Posts

Showing posts from April, 2025

Vaishaka Masam 2025: వైశాఖ మాసంలో ముఖ్యమైన పండుగలు, తిథులు.

తెలుగు పంచాంగం ప్రకారం రెండవ మాసం వైశాఖ మాసం. వైశాఖం, మాఘం, కార్తికం ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏవిధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. వసంతఋతువులో రెండవ మాసం అయిన వైశాఖ మాసంలో ఎన్నో పుణ్య తిథులు, వరుస పండుగలు. ఏప్రిల్ 28 వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి వైశాఖ మాసం ప్రారంభమై, మే 27 వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ అమావాస్యతో ముగుస్తుంది.  ఏప్రిల్ 28 వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పాడ్యమి: వైశాఖ స్నానారంభం. భరణి కార్తె ప్రారంభం. ఏప్రిల్ 29 వ తేదీ మంగళవారం వైశాఖ శుద్ధ విదియ: చంద్రోదయం ఏప్రిల్ 30 వ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ తదియ: అక్షయ తృతీయ, బసవేశ్వర జయంతి, పరశురామ జయంతి, సింహాద్రి అప్పన్న చందనోత్సవం. మే 1 వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ చవితి: మేడే కార్మికుల దినోత్సవం, అనంతాళ్వార్ ఉత్సావారంభం మే 2 వ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ పంచమి: ఆది శంకరాచార్య జయంతి, రామానుజ జయంతి మే 4 వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ సప్తమి: భానుసప్తమి, మృకండ మహర్షి జయంతి, డొల్లు కర్తరి ప్రారంభం మే 5 వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ అష్టమి:...

Vaishaka Masam: వైశాఖ మాసం విశిష్టత - స్కాంద పురాణం

Image
వైశాఖమాసాన్ని మించిన మాసంలేదు. యుగాల్లో కృత యుగాన్ని మించిన యుగం లేదు. అలాగే శాస్త్రాల్లో వేదాన్ని మించింది లేదు. తీర్థాల్లో గంగని మించిన పుణ్యతీర్ధం లేదు. వైశాఖమాసం శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. విష్ణుభగవానుణ్ణి మించిన దైవం ఎలా లేదో, వైశాఖమాసాన్ని మించిన మాసం మరొకటి లేదు. ఎంతో విశిష్టమైన ఈ మాసంలో చేసే దానాలు అఖండమైన, అనంతమైన ఫలితాలనిస్తాయి. వైశాఖ మాసంలో జలదానం చేసినవాడికి సకల తీర్థాలనీ సేవించిన పుణ్యఫలితం లభిస్తుంది. వైశాఖంలో యాత్రికులకి దాహం తీరిస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. దాహంతో బాధపడేవారికి చల్లటినీళ్ళు దానం చేస్తే పదివేల రాజసూయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. వైశాఖంలో మధ్యాహ్న కాలంలో వచ్చిన అతిథికి అన్నదానం చేస్తే విశేషమైన పుణ్యం కలుగుతుంది.  వైశాఖమాసంలో ఎండలో తిరిగి అలసిపోయి వచ్చిన వారికి సుఖమైన వసతి, భోజనం ఏర్పాటు చేసిన వారికి పునర్జన్మ వుండదు వైశాఖంలో పక్కబట్టలు, ధరించే వస్త్రాలు, దానం చేసిన వారికి ఈ జన్మలోనే సుఖభోగాలు లభిస్తాయి. పడుకోవటానికి చాపని దానం చేస్తే శ్రీహరి ఆనందిస్తాడు. మజ్జిగ ఎండతాపాన్ని చల్లారుస్తుంది. కనుక దాహంతో అలమటించేవారికి మజ్జిగ దానం చేస్తే శ్రీ...

SRIKAKULESWAR SWAMY TEMPLE: శ్రీకాకుళేశ్వరస్వామి వారి ఆలయం

Image
  శ్రీకాకుళేశ్వరస్వామి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువై ఉన్నాడు. ఇటు చరిత్రాత్మకంగాను, అటు పౌరాణికంగాను ప్రాశస్త్యం వహించిన ఈ క్షేత్రంలో శ్రీకాకుళేశ్వరస్వామి కలియుగంలో ప్రజల పాపభారాన్ని తగ్గించడానికి స్వయంభువుగా అవతరించాడని భక్తుల విశ్వాసం. 108 దివ్య క్షేత్రాలలో ఒకటిగా దేశవ్యాప్తంగా వెలసిన శ్రీవైష్ణవ దివక్షేత్రాలలో శ్రీకాకుళేశ్వరం 57 వ క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తూ బ్రహ్మ దేవుని ప్రయత్నం మేరకే ఉద్భవించిందని ఆలయ స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది. ఆలయ స్థల పురాణం కలియుగంలో రోజురోజుకి పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా ఆందోళన చెంది వారంతా చతుర్ముఖ బ్రహ్మతో కలిసి భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో శ్రీ మహా విష్ణువు కోసం తపస్సు చేయసాగారు. వారి తపస్సుకు మెచ్చిన శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమై వారిని వరం కోరుకోమన్నాడంట! అప్పుడు దేవతలంతా తాము తపస్సు చేసిన ఈ ప్రాంతంలోనే వెలసి భక్తుల పాపాలను హరించామని కోరుకున్నారంట! దేవతల అభీష్టం మేరకు ఆ ప్రాంతంలో వెలయడానికి నారాయణుడు సమ్మతించాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ తానే స్వయంగా నారాయణుని అక్కడ...

Vaishaka Month: వైశాఖ మాసం 2025

Image
  చాంద్రమానంలో రెండవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు విశాఖ నక్షత్రం వుండటం చేత ఇది వైశాఖంగా పిలవబడుతోంది. కార్తీక,మాఘ మాసాలవలె ఈ మాసం ఎంతో పుణ్యప్రదమైనది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం, అందుకే మాధవ మాసం అని కూడా అంటారు. పుణ్యస్నానం, విష్ణుపూజ, దానధర్మాలు ