Skip to main content

Karthika Puranam: కార్తీక పురాణం 9వ అధ్యాయము - యమదూత సంభాషణము, విష్ణుదూతోక్తి అజామిళునివిముక్తి

 

విష్ణుదూతలడిగిరి. ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీయమదందనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? పాతకమనగా ఏమి ? ఈ విషయములన్నిటిని మాకు జెప్పుడు. ఇట్లని విష్ణుదూతలడుగగా యమదూతలు లిట్లు పల్కిరి.

ఓ విష్ణుదూతలారా! సావధానముగా వినుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను వేసిన వానిని దండింతుము.

వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధుబహిస్కృతుడైన వానిని మేము దందింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగినిపాదములచేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండింతుము.

నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారమును వదలిన వారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వానిని, డాంబికుని, దయా శాంతులు లేనివానిని, పాపకర్మలందాసక్తులైన వారిని మేము దండింతుము.

పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును జెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకొనువానిని, మిత్ర ద్రోహిని, ఉపకారమును మరచిన వానిని అపకారమును జేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను జూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును జూచి దుఃఖించువానిని కన్యాశుల్కముల చేత జీవించువానిఇన, వడ్డీతో జీవించువానిని మేము దండింతుము. చెరువును, నూతిని, చిన్నకాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములయిన వాటిని చెరుచు వానిని మేము దండింతుము. మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విదచినవానిని, నిత్యకర్మను వదలిన వానినిమేము దండింతుము.

పరపాకపరిత్యాగిని, పరపాకరతుని, పితృశేషాన్నమును భుజించు వానిని మేము దండింతుము. పరపాకపరిత్యాగియనగా తాను వండిన అన్నములో ఇతరులకు యెంత మాత్రమును బెట్టకతానే అంతయు భుజించు వాడు. పితృశేషాన్నభోక్తయనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు.

ఇతరుడు దానము చేయుసమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకివ్వనివానిని, తన్ను శరణుజొచ్చినవానిని చంపు వానిని మేము దండింతుము. స్నానమును సంధ్యావందనమును విడుచు వానిని, నిత్యము బ్రాహ్మణనిందకుని, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈమొదలయిన పాతక ములను జేయుమానవులు యమలోకమందుండు మాచేత యాతనలను పొందుదురు.

ఈ అజామిళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీసంగ లోలుడై పుట్టినది మొదలు చచ్చువరకు పాపములను చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితి లేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడడగును. ఈ ప్రకారముగా పలికిన యమదూతలమాటలు విని విష్ణుదూతలు చిఱునగవుతో వికసించిన ముఖపద్మ ములు గలవారై మేఘసమాన గంభీరధ్వనితో నిట్లనిరి. ఏమియాశ్చర్యము. మీరింత మూఢులు, ధర్మమర్యాదను మేము చెప్పెదము, సావధానముగా వినుడు.

దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనమును జేయువాడు యమదండార్హుడుగాడు. స్నానసంధ్యావందనము లాచరించువాడును, జపహోమాదులాచరించువాడును, సర్వభూతములందు దయావంతు డును, యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్ని హోత్రములను జేయుచు కర్మలఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడు. గాడు. కర్త భోక్తృ త్వాదులను సగుణపరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణబుద్ధితో కర్మలను ఆచరించుటచే తాత్పర్యముగా కలవాడు. యమమందిరానికి వెళ్ళడు. అన్నదాన మాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము "ఆబోతును అచ్చుపోసి వదలుట. విద్యను గోరినవారికి విద్యాదాన మాచరించువాడును, పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందడు.

హరిని బూజించువాడును, హరినామము జపించువాడును, వివాహ ములను ఉపనయనములను జేయువాడును, యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును, క్రీడాస్థానములను గట్టించువాడును, దిక్కులేని శవము నకు మంత్ర సంస్కారమును జేయించువాడును యమలోకమును పొందడు. నిత్యము సాలగ్రామార్చనమాచరించి ఆ తీర్థమునుపానముజేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందదు.

తులసీకాష్ఠమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామ మును పూజించువాడును యమలోకమును పొందదు. భాగవత మును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందుంచుకొన్నను యమలోకమును పొందదు. సూర్యుడు మేషతులా మకర సంక్రాంతుల యందుండగా ప్రాతస్నానమాచరించువారు యమలోక మును పొందరు.

రుద్రాక్షమాలికను ధరించి జపదానహోమాదులను ఆచరించువాడు యనులోక మును పొందడు. నిత్యమును అచ్యుట, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, ఓరామయని హరినామసంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశియందు మణికర్ణికా ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతినొందిన యెడలవాడు సర్వపాపములు చేసిన వాదయినను యమలోకమును పొందడు.

