలో చేస్తే వంద రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. గంగాతీరంలో చేసిన వారికి మూడు రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. కార్తిక శుద్ధ ద్వాదశి రోజున విష్ణు సన్నిధిలో దీపదానం చేస్తే నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. బృందావన సన్నిధిలో విష్ణుపూజ చేసినవారికి ఉత్తమ గతులు కలుగుతాయి. భక్తితో పూజ చేసినవారు, చివరకు పూజ చూసిన వారు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది, చివరకు విష్ణు సన్నిధికి చేరుకుంటారు.

క్షీరాబ్దిద్వాదశి రోజున ఇంకొకరు వెలిగించిన దీపం కొండెక్కకుండా కాపాడిన వారికి కూడా అక్షయ పుణ్యఫలాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తికమాసం నెల రోజులూ దీపాలు పెట్టటం సంప్రదాయం.. ఆచార విధి కూడా. ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో అయినా దీపం వెలిగిస్తే, వైకుంఠప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తిక మాసంలో శనిత్రయోదశి కన్నా సోమవారం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. శనిత్రయోదశి కన్నా కార్తిక పూర్ణిమ వందరెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. పూర్ణిమ కన్నా బహుళ ఏకాదశి కోటి రెట్లు పుణ్యఫలితాలు అనుగ్రహిస్తుంది. బహుళ ఏకాదశి కన్నా క్షీరాబ్ధి ద్వాదశి అతి విస్తారమైన, అనంతమైన ఫలితాన్నిస్తుందని భాగవతం చెబుతోంది.

క్షీరాబ్ధి ద్వాదశి రోజున తెలియకుండానే చేసిన దీపారాధన ఘోర పాపాలను సైతం తొలగింపజేస్తుందనటానికి ఈ వృత్తాంతం చక్కని ఉదాహరణ.

కర్మనిష్ఠుడి వృత్తాంతం

పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన విష్ణుదేవాలయం ఒకటి ఉండేది. కర్మనిష్ఠుడనే యోగి ఆ ఆలయాన్ని తన తపస్సుకు అనువైన ప్రాంతంగా ఎంచుకుని, ఆలయాన్ని శుభ్రం చేసి, దీపాన్ని వెలిగించి, ధ్యానం ప్రారంభించాడు. ఆ సమయంలో అక్కడి కలుగులో ఉన్న ఒక ఎలుక, ఆహారం కోసం వెతుకుతూ, ఏమీ దొరక్క పోవటంతో ప్రమిదలో ఉన్న నూనె తాగటం ప్రారంభించింది. ఈ క్రమంలో నూనెలోకి జారుకున్న ఒక వత్తి, వెలుగుతున్న మరొక వత్తికి అంటుకుని, వెలిగింది. వెలుగు ఎక్కువ కావటంతో ఎలుక నూనె తాగలేకపోయింది. ఇంతలో ఆ ఎలుక నుంచి దివ్య పురుషుడు ఉద్భవించాడు. దివ్యదృష్టితో విషయం గ్రహించిన కర్మనిష్ఠుడు, అనేక పాపాల ఫలితంగా సదాచార వంశంలో పుట్టిన బ్రాహ్మణుడికి ఎలుక జన్మ వచ్చిందనీ, క్షీరాబ్ధి ద్వాదశి రోజున తెలియకుండానే దీపం వెలిగించిన పుణ్యఫలితంగా పాపాలన్నీ నశించి, వైకుంఠ ప్రాప్తి కలిగిందని చెబుతాడు.

మొత్తంగా క్షీరాబ్ధి ద్వాదశి వృత్తాంతాన్ని పరిశీలిస్తే, అద్భుతమైన ఆధ్యాత్మిక బోధ మనకు అందుతుంది. అజ్ఞానంతో తాను చేసేదంతా ఒప్పు అనుకోవటం నుంచి అరిషడ్వర్గాలను జయించి, వినయంతో భగవంతుని పాదాలకు మోకరిల్లే జ్ఞానాన్ని క్షీరాబ్ధి ద్వాదశి మనకు అందిస్తుంది.

2024: నవంబర్ 13.

