చాంద్రమానం ప్రకారం మార్గశిరమాసం సంవత్సరంలో తొమ్మిదో నెల.మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైనది. మార్గశిరం సర్వం పర్వదినాల సమాహారం. మార్గశిర మాసాన్నే 'మార్గశీర్షం' అని కూడా వ్యవహరిస్తారు.
మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసం లో చేసే ఏ పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు.
- హేమంత ఋతువు ఈ మాసంతో ప్రారంభం అవుతుంది.
- వైష్ణవ సంప్రదాయంలో ఈ మాసానికి విశిష్టత ఉంది.
- ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే తులసిచెట్టు మొదలులోవున్న మట్టిని తీసి, ఆ మట్టిని స్నానం చేసేటప్పుడు శరీరానికి పూసుకొని, గంగాది పుణ్యనదులను స్మరిస్తూ స్నానమాచరించి విష్ణువును పూజించాలి అని శాస్త్రం చెబుతోంది.
- ఈ విధంగా చేయడం వల్ల పాపాలన్నీ హరింపబడి ఇహంలో సౌఖ్యం పారంలో మోక్షం లభిస్తాయని చెబుతారు.
- ఏకాదశి లాంటి పర్వదినాలలో విష్ణువును పంచామృతాలతో అభిషేకించడం మంచిది.
- విష్ణు సహస్రనామపారాయణ కూడా మంచి ఫలితాన్నిస్తుంది.
- ఈ మాసంలో సూర్యారాధన, సూర్యస్తోత్ర పారాయణాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు లభిస్తాయి.
- ఈ మాసంలో చలి బాగా ప్రబలుతోంది. కాబట్టి ఉష్ణాన్ని కలిగించే ఆయా పదార్దాలు విడిగా భుజించాలి అనే నియమము కూడా ఉంది.
- మార్గశిర శుద్ధ ద్వాదశిని తిరుమలలోని స్వామి పుష్కరిణికి తీర్థదినంగా చెబుతారు.ఈ రోజున సూర్యోదయ వేళ భూలోకంలో వుండే మూడుకోట్ల తీర్థరాజాలు స్వామివారి పుష్కరిణిలోకి చేరుతాయట.ఈ రోజు పుష్కరిణిలో స్నానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు.
- మార్గశిర శుద్ద పంచమి రోజున నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది.ఈ రోజు నాగ పంచమిగా జరుపుకుంటారు.
- మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా జరుపుకుంటారు.
- 'మిత్రసప్తమి' గా పేర్కొనే మార్గశిర శుక్లపక్ష సప్తమి నాడు జగన్మిత్రుడు, లోకాలకు కాంతినిచ్చే సూర్యదేవుని ఆరాధిస్తారు.
- మార్గశిర అష్టమిని కాల భైరవాష్టమి గా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది.
- మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని 'గీతాజయంతి'గా జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ఞాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు.
- మార్గశిర శుద్ద పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామీ ని నోరార పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.
- కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాదులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకం గా ఈ దినం యమధర్మ రాజుని ఆరాదిస్తారు. ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
ఈ మాసం లో పండుగలు
- వివాహ పంచమి
- గీత జయంతి
- మోక్షాదా ఏకాదశి
- దత్తాత్రేయ జయంతి
- సఫాల ఏకాదశి
- హనుమాన్ వ్రతం.
2024 లో మార్గశిర మాసం నుండి డిసెంబర్ 02 నుండి డిసెంబర్ 30 వరకు .
ఇంకా ఈ మాసం లో భగవద్గీత చదవం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తిరుమలలో ఈ మాసం లో శ్రీవారికి సుప్రభాతం బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. ప్రతి గురువారం మార్గశిర లక్ష్మి వ్రతం చేస్తారు.
Comments
Post a Comment