Thilatharpanapuri Temple: నరముఖ గణపతి ఆలయం - తిలతర్పణపురి

 

తమిళనాడులో “తిలతర్పణపురి” అనే గ్రామంలో ‘స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారార్’ ఆలయంను పితృదోషంతో బాధపడుతున్నవారు దర్శిస్తే. దోషాన్ని పోగొట్టుకోవచ్చుఅట. ఈ ఆలయంలో స్వయంగా శ్రీరామ చంద్రుడు తన తండ్రి దశరథుడికి పితృకార్యక్రమాలు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

తన తండ్రికి ఎన్నో చోట్ల పిండప్రధానం చేసినా ముక్తి లభించకపోవడంతో… రాముడు.. శివుడిని ప్రార్ధించగా. శివుడు ప్రత్యక్షమై. ఈ ఊరులో ఉన్న కొలనులో స్నానం చేసి. దశరథుడికి పితృతర్పణం వదిలి పెట్టమని చెప్పిన స్థలం.

అందుకనే అప్పటి నుంచి ఆ ఊరుని తిలతర్పణపురి అని అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం ఎక్కడైతే రాముడు తిలలు వదిలాడో ఆ ఊరు తిలతర్పణపురిగా ప్రసిద్ధి పొందింది.

రాముల వారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారడం జరిగింది. అందుకనే ఎవరైతే పెద్దలకు పితృతర్పణం నిర్వహించలేక బాధలు ఇబ్బందులు పడుతుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణలు వదలడం తో దోషం నుంచి విముక్తి లభిస్తుంది అట.

భారతదేశంలో ముఖ్యమైన ఏడు స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం, తిరువెంకాడు, గయ, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా ఈ ఆలయం చెప్పబడుతోంది.

ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉన్నది. అది ఏమిటంటే. నరముఖంతో ఉన్న గణపతి ఉన్నారు. గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో వుంటారు. ఇటువంటి గణపతి ఆలయం చాలా అరుదుగా ఉంటుంది.

అందుకనే ఈ ఆలయం నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి గా ప్రసిద్ధిపొందింది. తమిళనాడులోని తిరునాల్లార్శని భగవానుని ఆలయంకు 25 కి.మీ దూరంలో, కూతనూరు సరస్వతీ ఆలయం కు 3 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Kashi Yama Aditya Temple: యమ ఆదిత్య ఆలయం - కాశీ