కౌతాళం మండలం హాల్వి గ్రామంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 3 నుంచి ఉత్స వాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆలయం సుమారు 20 వేల ఏళ్లనాటిదని గ్రామపెద్దలు, పూర్వీకులు చెబుతుంటారు.
పూర్వం కృతాయుగంలో త్రిశంకు మహారాజు తన గురువు బృహస్పతి కుమార్తెను రహస్యంగా వివాహమాడారు. ఈ విషయం తెలుసుకున్న గురువు బృహస్పతి రాజ్యాన్ని పాలించే అర్హత రాజుకు లేదని శపిం చారు. ఆ శాప విమోచనం జర గాలంటే మూడు గోపురాలున్న 360 ఆలయాలను నిర్మించాలని రుషులు చెప్పడంతో త్రిశంకు రాజు దానిని ఆచరి స్తారు. ఈ రకమైన ఆలయాలు కర్ణాటకలోని మాన్వి తాలుకాలో హిరే కౌతాళంలో త్రయంబకేశ్వ. రాలయం, హాల్వి, హొళగుందలో సిద్ధేశ్వరాలయం పేరుతో ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇప్ప టికీ పాకిస్థాన్లో కూడా మూడు గోపురాలున్న ఆలయం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.
హాల్విలోని సిద్ధేశ్వర స్వామి జాతర, రథోత్సవం ఫిబ్రవరి 7న సాయంత్రం జరుగనుంది.
ఫిబ్రవరి 3వ తేదీ అర్ధరాత్రి సిద్ధేశ్వర స్వామి, సిద్ధలింగమ్మ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో స్వామివారికి గంగాజలాభిషేకం, రుద్రాభిషేకం. బిల్వార్చన,
ఫిబ్రవరి 7న శుక్రవారం మహారుద్రాభిషేకం, అలంకరణ, సాయంత్రం రధోత్సవం కార్యక్రమాలు జరుగనున్నాయి.
No comments:
Post a Comment