Skip to main content

Kukke Subramanya Temple: శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం - కుక్కే


కర్ణాటక రాష్ట్రంలో మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.

పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కే గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగా వెలిసి నిత్యపూజలందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు.

పురాణచరిత్ర…

సుబ్రహ్మణ్య స్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రం చేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కే సుబ్రహ్మణ్య ఒకటి కావడం విశేషం.

నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కే క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రహ్మణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.

ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి తదితర పూజలను నిర్వహిస్తారు.

ఆశ్లేష బలి పూజ:

శ్రీ క్షేత్రం కుక్కే సుబ్రమణ్య దేవస్థానంలో జరిగే అతి పెద్ద కాలసర్ప దోష పూజ ఈ ఆశ్లేష బలి పూజ. సుబ్రమణ్య స్వామి కాల సర్ప దోషము, కుజ దోషముల నుండి భక్తులను రక్షిస్తాడు. ఆశ్లేష బలి పూజ ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాలలో జరప బడుతుంది. ఈ పూజ బ్యాచ్లలో రెండు సమయాలలో జరుపుతారు. మొదటిది ఉదయం  7:00 కు, రెండవది ఉదయం 9:15 కు మొదలవుతుంది. పూజకు హాజరయ్యే భక్తులు తమ తమ బ్యాచ్ ప్రారంభ సమయానుసారం దేవస్థానం లోపల సంకల్పం చేసే పురోహీతుడి ముందు హాజరు కావలెను. హోమ పూర్ణహుతి అనంతరం భక్తులకు ప్రసాదాలు అందచేయబడుతాయి. భక్తులు శ్రావణ, కార్తీక, మృగశిర మాసాలను ఈ పూజ చెయ్యటానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు.

సర్ప సంస్కార / సర్ప దోష పూజలు

సర్ప దోషము నుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈ పూజను చేస్తారు. పురాణనుసారం, ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేక గత జన్మలో కానీ, తెలిసి కానీ, తెలియక కానీ పలు విధములలో ఈ సర్ప దోష బాధగ్రస్టుడు అయ్యే అవకాశం ఉంది. సర్ప దోష బాధితులకు పండితులు ఈ సర్పదోష నివారణ పూజను విముక్తి మార్గంగా సూచిస్తారు. ఈ పుజను ఒక వ్యక్తి కానీ, తన కుటుంబంతో కానీ, లేక పూజారి గారి ఆద్వర్యంలో కానీ చెయ్యవచ్చును. ఈ పూజా విధానం ఒక వ్యక్తి మరణానంతరం జరిగే శార్డం, తిథి, అంత్యక్రియ పూర్వ పూజలలా ఉంటుంది. సార్పాసాంస్కార పూజ చెయ్య దలిచిన భక్తులు రెండు రోజులు సుబ్రమణ్య సన్నిధిలో ఉండవలెను. ఈ పూజ సూర్యోదయం చెయ్యబడుతుంది. ఆ రోజు వేరే ఎటువంటి పూజలు చెయ్యకూడదు. ఈ పూజా ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవస్థానం వారు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే భుజించాలి. పూజను ఎంచుకున్న భక్తుడిని కలుపుకొని నలుగురుకి దేవస్థానం వారు భోజన సదుపాయం కలిపిస్తారు.

తులునాడు ప్రాంతం ఉన్న కర్నాటక, కేరళలో సర్ప దేవుడుకి ఉన్న బహుళ ప్రాముఖ్యం వల్ల ఈ ప్రాంతాల్లో అన్ని మతాలు, వర్గాల వారు ఈ పూజను జరిపిస్తారు. స్వామి వారికి జరిగే మడెస్నానం ఒక ముఖ్యమైన సేవ. స్వామి వారికి మడే స్నానం సేవ ఎంతో ఇష్టం. వీధి మడే స్నానం మరో ముఖ్యమైన సేవ.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.

రోడ్ మరియు రైలు ద్వారా:

బెంగుళూరు నుంచి 278 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు నుంచి 100 కి.మీ. దూరంలో వుంది. 

