కృష్ణా జిల్లా, నందిగామ టౌన్ మరియు మండలము నందు వేంచేసియున్న శ్రీ సుఖ శ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము ప్రాచినమైనది.
ప్రతి ఏటా మాఘశుద్ధ దశమి నుండి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి
ఫిబ్రవరి 7 న ఉదయం 10.08 గంటలకు రామలింగేశ్వరస్వామిన పెండ్లికుమారునిగా అలంకరణ చేస్తారు. శుకశ్యామలాంబను బాలాత్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేస్తారు. రాత్రి 10 గంటలకు స్వామిచానికి నందివాహన సేవ నిర్వహిస్తారు. నిత్యం స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు.
ఫిబ్రవరి 8న అమ్మవారికి అతితాత్రిపురసుందరీ దేవి అలంకరణ, గణపతిపూజ, అఖండస్థాపన, అంకురారోపణ, ధ్వజారోహణ చేస్తారు. సంతానం లేని మహిళలకు నందిముద్దలు ప్రసాదం అందజేస్తారు.
ఫిబ్రవరి 9న అమ్మవారికి గజలక్ష్మి దేవి అలంకరణ, స్వామివారికి శేష వాహన సేవ
ఫిబ్రవరి 10న అమ్మవారికి పార్వతీ దేవి అలంకరణ, రాత్రి 2.30 గంటలకు ఎదురుకోలోత్సవం, 11.05 గంటలకు శుకశ్యాంబాలమా సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అనంతరం చిన్నరథంపై స్వామి వారిని గ్రామోత్సవం చేస్తారు.
ఫిబ్రవరి 11న అమ్మవారిని కనకదుర్గాదేవిగా అలంకరణ చేస్తారు. సాయంత్రం 5. 15 గంటలకు శివాలయం నుంచి పెద్ద రథో త్సవం పారువేట మండపం వరకు నిర్వహి స్తారు.
ఫిబ్రవరి 12న అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ చేస్తారు
ఫిబ్రవరి 13న అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తారు. ఉదయం 10.08 గంటలకు పూర్ణా హుతి, వసంతోత్సవం, రాత్రి 7 గుటలకు సహస్ర దీపోత్సవం, దొంగల దోపు ఉత్సవం నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు రాత్రి 8 గంటల నుంచి ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవలు నిర్వహిస్తారు.
No comments:
Post a Comment