దొంగ, కల్లుత్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురు భార్యరతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన యెడల పాపవిముక్తులగుదురు.

మహిమను తెలిసికొనిగాని, తెలియకగానిమరణకాలమున హరి నామ సంకీర్తన గావించినవారు పాపాత్ములయినను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు బొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదులచేత పీడింపబడినప్పుడును, సప్తవ్యసనములచేత పీడింపబడునప్పుడును, వశముకానప్పుడును హరిహరీయని అన్న యెడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలె పెఱిగియున్న పాపములన్నియు భూమియందుగాని స్వర్గమందుగాని హరినామసంకీర్తనముచేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరి నామస్మరణమును జేసినయెడల వాని పాపములన్నియు అగ్నిలోనుంచిన దూదివలె నశించును.

విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిళుని యమదూతల వలన విడిపిం చిరి. తరువాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కారముచేసి మీదర్శనము వలన నేను తరించితిననెను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకుబోయిరి.

తరువాత అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంతకష్టమాయెను. ఆత్మహితము చేసికొనలేక పోతిని గదా. ఛీఛీ! నా బ్రతుకు సజ్జననిందితమాయెనుగదా, పతివ్రతయైన భార్యను వదలివేసి కల్లుద్రాగెడి ఈ దాసీభార్యను స్వీకరించితినిగదా, వృద్ధులు నాకంటే వేరేదిక్కులేని వారును పుణ్యాత్ములయిన మాతా పితరులను నీచుడనై విడిచితినిగదా, అయ్యో యెంతకష్టము, ధర్మమును చెఱుచువారు కాముకులు నిరంతరమనుభవించెడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెదివాడను.

ఇదియేమి ఆశ్చర్యము. ఇది స్వప్నమా ఆ నల్లకత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించిన వాడను ఇదినిజము. అట్లు గానిచో దాసీపతినైన నాకు మరణకాలమందు హరిస్మృతి యెట్లుగలుగును? నా జిహ్వహరినామ మును యెట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ అంత్యకాలమందీ స్మృతియెక్కడ? సిగ్గు విడిచి బ్రాహ్మణులను జంపునేనెక్కడ, మంగళకరమయిన నారాయణ నామమెక్కడ?

అజామిళుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తినిబొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని బొందెను. కాబట్టి నారాయణ నామ కీర్తన గావించువారు సమస్తపాపవిముక్తులై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందియములేదు.

Comments

Popular posts from this blog

Pushya Month 2025: పుష్య మాస విశిష్టత

  చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం.  పుష్యమాసం   తెలుగు మాసాల్లో పదోది. హేమంత రుతువులో రెండవది. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం . శివుడికి కార్తీకం. అలాగే పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు.  ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించే సంప్రదాయం ఉంది. అందుకే దీనిని సౌభాగ్య లక్ష్మీ మాసం అని కూడా అంటారు. లక్ష్మీదేవిని ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా పూజిస్తారు. ఈ నెలలోని మంగళవారాలలో లక్ష్మీదేవిని ప్రతిమలోగాని, కలశంలోగాని ఆవాహన చేసి ఆరాధిస్తే అరిష్టాలు తొలగి, కోరిన కోరికలు తీరుతాయని పం...

Devuni Kadapa Brahmotsavams: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - దేవుని కడప

టిటిడికి అనుబంధంగా ఉన్న కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 07వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.  బ్రహ్మోత్సవ సేవలు  2025 జనవరి 29  - దీక్ష తిరుమంజనం, సేనాధిపతి ఉత్సవం , అంకురార్పణం. జనవరి 30  - తిరుచ్చి ధ్వజారోహణం, చంద్రప్రభ వాహనం. జనవరి 31  - సూర్యప్రభ వాహనం, పెద్దశేష వాహనం ఫిబ్రవరి 01 - చిన్నశేష వాహనం, సింహ వాహనం. ఫిబ్రవరి 02 - కల్పవృక్ష, హనుమంత వాహనం ఫిబ్రవరి 03 - ముత్యపు పందిరి వాహనం, గరుడ వాహనం ఫిబ్రవరి 04 - కల్యాణోత్సవం, గజ వాహనం ఫిబ్రవరి 05 - రథోత్సవం, ధూళిఉత్సవం ఫిబ్రవరి 06 - సర్వభూపాల వాహనం, అశ్వ వాహనం ఫిబ్రవరి 07 - వసంతోత్సవం, చక్రస్నానం, ధ్వజావరోహణం, హంస వాహనం ఫిబ్రవరి 08 - ఫుష్పయాగం (రాత్రి).