Comments

Popular posts from this blog

కార్తీక అమావాస్య విశిష్టత

కార్తిక అమావాస్య నాడు పంచ పల్లపాలతో (రావి, మర్రి, జువ్వి, మోదుగు, మేడి) అభ్యంగన స్నానమాచరించాలి. దీనిని పంచత్వక్ ఉదక స్నానం అని అంటారు.  ఆశ్వయుజ, కార్తీక అమావాస్యల నాడు స్వాతి నక్షత్రం కలిసి ఉండే అవకాశం ఉంది కావున ఆశ్వయుజ అమావాస్య నాడు చేసే అన్ని విధులు కార్తిక అమావాస్య నాడు కూడా ఆచరించాలి.  స్వాతి నక్షత్రం పాడ్యమి లేదా విదియ నాడు ఉన్నా అభ్యంగన స్నానమాచరించాలి. దారిద్ర్యాన్ని తొలగించుటకు లక్ష్మీపూజ చేయాలి. ప్రదోష సమయంలో స్నానమాచరించి దేవాలయాల్లో, ఇంటిలో, దేవతా వృక్షాల వద్ద, కూడళ్ళలో దీపాలు వెలిగించి బ్రాహ్మణులను, పెద్దలను పూజించి భోజనం చేయాలి.

Lingashtakam: లింగాష్టకం అర్ధం తెలుగులో

  నిరాకారుడిగా కొలువైన శివయ్యను ఆరాధన వెనుకున్న ఆంతర్యం,  లింగాష్టకం అర్థం బ్రహ్మ మురారి సురార్చిత లింగం (బ్రహ్మ , విష్ణు , దేవతలతో పూజలందుకున్న లింగం) నిర్మల భాషిత శోభిత లింగం ( నిర్మలమైన మాటలతో అలంకరించిన లింగం) జన్మజ దుఃఖ వినాశక లింగం ( జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం) తత్ ప్రణమామి సదా శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !) దేవముని ప్రవరార్చిత లింగం (దేవమునులు , మహా ఋషులు పూజించిన లింగం) కామదహన కరుణాకర లింగం ( మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే శివలింగం) రావణ దర్ప వినాశక లింగం ( రావణుడి గర్వాన్ని నాశనం చేసిన శివ లింగం) తత్ ప్రణమామి సద శివ లింగం ( సదా శివ లింగమా నీకు నమస్కారం !) సర్వ సుగంధ సులేపిత లింగం ( మంచి గంధాలు లేపనాలుగా పూసిన లింగం) బుద్ధి వివర్ధన కారణ లింగం (మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ) సిద్ధ సురాసుర వందిత లింగం (సిద్ధులు , దేవతలు , రాక్షసులు కీర్తించిన లింగం) తత్ ప్రణమామి సదా శివ లింగం (సదా శివ లింగమా నీకు నమస్కారం !) కనక మహామణి భూషిత లింగం (బంగారం , మహా మణులతో అలంకరించిన శివ లింగం) ఫణిపతి వేష్టిత శోభిత లింగం ( నాగుపాముని...

మన పండుగలు సంస్కృతీ ప్రతిబింబాలు

మానవ జీవితం ముఖ్యంగా ప్రకృతిపై ఆధారపడి వుంటుంది. ఈ ప్రకృతిలోని మార్పులను జ్యోతిషశాస్త్రం ఆధారంగా గుర్తించి, గ్రహ నక్షత్రాదుల ప్రభావాలను పరిశీలిస్తూ, కాలానుగతికమైన పండుగలను ధర్మశాస్త్రం నిర్ణయిస్తుంది. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవడం పండుగల ఏర్పాటులో ముఖ్యమైన ఉద్దేశం. నోములు, వ్రతాలు, ఉత్సవాలు, పర్వాలు, పండుగలు అంటూ వాటికి మనం పేర్లు పెట్టుకుంటున్నాం. ఈ దేశంలో సంవత్సరం మొత్తం ఏదో రూపంలో ఏదో ఒక పర్వం నిర్వహిస్తూనే వుంటారు. పండుగలు జరుపడంలో  మహిళల దే  ప్రముఖ పాత్ర.   మహిళలు   అధికసంఖ్యలో ఐకమత్యంతో పాల్గొని చురుకుగా చేసే పండుగల్లో బోనాలు, బతుకమ్మ, గొబ్బెమ్మ లు అగ్రస్థానంలో నిలుస్తాయ. శ్రావణమంగళ, శుక్రవారాల్లో నోచే నోములకూ ప్రముఖస్థానమే.   మాసాలపరంగా ఆలోచిస్తే మన పండుగల్లో మొట్టమొదటి చైత్రశుద్ధ పాడ్యమినాడు నిర్వహించే 'ఉగాది' పండుగ. తెలుగువారికే ఇది ప్రత్యేకమైన పండుగ. ఈరోజు ఆరు రుచులతో కూడుకున్న వేపపువ్వు పచ్చడిని ఆరగించిన తర్వాతనే మిగిలిన పనులు ప్రారంభిస్తాము. ప్రకృతికి నమస్కరించే తెలుగువారి మొదటి పండుగ ఇది. సంక్రాంతి తెలుగువారు న...