Comments

Popular posts from this blog

Utthana Ekadasi: ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన్న ఏకాదశి

  కార్తీక మాస శుద్ధ ఏకాదశినే ప్రబోధ ఏకాదశి, బృందావన ఏకాదశి, భోధన ఏకాదశి. దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనికూడా అంటారు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్రనుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి, ఉపవాస దీక్ష విరమించి వ్రతం ముగించాలి. కార్తీక మాసంలో ప్రతి రోజూ పవిత్రమైనదే. ఈ మాసంలో వచ్చే ఏకాదశి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. కార్తీక ఏకాదశి మహత్మ్యం గురించి స్కందపురాణంలో వివరించారు. పాపాలను హరించే ఈ ఏకాదశి వ్రతం పాటిస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణ వచనం. ఈ రోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా, అనంతమైన పుణ్య ఫలం లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవ

Vaikunta Chaturdashi: వైకుంఠ చతుర్దశి

కార్తీక శుద్ధ చతుర్దశినే వైకుంఠ చతుర్దశి అంటారు. ఈ రోజున భక్తి ప్రపత్తులతో శ్రీహరిని ధ్యానించి నివేదనలు సమర్పిస్తే అపరిమితమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివ, విష్ణు ఆలయాల్లో దీపాలు పెడితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసమంతా దీపాలు పెట్టలేనివారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ మూడు రోజులైన దీపాలు వెలిగిస్తే పాపాలు హరించుకుపోతాయి. ఇతరులు పెట్టిన దీపాన్ని కొండెక్కకుండా చూసినవారి పాపాలుకూడా ఆ దీపాగ్నిలో కాలిపోతాయని పురాణ వచనం. కొండెక్కిన ఇతరుల దీపాలను వెలిగించినవారికీ ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శ్రీహరి స్వయంగా శివుడిని పూజిస్తాడని పురాణ కథనం. అందుకే ఈ రోజును అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. శివ కేశవులు వేరుగా కనిపిస్తున్నప్పటికి వారిద్దరూ ఒకటేనని వేదాలు చెబుతున్నాయి. కార్తీక శుద్ధ చతుర్దశినాడు శ్రీమహావిష్ణువుకు దీపాలను అర్పించినవారికి వైకుంఠంలో స్థానం లభిస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకున్నా మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున చేసే ప్రతి పని అక్షయమవుతుందట. అందుకని పాపాలు చేయకుండా పుణ్యాలు మాత్రమే చేయడం వలన

Akshaya Navami: అక్షయ నవమి

  కార్తీక మాస శుక్లపక్ష నవమిని ఆక్షయ నవమి అంటారు. ఈ తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సత్య యుగం ప్రారంభమైంది ఈ రోజునేనని చెబుతారు. ఈ రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం శ్రేష్టం. ఈ రోజున వేకువజామునే లేచి, నదీస్నానం ఆచరించడం, పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం, దానం ఇవ్వడం శుభ ఫలితాలనిస్తుంది.  ఈ రోజున చేసే దానాలు, పూజలు రెట్టింపు ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున ప్రత్యేకించి పండ్ల దానం, ముఖ్యంగా ఉసిరి కాయలను దానం చేయాలి.  అక్షయ నవమి రోజున ఏ కార్యం చేపట్టిన విజయవంతం అవుతుందని విశ్వసిస్తారు. అక్షయ నవమి రోజున త్రికరణశుద్ధిగా పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణ వచనం. ఈ రోజున విష్ణు విజయ స్తోత్రం, కనకధారా స్థవం, దుర్గా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం వంటి స్తోత్రాలు పఠించాలి.  దైవానికి చక్కెర పొంగళి, దద్ధోజనం నైవేద్యంగా సమర్పించాలి.  ఉసిరి చెట్టులో శివకేశవులు కొలువై ఉంటారు కనుక ఈ రోజున ఉసిరి చెట్టుకు పూజచేయడం, దీపం వెలిగించడం ఉసిరి చెట్టుకింద భోజనాలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ముందుగా ఉసిరి చెట్టు కింద శుభ్రపరిచి తూర్పు దిశగా నిలబడి పూజ చేయాలి. ఆ చెట్టుకు నీరు, పాలను అందించాలి.  పూ