Chittaramma Jatara 2025: శ్రీ చిత్తారమ్మ జాతర 2025

  హైదరాబాద్ లోని  కుత్బుల్లాపూర్‌ గాజులరామారంలో కొలువైన శ్రీ చిత్తారమ్మ అమ్మవారి జాతర జనవరి 17 నుండి ప్రారంభంకానుంది. ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే ముఖ్యమైన జాతరగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర నలుమూలల నుండి కాక ఇతర రాష్ట్రాల ప్రజలు జాతర సమయంలో అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో అమ్మవారి జాతర జరుగుతుంది  తేదీలు   జనవరి 17 - గణపతి పూజ, దీక్ష ధారణ, అగ్ని ప్రతిష్ట జనవరి 18 - చండి హోమం, పూర్ణాహుతి  జనవరి 19 - జాతర లో ముఖ్యమైన రోజు( అభిషేకం, విజయ దర్శనం, బోనాలు, గ్రామోత్సవం) జనవరి 20 - రంగం, దివ్యవాణి  జనవరి 21, 22, 23, 24 - కుంకుమార్చన  జనవరి 25 - అన్నదానం, జాతర ముగింపు 

Somavati Amavasya: సోమావతి అమావాస్య

సోమవారం నాడు వచ్చే అమావాస్యను  సోమావతి అమావాస్య అని పిలుస్తారు. చాల అరుదు వస్తుంది ఈ పుణ్య తిధి. ఈ రోజు చేసే చిన్న పుణ్యకార్యం అయిన రెట్టింపు అవుతుంది అని విశ్వాసం. ద్వాపర యుగం లో పాండవులు ఈ తిధి కోసం చాల సార్లు ఎదురు చూసారు అని చెపుతుంది భారతం. జాతకరీత్యా చంద్రగ్రహ స్థితి సరిగా లేని వారు పరిహారాలు చేసుకోవాలి శివునికి అభిషేకాలు, అర్చనలు చేస్తారు, పవిత్ర నదులలో స్నానాలు చేయడం, తులసి కోట వద్ద విష్ణు పూజ చేయడం మంచిది. బియ్యం , పాలు, నెయ్యి, పెరుగు వంటి వాటిని దానం చేయాలి. రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు  చేయాలి. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి, దానం చేసి నైవేద్యాలు సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. సోమావతి అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.  ఈ రోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడంవల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది.  శివుని మహామృత్యుంజయ మంత్రంకూడా పఠించాలి. అలాగే శివుని ఆరాధన ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది.  అరుదుగా వచ్చే ఈ అమావాస్య రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా కలిగే అశ...

Shani Trayodashi: శని త్రయోదశి

త్రయోదశి తిధినాడు శనివారం వస్తే ఆ రోజు శని త్రయోదశి అవుతుంది. ఆ రోజు శనిభగవానుడిని  విశేషంగా పూజిస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పము ప్రకారం శని పుష్యమాసంలోని శుక్ల పక్షంలో నవమి తిధినాడు జన్మించాడు. ఆ రోజు శనివారం, భరణి నక్షత్రంలో శని జన్మించాడు. శాంతిపీఠికలోని వివరాలు మరోరకంగా చెబుతున్నాయి. మహాతేజస్సుతో వెలుగొందే శని నిలవర్ణంలో ఉంటాడు. అయన ఛత్రం రంగు కూడా నీలమే. ఇక్కడ నిలవర్ణం అంటే నలుపు అని అర్ధం. అయన సౌరాష్ట్ర దేశంలో జన్మించాడు. అతనిది కాశ్యపస గోత్రం. మాఘ బహుళ చతుర్దశినాడు శని జన్మించాడు. ఉత్తర భారతదేశంలో శనిత్రయోదశినాడు కాకుండా అమావాస్యనాడు నిర్వహించుకుంటారు. పుర్ణిమాంత పంచాంగాలను అనుసరించి జ్యేష్ఠా అమావాస్య నాడు శనిజయంతి. తెలుగు పంచాంగాల ప్రకారం వైశాఖ అమావాస్యనాడు వస్తుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిధులు శని ఆరాధనకు తగినవని మనకు   తెలుస్తుంది. శని త్రయోదశి నాడు శనిని పూజిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏలినాటి శని, అష్టమ, అర్ధాష్టమ శని జరుగుతున్న రాశులు వారు శనిని ఆరాధించాలి. శని మహర్దశ లేదా అంతర్దశ జరుగుతున్న వారుగాని, జాతకంలో శని చేదు స్థానాలలో ఉండగా జన...