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి

  గోవత్స  ద్వాదశి అనగా మన ఆవులు లేదా గోవులు కోసం జరుపుకునే పండుగ.  ఆశ్వయుజ మాసం లో కృష్ణపక్ష ద్వాదశి రోజు ఈ పండుగ జరుపుకుంటారు  ఇది సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో వస్తుంది.  కొని చోట్ల దీనిని నందిని వ్రతం అని కూడా పిలుస్తారు. దీని తరువాత రోజు ధనత్రయోదశి దీనిని గురించి భవిష్య పురాణం లో కూడా చెప్పబడింది. ఈ రోజు ముఖ్యంగా గోవులను పూజిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం గోవులు ఎంతో పవిత్రమైనవి, మన రోజు వారి జీవితం లో కూడా అవి ఒక  భాగంగా చాల మంది చూసుకుంటారు.  ఉత్తర భారతదేశంలో అయితే ఈ పండుగను చాల బాగా  జరుపుకుంటారు .   సంతానం లేని వారు ఈ రోజు వ్రతం  ఆచరిస్తారు. ఉత్తర భారత దేశం లో కొంత మంది వ్యాపారులు ఈ రోజు నుంచి కొత్త అకౌంట్ పుస్తకాలూ రాస్తారు. ఈ రోజు ఎవరైతే గోవును పూజిస్తారో వారికీ మంచి ఆరోగ్యం తో పాటు సుఖసంపదలు కలుగుతాయి అని భావిస్తారు.  ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం లో శ్రీ పాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవం జరుగుతుంది.  ఉదయాన్నే  గోవులకు స్నానం చేసి పసుపు కుంకుమతో అలంకరిస్తారు. గోవులు అంటే శ్రీ కృష్ణడుకి ఎంతో ఇష్టం కన...

Margashira Vratam: మార్గశిర లక్ష్మివార వ్రతం

మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మివార వ్రతము అంటారు. ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుటవల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, తలస్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, తలకు నూనే రాసుకొనుట, దువ్వుకోనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవాలి  మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం, లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ, కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారం చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొద...

Poigai Alwar: పొయిగై ఆళ్వార్

పొయిగై ఆళ్వారు ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో దేవాలయాల నగరంగా, ప్రసిద్ధిచెందిన కాంచీపురంలో అవతరించారు. వీరి తల్లిదండ్రులు ఎవరో, వీరి కులమేమిటో అనే విషయం తెలియదు. వీరిని అయోనిజుడిగా చెబుతారు. కాంచీపురంలోని ఆలయాల్లో శ్రీ యోథత్కరీ స్వామివారి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి 'తిరువెక్కా' అని పేరు. ఈ ఆలయానికి ఉత్తరం వైపున పుష్కరిణి వుంది. ఈ పుష్కరిణిలోని పద్మంలో పొయిగై ఆళ్వారు అవతరించినట్లు కథనం.  పొయిగై ఆళ్వారు ఈ పుష్కరిణిలో సిద్ధార్థినామ సంవత్సరం సౌరమాసమైన తులామాసంలో అంటే చాంద్రమాన ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష అష్టమి మంగళవారం నాడు శ్రవణానక్షత్రంలో పద్మంలో అవతరించాడు. 'పొయై' అంటే సరోవరం అని అర్థం. పుష్కరిణిని సరోవరం అని కూడా అంటారు. సరోవరంలో అవతరించిన ఆళ్వారు కనుక ఈయనకు పొయైగై ఆళ్వారు అనే పేరు వచ్చినట్లు కథనం. అంతేకాకుండా, సరోవరంలో ఆవిర్భవించిన వారు కావడం వల్ల వీరికి 'సరోయోగి', 'కాసోయోగి' అనే బిరుదులు వచ్చాయి. వీరు ఆళ్వారులలో మొదటి వారుగా చెప్పబడుతూ వుండటం వల్ల పొయైగై ఆళ్వారుకు 'ఆదియోగి' అనే పేరు కూడా బిరుద నామంగా ఏర్పడింద...