Karthika Puranam: కార్తీక పురాణం 10వ అధ్యాయము - అజామిళ పూర్వజన్మ వృత్తాంతము

  జనకుడు  తిరిగి ఇట్లు అడిగెను. ఓమునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మ మందెవ్వడు? ఏమిపాపమునుజేసెను? విష్ణుదూతలు చెప్పిన మాటలనువిని యమభటులు ఎందుకు యూరకుడిరి? యముని వద్దకు పోయి యమునితో ఏమనిచెప్పిరి ? వసిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా యమునివద్దకుబోయి సర్వవృత్తాంతమును యమునితో జెప్పిరి. అయ్యా! పాపత్ముడును, దురాచారుడును, నిందితకర్మలను ఆచరించు వాడును నగు అజామిళుడు తోడితెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించు టకు అశక్తులమైవచ్చితిమి అని చెప్పిది. ఆ మాటను వినికోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈ అజా మిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను. అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలిసికొనక హరినామస్మరణ చేసినను పాపములు నశించును. తెలియక తాకినను అగ్నికాల్చునుగదా! భక్తితో నారాయణ స్మరణను జేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షము నొందును. యముడిట్లు విచారించి యూరకుండెను. అజామిళుడు పూర్వజన్మమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండ

Keelapatla Konetiraya Temple: శ్రీ కోనేటిరాయ స్వామి ఆలయం - కీలపట్ల

  శ్రీమహావిష్ణువు లోకకల్యాణానికై శ్రీవైకుంఠాన్ని వదలి కోనేటిరాయస్వామిగా భువిపై వెలసిన మహిమాన్విత దివ్యక్షేత్రం కీలపట్ల, చిత్తూరుజిల్లాలోని పలమనేరు సమీపంలో గంగవరం మండలంలో ఉంది. చోళ రాజులకాలంలో యుద్దసిపాయిల ముఖ్యమైన పటాలం' అటవీ ప్రాంతమైన కోటిపల్లి సమీపాన ఉండేదట. చిన్నదండు (పటాళం) ఉండే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్ని 'కీళ్పటాలం' అని పిలిచే వారు. జనవాడుకలో కీళ్పటాలం, కీళ్పట్టు, కీళ్పట్టణం-కీల పట్లగా స్థిరపడింది. కీలపట్లలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని బ్రహ్మమానస పుత్రుడు భృగుమహర్షి ప్రతిష్టించినాడని ప్రతీతి. జనమేజయమహారాజుకాలంలో ఈ గుడి నిర్మించబడిందని, పల్లవరాజులు, చోళరాజులు ఈ గుడిని పునర్నిర్మించినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తుంది. లక్ష్మీదేవి తన నివాసస్థానమైన వక్షఃస్థలంపై భృగుమహర్షి తన్నినందున వైకుంఠవాసునిపై ప్రణయ కలహాన్ని పూని భూలోకానికి వెళ్లింది. విష్ణువు లక్ష్మీదేవిని అన్వే షిస్తూ వైకుంఠాన్ని వదలి శ్రీవేంకటాచలానికి వేంచేశాడు. పరతత్త్వమైన శ్రియఃపతి ఆకాశరాజుకుమార్తె పద్మావతిని వివాహ మాడాడు. భక్తసంరక్షణకై లక్ష్మీపద్మావతులతో కలియుగంలో పలుచోట్ల దుష్టశిక్షణ, శిష్టరక్షణకై అర్చావతా

Karthika Puranam: కార్తీక పురాణం 14వ అధ్యాయము - మాసచతుర్దశీమాహాత్మ్యము, మాసశివరాత్రివ్రత ఫలము

