కాలాన్ని కొలిచేందుకు రెండు విధానాలు వున్నాయి ఒకటి సౌరమానం, ఇంకోటి చంద్రమానం.సూర్యుడు పనెందు రాశులలో ఒకో రాశిలో సంక్రమణం చెందుతూ ఉండడమే సౌరమానంలో ఒక మాసం అవుతుంది. ఇలా రాశులతో సంక్రమణ చేసే సమయంలో ధనస్సు రాశితో సూర్యుడు సంక్రమణం చెందిప్పుడు వచ్చేదే ధనుర్మాసం.
చాంద్రమానం ప్రకారం ధనుర్మాసం మార్గశిర, పుష్య మాసం మధ్య వస్తుంది. ఈ మాసంలో ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. విష్ణు ఆలయాలలో ఉదయానే సుప్రభాతం బదులు తిరుప్పావై పాశురాలనే చదువుతారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసం డిసెంబర్ 16 మొదలై జనవరి 13/14 వరకు ఉంటుంది.
Comments
Post a Comment