Gopashtami: గోపాష్టమి

కార్తీక మాస శుక్ల పక్ష అష్టమిని గోపాష్టమి అంటారు. ఈ రోజు కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఇది కృష్ణుడు గోవును పూజించిన శుభదినం. ఈ పవిత్ర దినం దీపావళి అమావాస్య ఎనిమిదో రోజున వస్తుంది. శ్రీకృష్ణుడు ఈ రోజున గోవుకు పూజ చేయడం మంచిదని తెలిపినట్టు పురాణాలు చెబుతున్నాయి. చెప్పడమే కాదు శ్రీకృష్ణుడు కూడా ఈ రోజున గోపూజలు చేసేవాడట. గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత సురభీదేవి. కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారు. గోవుకే 'మాత' అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.  గోపాష్టమి రోజున గోవులను శుభ్రమైన నీటితో కడిగి, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. గోమాతకు అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. హారతులిచ్చి గోవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి. గోవు తోక భాగాన్ని స్పృశించి నమస్కరించాలి. ఈ రోజున కృష్ణుడి వెంట ఆవులను అడవికి పంపినట్లు అనేక పురాణగాధలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆవులను ప్రత్యేకంగా పూజించుకుంటారు. గోవు సకల దేవతా స్వరూపం కనుక గోవును పూజిస్తే సకల దేవతలు తృప్తి చెందుతా...

Srisailam Vrudha Mallikarjuna Swamy: వృద్ధ మల్లికార్జున స్వామి - శ్రీశైలం

శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్నది ఈ వృద్ధ మల్లికార్జున స్వామి ఉపాలయం. ఈ లింగం కొన్ని వేల సంవత్సరాల నాటిది అని చెబుతారు.  శ్రీశైలం ఆలయంలో వెలసిన వృద్ధ మల్లికార్జున స్వామికి రోజూ ఉ. 6.30 గంటలకు అభిషేకం జరుగుతుంది. వృద్ధ మల్లికార్జున స్వామి పురాణ గాథ: పురాణ గాథల ప్రకారం ఒక రాజకుమారి శివుని భక్తురాలు. ఆమెకు శివునిపై అనురాగం పెరిగింది. శివుని వివాహం చేసుకోవాలనే ఆలోచన ఆమె మదిలో మెదిలింది. దీనితో రాజకుమారి శివలింగం వద్దనే ఎక్కువగా కాలం గడిపేది. ఒకరాతి శివుడు ఆమెకు కలలో దర్శనమిచ్చి తెల్లవారగానే ఒక నల్ల తేనెటీగ కనిపిస్తుందని, దాని వెంట బయలుదేరి రావాలని , తాను వచ్చే వరకు ఆ ఈగ ఎక్కడ ఆగితే అక్కడే ఉండాలని ఆదేశించాడు. మరుసటి ఉదయం రాజకుమారికి నల్లటి తేనెటీగ కనిపించింది. ఆమె దాని వెంట ప్రయాణం కట్టింది. ఈగ శ్రీశైలం కొండ చేరుకొని అక్కడ ఒక మల్లెపొదపై ఆగిపోయింది. దీనితో రాజకుమారి శివుని కోసం అక్కడే ఆగిపోయింది. ఆమె శివుని పూజిస్తూ రోజులు గడపసాగింది. అక్కడ కొందరు గిరిజనులు రాజకుమారికి రోజూ అన్నపానీయాలు సమకూర్చసాగారు. చివరకు శివుడు రాజకుమారికి ఒక వృద్ధుని వేషంలో కనిపించాడ...

Margashira Month: మార్గశిర మాసం 2024

  చాంద్రమానం ప్రకారం మార్గశిరమాసం సంవత్సరంలో తొమ్మిదో నెల.మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైనది. మార్గశిరం సర్వం పర్వదినాల సమాహారం. మార్గశిర మాసాన్నే 'మార్గశీర్షం' అని కూడా వ్యవహరిస్తారు. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసం లో చేసే ఏ పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు. హేమంత ఋతువు ఈ మాసంతో ప్రారంభం అవుతుంది. వైష్ణవ సంప్రదాయంలో ఈ మాసానికి విశిష్టత ఉంది. ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే తులసిచెట్టు మొదలులోవున్న మట్టిని తీసి, ఆ మట్టిని స్నానం చేసేటప్పుడు శరీరానికి పూసుకొని, గంగాది పుణ్యనదులను స్మరిస్తూ స్నానమాచరించి విష్ణువును పూజించాలి అని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా చేయడం వల్ల పాపాలన్నీ హరింపబడి ఇహంలో సౌఖ్యం పారంలో మోక్షం లభిస్తాయని చెబుతారు. ఏకాదశి లాంటి పర్వదినాలలో విష్ణువును పంచామృతాలతో అభిషేకించడం మంచిది. విష్ణు సహస్రనామపారాయణ కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ఈ మాసంలో సూర్యారాధన,...