Vellala Sanjeevaraya Swamy Temple: శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం - వెల్లాల


హనుమంతుడు ఆవిర్భవించిన అతి ప్రాచీన క్షేత్రాలలో 'వెల్లాల' ఒకటి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ హనుమంతుడు సంజీవరాయుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

ఆలయ స్థల పురాణం

శ్రీరామాయణ గాథతో ముడిపడి ఉన్న ఈ ఆలయ స్థల పురాణం గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది. రామరావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని కోసం హిమాలయాలకు బయలుదేరిన హనుమంతుడు మార్గమధ్యంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడానికి ఇక్కడికి సమీపంలోని 'కుందూ' నది దగ్గర కొంతసేపు ఆగాడట. సూర్యునికి అర్ఘ్యం సమర్పించుకుని తిరిగి బయలు దేరే సమయంలో హనుమను ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మహర్షులు చూసారంట!

మహర్షుల కోరిక మేరకు వెలసిన హనుమ

కుందూ నది తీరంలో హనుమను దర్శించుకున్న మహర్షులు స్వామిని అక్కడే కొంతసేపు ఉండమని అడిగారట! కానీ లక్ష్మణుని ప్రాణాలు కాపాడటం కోసం సంజీవని త్వరగా తేవాలన్న ఆతృతలో హనుమ 'వెళ్లాలి వెళ్లాలి' అంటూ తొందరపడ్డాడంట! కాలక్రమేణా హనుమ ఉచ్చరించిన 'వెళ్లాలి వెళ్లాలి' అనే మాటలే ఈ గ్రామానికి 'వెల్లాల' అనే పేరుతో స్థిరపడ్డాయని స్థానికుల కధనం. అటు తర్వాత హనుమ మహర్షుల అభ్యర్థన మేరకు ఇక్కడ వెలసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.

ఆలయ నిర్మాణం

సంజీవరాయ హనుమాన్​కు 15వ శతాబ్దంలో 'హనుమంత మల్లు' అనే రాజు ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. పచ్చని ప్రకృతి శోభ మధ్య వెలసిన ఈ ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

వ్యాధుల బాధలు దూరం

వెల్లాల సంజీవరాయ హనుమాన్ ఆలయంలోని హనుమంతుడిని దర్శించుకోవడం వలన, వ్యాధులు, బాధలు దూరమవుతాయనేది భక్తుల విశ్వాసం. హనుమత్ దీక్ష తీసుకున్న భక్తులు, ఈ క్షేత్రంలో దీక్ష విరమిస్తుంటారు.

పూజోత్సవాలు

వెల్లాల సంజీవరాయ హనుమాన్ ఆలయంలో నిత్యపూజలు యధావిధిగా జరుగుతాయి. ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే శ్రీరామనవమి, హనుమత్ విజయోత్సవం, హనుమజ్జయంతి సందర్భంగా ఆలయంలో విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. మంగళవారం, శనివారం, హనుమజ్జయంతి పర్వదినాల్లో స్వామికి ఆకుపూజ, సింధురపూజ, వడమాల, అప్పాలమాల వంటివి విశేషంగా నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవాలి?

కడప నుంచి ఈ ఆలయానికి చేరుకోడానికి బస్సులు కలవు.

Comments

Popular posts from this blog

Puri Ratha Yatra: పూరీ జగన్నాధుని రథయాత్ర

Ashada Month 2025: ఆషాడ మాసం

Ashada Navratri 2025: ఆషాడ నవరాత్రి, వారాహి నవరాత్రి

Amrutha Lakshmi Vrat: అమృత లక్ష్మీ వ్రతం

Pandharpur Yatra 2025: పండరీపుర్ యాత్ర – భక్తి, ఐక్యతకు ప్రతిరూపం

Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి

Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య

Skanda Panchami: స్కంద పంచమి

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Srisailam Temple: శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం - శ్రీశైలం