నడిగడ్డ ప్రజల ఇలవేల్పు.. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లు తున్న జములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్నాయి.
గద్వాల మండలంలోని కృష్ణానది దీని మైన గుర్రంగడ్డ జమ్ములమ్మ అమ్మవారి పుట్టినల్లుగా చరిత్ర చెబుతోంది. అక్కడి నుంచి ప్రతిఏటా మాగ శుద్ధ పౌర్ణమికి ముందు అమ్మవారిని మెట్టినిల్లు అయిన జమ్మిచేడులోని ఆలయానికి ఆహ్వానించేం దుకు ఎద్దుల బండి బయలుదేరుతుంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు గుర్రంగడ్డ గ్రామానికి బండి బయలుదేరనుండగా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. గుర్రంగడ్డలోని కృ జ్ఞానది ఒడ్డున జములమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి. అమ్మవారిని బుధవారం తెల్లవారుజామున ఎద్దుల బండిపైతీసుకువస్తారు. ఉదయం 6 గంటలకు మెట్టినిల్లు అయిన జమ్మిచేడులోని జములమ్మ, పరశురాముడి ఆలయానికి చేరుకుంటుంది.
వైభవంగా పౌర్ణమి వేడుకలు..
ఈ నెల 12 మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం రోజు అమ్మవారి సన్నిధిలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు జరిపించి, ప్రత్యేకంగా అలంకారం చేస్తారు. అదేరోజు సాయంత్రం పల్లకీసేవ నిర్వహిస్తారు. ఈ వేడుకలకు నడిగడ్డతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వేలాది మంది. భక్తులు తరలివస్తారు.
No comments:
Post a Comment