మన పండుగలు సంస్కృతీ ప్రతిబింబాలు

మానవ జీవితం ముఖ్యంగా ప్రకృతిపై ఆధారపడి వుంటుంది. ఈ ప్రకృతిలోని మార్పులను జ్యోతిషశాస్త్రం ఆధారంగా గుర్తించి, గ్రహ నక్షత్రాదుల ప్రభావాలను పరిశీలిస్తూ, కాలానుగతికమైన పండుగలను ధర్మశాస్త్రం నిర్ణయిస్తుంది. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవడం పండుగల ఏర్పాటులో ముఖ్యమైన ఉద్దేశం. నోములు, వ్రతాలు, ఉత్సవాలు, పర్వాలు, పండుగలు అంటూ వాటికి మనం పేర్లు పెట్టుకుంటున్నాం. ఈ దేశంలో సంవత్సరం మొత్తం ఏదో రూపంలో ఏదో ఒక పర్వం నిర్వహిస్తూనే వుంటారు. పండుగలు జరుపడంలో  మహిళల దే  ప్రముఖ పాత్ర.   మహిళలు   అధికసంఖ్యలో ఐకమత్యంతో పాల్గొని చురుకుగా చేసే పండుగల్లో బోనాలు, బతుకమ్మ, గొబ్బెమ్మ లు అగ్రస్థానంలో నిలుస్తాయ. శ్రావణమంగళ, శుక్రవారాల్లో నోచే నోములకూ ప్రముఖస్థానమే.   మాసాలపరంగా ఆలోచిస్తే మన పండుగల్లో మొట్టమొదటి చైత్రశుద్ధ పాడ్యమినాడు నిర్వహించే 'ఉగాది' పండుగ. తెలుగువారికే ఇది ప్రత్యేకమైన పండుగ. ఈరోజు ఆరు రుచులతో కూడుకున్న వేపపువ్వు పచ్చడిని ఆరగించిన తర్వాతనే మిగిలిన పనులు ప్రారంభిస్తాము. ప్రకృతికి నమస్కరించే తెలుగువారి మొదటి పండుగ ఇది. సంక్రాంతి తెలుగువారు న...

Srirangam Temple: శ్రీరంగం ఆలయం

కావేరీ విరజానదిగాగ, వైకుంఠం రంగమందిరంకాగా, ఆ వాసుదేవుడు స్వయంగా రంగేశుడు కాగా సాక్షత్తు పరమపదమై అలరారుతున్న దివ్యదేశం శ్రీరంగం. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ తెంగలైసంప్రదాయంలో పూజాదికాలు జరుగుతాయి. మనదేశంలోని అతి పెద్ద, అతిముఖ్య, అతిపురాతన ఆలయాలలో ఒకటి శ్రీరంగం. ప్రపంచంలోనే అతి పెద్ద మత ప్రదేశంగా ఈ ఆలయానికి ప్రసిద్ది ఉంది. ఈ ఆలయం అద్భుత కళాఖండంగా ఈ ఆలయం 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో, 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు) స్థలంలో నిర్మితమైంది. దీని ప్రాకారం పొడవు 4 కిలోమీటర్లు (10,710 అడుగులు). ఆసియాలోనే అతిపెద్ద రాజగోపురం ఈ ఆలయానికి ఉంది. దీన్ని13 సెంట్ల భూమిలో 236 అడుగుల (72 మీటర్లు) ఎత్తుతో, 11 అంతస్తులతో నిర్మించారు. ఈ ఆలయంలోరంగనాథ స్వామి సన్నిధితో పాటు, 53 ఉప-సన్నిధులూ ఉన్నాయి. ధన్వంతరి సన్నిధి, గరుడాళ్వార్ సన్నిధి, ఉడయవర్ సన్నిధి, తాయారు సన్నిధి, హయగ్రీవార్ సన్నిధి, చక్రధ్వజ్వర్ సన్నిధి, వేయి స్తంభాల మండపం, చిన్న నీటి కొలనులు ప్రధానమైనవి. ఈ ప్రహరీలు దృఢమైన, భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్...

Karthika Masam Danam: కార్తీక మాసంలో ఏ ఏ రోజు ఏమి దానం చేస్తే బాగుంటుంది?

