Jyestha Masam 2025: జ్యేష్ఠ మాసం - ఈ నెలలో ముఖ్యమైన పండుగలు, తిథులు

తెలుగు మాసాలలో మూడవ మాసం జ్యేష్ఠ మాసం బ్రహ్మ దేవునికి ప్రీతికరమైనది. గ్రీష్మ ఋతువులో వచ్చే జ్యేష్ఠ మాసంలో ఎన్నో పండుగలు, మరెన్నో పుణ్య తిధులు ఉంటాయి. ఈ కథనంలో జ్యేష్ఠ మాసంలో రానున్న పండుగలు, విశేషమైన తిధుల గురించి తెలుసుకుందాం.

మే 28 వ తేదీ బుధవారం నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. ఇక ఈ మాసంలో మనం జరుపుకోబోతున్న పండుగ విశేషాలు తెలుసుకుందాం.

మే 28 వ తేదీ బుధవారం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి/ విదియ: జ్యేష్ఠ మాసం ప్రారంభం చంద్ర దర్శనం, కర్తరి త్యాగం.

మే 29 వ తేదీ గురువారం జ్యేష్ఠ శుద్ధ తదియ: రంభావ్రతం

మే 30 వ తేదీ శుక్రవారం జ్యేష్ఠ శుద్ధ చవితి: మహతి చతుర్థి

జూన్ 1 వ తేదీ ఆదివారం జ్యేష్ఠ శుద్ధ షష్టి: అరణ్యక వ్రతం

జూన్ 2 వ తేదీ సోమవారం జ్యేష్ఠ శుద్ధ సప్తమి: తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జూన్ 3 వ తేదీ మంగళవారం జ్యేష్ఠ శుద్ధ అష్టమి: శుక్ల దేవ్యారాధనం

జూన్ 5 వ తేదీ గురువారం జ్యేష్ఠ శుద్ధ దశమి: దశ పాపహరవ్రతం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం

జూన్ 6 వ తేదీ శుక్రవారం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి: నిర్జల ఏకాదశి

జూన్ 7 వ తేదీ శనివారం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, బక్రీదు పండుగ

జూన్ 8 వ తేదీ ఆదివారం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి/ త్రయోదశి: రామలక్ష్మణ ద్వాదశి, పక్ష ప్రదోషం, మృగశిర కార్తె ప్రారంభం

జూన్ 9 వ తేదీ సోమవారం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి/ చతుర్దశి: తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేకం ప్రారంభం

జూన్ 10 వ తేదీ మంగళవారం జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి/పౌర్ణమి: గురుమూఢమి ప్రారంభం.

జూన్ 11 వ తేదీ బుధవారం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి: శ్రీవారి జ్యేష్టాభిషేకం సమాప్తం. ఏరువాక పున్నమి.

జూన్ 14 వ తేదీ శనివారం జ్యేష్ఠ బహుళ తదియ/ చతుర్థి: సంకష్ట హర చతుర్థి

జూన్ 15 వ తేదీ ఆదివారం జ్యేష్ఠ బహుళ చవితి/ పంచమి: మిథున సంక్రమణం

జూన్ 19 వ తేదీ గురువారం జ్యేష్ఠ బహుళ అష్టమి/ నవమి: త్రిలోచనగౌరి వ్రతం

జూన్ 21 వ తేదీ శనివారం జ్యేష్ఠ బహుళ ఏకాదశి: యోగిని ఏకాదశి

జూన్ 22 వ తేదీ ఆదివారం జ్యేష్ఠ బహుళ ద్వాదశి: ఆరుద్ర కార్తె ప్రారంభం

జూన్ 24 వ తేదీ మంగళవారం జ్యేష్ఠ బహుళ చతుర్దశి: మాసశివరాత్రి

జూన్ 25 వ తేదీ బుధవారం జ్యేష్ఠ బహుళ అమావాస్య: గాండ్ల అమావాస్య, జ్యేష్ఠ మాసం సమాప్తం

Comments

Popular posts from this blog

Puri Ratha Yatra: పూరీ జగన్నాధుని రథయాత్ర

Ashada Month 2025: ఆషాడ మాసం

Ashada Navratri 2025: ఆషాడ నవరాత్రి, వారాహి నవరాత్రి

Amrutha Lakshmi Vrat: అమృత లక్ష్మీ వ్రతం

Pandharpur Yatra 2025: పండరీపుర్ యాత్ర – భక్తి, ఐక్యతకు ప్రతిరూపం

Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి

Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య

Skanda Panchami: స్కంద పంచమి

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Srisailam Temple: శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం - శ్రీశైలం