Ramba Vratam: రంభావ్రతం

వివాహం ఆలస్యమవుతున్న యువతులకు శీఘ్రంగా వివాహం కుదిరేలా... మంచి భర్త లభించేలా చేసే వ్రతం-"రంభావ్రతం". 'రంభాతృతీయ' అని కూడా పేరున్న ఈ వ్రతాన్ని జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష తదియనాడు ఆచరించాలని శాస్త్రవచనం. 'రంభ' అనే సంస్కృత శబ్దానికి 'అరటి' అని అర్థం. అరటి చెట్టుతో ముడిపడి వున్న వ్రతం కనుక దీనికి 'రంభావ్రతం" అనే పేరు ఏర్పడింది. పూర్వం ఈ వ్రతాన్ని భృగుమహర్షి సలహా మేరకు పార్వతీదేవి ఆచరించి పరమ శివుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్రతం ఆచరణలోకి రావడం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ వుంది. పిలవకుండానే దక్షయజ్ఞానికి వెళ్ళిన శివుడి దేవేరి సతీదేవిని, ఆమె తండ్రి దక్షప్రజాపతి తీవ్రంగా అవమానించడంతో సతీదేవి యోగాగ్నిని రగుల్చుకుని అందులో దూకి ఆహుతైనది. మరుజన్మలో ఆమె పర్వతరాజు అయిన హిమవంతుడు, మేనకలకు కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించింది. పార్వతీదేవి యుక్త వయస్కురాలైన తర్వాత తపస్సు చేస్తున్న శివుడికి సేవ చేసేందుకు హిమవంతుడు ఆమెను నియమించాడు. శివుడికి సేవచేస్తున్న పార్వతీదేవికి శివుడిపట్ల అనురాగం పెరిగి శివుడినే భర్తగా పొందాలనుకుంది. కాగా, తారకాసురు...