  కార్తీకంలో ప్రతి రోజు అమూల్యమైనదే కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఆచరిస్తే సత్ఫలితాలు పొందుతారు. ఏ రోజు ఏమి దానం చేస్తే మంచిది. ♦ మొదటి రోజు : నెయ్యి, బంగారం. ♦ రెండవ రోజు : కలువపూలు, నూనె, ఉప్పు. ♦ మూడో రోజు : తదియ రోజున పార్వతీదేవిని పూజించాలి. ఉప్పు దానం చేయడం శుభప్రదం. ఫలితంగా శక్తి, సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ♦ నాలుగో రోజు : కార్తీకశుద్ధ చవితి. నాగులచవితిని పురస్కరించుకుని వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయాలి. నూనె, పెసరపప్పు, దానం ఇవ్వాలి. సద్భుద్ది, కార్యసిద్ధి సాధ్యమవుతుంది. ♦ ఐదో రోజు : ఈ రోజును జ్ఞానపంచమి అంటారు. ఆదిశేషుని పూజించాలి. ఫలితంగా కీర్తి లభిస్తుంది. ♦ ఆరో రోజు : షష్టి రోజున బ్రహ్మచారికి ఎర్ర గళ్ళకండువా దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు. ♦ ఏడో రోజు : సప్తమి రోజున దుర్గాదేవిని పూజించాలి. ఎర్రని వస్త్రంలో గోధుమలు దానం చేయాలి. దీంతో ఆయుష్సు వృద్ధి చెందుతుంది. ♦ ఎనిమిదో రోజు : అష్టమినాడు గోపూజ చేస్తే విశేష ఫలితాలు ఇస్తుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. ♦ తొమ్మిదో రోజు : నవమినాటి నుంచి మూడు రోజుల పాటు విష్ణుత...

Pushya Masam: పుష్యమాసంలో ఆదివారం సూర్యాస్తమయానికి ముందే భోజనాలు చేస్తారెందుకు?

పుష్యమాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ నెలలో గ్రహసంచారం శుభకార్యాలకు, సుముహూర్తాలకు అనువుగా ఉండదనే కారణంగా అలా అంటారు. ఈ మాసంలో గ్రహానుకూలత కోసం, గ్రహరాజు అయిన సూర్యుని అనుగ్రహం కోసం ఆయనకు ప్రీతిపాత్రమైన ఆదివారం నాడు సూర్యారాధన చేస్తారు. ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యునికి ప్రత్యేక నివేదన చేస్తారు. ఆ ప్రసాదాన్ని సూర్యాస్తమయానికి ముందే భోజనంగా స్వీకరిస్తారు. ఈ సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది.

Mantra Importance: మంత్రస్మరణ వైశిష్ట్యం

మననం చేసే కొలదీ రక్షించేది మంత్రం, మనస్సును రక్షిస్తుంది. కనుకనే మంత్రం అని  అన్నారు. స్పష్టాక్షరమైన పలుకే మంత్రం. దేవతలు మంత్రాలకు అధీనులు. మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు స్వరపేటిక, దానికి సంబంధించి నరాలు ఒక నిర్ణీతరీతిలో పనిచేస్తాయి. ఇందువల్ల ఉచ్చారణ సరిగ్గా ఉంటుంది. నాలుక స్పష్టంగా చలిస్తుంది. ఒక శబ్దాన్ని ఉచ్చరించాలంటే 72 స్నాయువులు పని చేస్తాయి. ఏయే రీతిలో స్నాయువులు పనిచేస్తే ఆయా శబ్దాలవల్ల ఆయానరాలు ఉత్తేజితాలవుతాయి. ఇవి సంస్కృతభాష వల్లనే సాధ్యం. మంత్రోచ్చారణతో జనించే శబ్దతరంగాలు చెవిపైనా, దాని ద్వారా ఇతర నరాల పైనా మంచి ప్రభావం చూపుతాయి. మంత్రనాదం వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇందువల్ల వాక్శక్తి పెరుగుతుంది. అనువాదాలు మంత్రాలు లేవు. మంత్రాల్లోని ఒక్కొక్క అక్షరమూ ఒక దేవతాశక్తికి బీజమే! మంత్రాల అర్థం ఏదైనా కావచ్చు. కానీ వాటిల్ని ఆపద్ధతి ప్రకారం ఉచ్చరిస్తూంటే దేహంలో విద్యుత్తు ఉత్పాదనం జరుగుతుంది. ఇందువల్ల శరీరం మిక్కిలి చైతన్యవంతమై- పవిత్రవంతమవుతుంది. కనుక మంత్రతస్మరణవల్ల మనస్సు, బుద్ధి, చిత్తం, హృదయం, ముఖం, శరీరం పరిశుద్ధమవుతాయి. వాళ్ళు శక్తిమంత...