  కార్తిక పూర్ణిమాదినమందు వృషోత్సర్గమును (ఆబోతు, అచ్చు పోయుట) చేయువానికి జన్మాంతరీయ పాపములుకూడా నశించును. కార్తిక వ్రతము మనుష్యలోక మందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది కార్తిక పూర్ణిమనాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జేయువానికి కోటి మాఱులు గయాశ్రాద్ధమును జేసిన ఫలముగలుగును. రాజా ! స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తిక పూర్ణిమనాడు నల్లని గిత్తను, గిత్తదూడనులేక ఆబోతును విడుచునా, అట్లయిన మనము తృప్తిబొందుదు మని కోరుచుందురు. ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తిక పూర్ణిమ రోజున వృషోత్సర్గ మును జేయనివాడు యమలోకమందు అంథతమిశ్రమను నరకమును బొందును. కార్తిక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్ధములు సేవించినను, మహాలయము పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్స ర్గము సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తికపూర్ణిమనాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పనియేమున్నది? కార్తికమాసమందు అన్నిపుణ్య ముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవృణ మనుష్యఋణ పితృఋణముల నుండి

Karthika Puranam: కార్తీక పురాణం 13వ అధ్యాయము - కార్తికద్వాదశీమాహాత్మ్యము, సువీరశ్రుతకీర్తి కథ

  వసిష్ఠుడిట్లు చెప్పెను. జనకరాజా ! కార్తికమాసమందు చేయదగిన ధర్మములను జెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మము లన్నియు ఆవశ్యకములైనవి. రాజా! కార్తికధర్మములు మా తండ్రియైన బ్రహ్మచేత నాకుజెప్పబడినవి. అవియన్నియు చేయదగినవి చేయని యెడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాట గోరువారును, నరకభయముగలవారును ఈ ధర్మములను తప్పక చేయ వలెను. కార్తీకమాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము జేయించుటకు ధనమిచ్చుట విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తికమాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయన మును జేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపఫలములు వలన పంచమహాపాతకములు భస్మ మగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును జెప్పుటకు నాకు శక్యముగాదు. పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును, నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును, నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మనున కుపనయనము చేయించిన పుణ

Kapilatheertham Temple: శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం - కపిలతీర్థం

కపిల తీర్థం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం, పుణ్యతీర్థం. ఈ ఆలయంలోని శివలింగం కపిల ముని ప్రతిష్టించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని శ్రీ కపిలేశ్వర స్వామిగా పిలుస్తారు. ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం.ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి నలువైపులా కనిపించే తిరుమల కొండలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయండంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆ కొండల మీద నుంచి దాదాపు 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకి ప్రవహించే ఆకాశగంగను కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు. కోనేటికి నలువైపులా మెట్లు నిర్మించి ఉండటం వలన ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు

Karthika Puranam: కార్తీక పురాణం 15వ అధ్యాయము - కార్తికదీపమాలార్పణ మహిమా, కర్మనిష్ట చరితము

  ఓ జనకమహారాజా ! తిరిగి కార్తిక మాహాత్మ్యమును జెప్పెదను. భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తికమాసమందు హరిముం దఱ నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందిర నివాసియగును. కార్తికమాసమందు ద్వాదశినాడు హరికి దీవమాలార్పణ చేయువాడు వైకుంఠమునకుబోయి సుఖించును. కార్తిక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి యగును. కార్తికమాసమందు నెల రోజులు నియతముగా విష్ణ్వాలయమునకు దర్శనార్ధము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును బొందును. సందేహములేదు. కార్తికమాసమందు హరిసన్నిధికిపోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్యముక్తిని పొందును. కార్తికమాసమందు విష్ణ్వాలయ దర్శనార్ధము వెళ్ళనివాడురౌరవ నరకమును, కాలసూత్రనరకమును పొందును. కార్తికశుద్ధ ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజచేసిన పుణ్యమునకు అంతములేదు. కార్తిక శుక్లద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడి భక్తితో హరిని గంధములతోను, పుష్పములతోను, అక్షతలతోను, ధూపముతోను, దీపములతోను, ఆజ్యభక్ష్య నైవేద్యముల తోను పూజించువాని పుణ్యమునకు మితిలేదు. కార్తికశుద్ధ ద్వాదశినాడు విష్ణ్వాలయ మందుగాని, శివాలయమందుగాని లక్షదీపములను వెలిగించ