అనంతపురానికి ఐదు కిలో మీటర్ల దూరంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సిద్దరాంపురం రోడ్డు సమీపాన దేవరకొండపై శ్రీలక్ష్మీ సహిత వేంకటేశ్వరుడు (కొండమీద రాయడు) వెలిశాడు.
బుక్కరాయసముద్రం గ్రామానికి దక్షణాన కిలోమీటరు దూరంలో దేవరకొండ ఉంది. ఈ కొండపైన శిఖరాగ్రాన వేంక టరమణుడు సతీసమేతంగా కొలువుదీరాడు. పూర్వం గార్గూయ మహర్షి దేవరకొండపైన కఠోర తపస్సు చేశాడని చరిత్ర చెబుతోంది. ఆయన తపస్సు ఫలించి వేంకటేశ్వరుడు దేవరకొండపై ప్రత్యక్షమైనట్లు పురాణాల కథనం.
మహర్షి కొండపైన చూడముచ్చటగా ఉన్న రెండు బండరాళ్ల మధ్యలో గుహలాంటి ప్రదేశంలో వేంకటేశ్వరుడి శిలావిగ్ర హాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. విజయనగర సామ్రాజ్యం కాలంలోనే దేవరకొండపై వెలసిన వేంకటేశ్వరుడి ఆలయం అభివృద్ధికి నోచుకుంది. విజయనగర రాజులే ఇక్కడ బ్రహ్మోత్సవాలను ప్రారంబించినట్లు చరిత్ర చెబుతోంది. మాఘ మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో కొండమీదరాయుడిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తులు విశ్వాసం.
ఫిబ్రవరి 5 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి,
ఫిబ్రవరి 6 - అంకురార్పణ, హోమం, ధ్వజారోహణం, పుష్ప పల్లకి సేవ
ఫిబ్రవరి 7 - సింహ వాహన సేవ
ఫిబ్రవరి 8 - శేష వాహన సేవ
ఫిబ్రవరి 9 - హనుమంత్ వాహన సేవ
ఫిబ్రవరి 10 - గరుడ వాహన సేవ
ఫిబ్రవరి 11 - గజ వాహన సేవ
ఫిబ్రవరి 12 - కల్యాణోత్సవం, సూర్యప్రభ వాహన సేవ, రథోత్సవం
ఫిబ్రవరి 13- అశ్వ వాహన సేవ
ఫిబ్రవరి 14 - వసంతోత్సవం, హంస వాహన సేవ, తీర్థ వారి
No comments:
Post a Comment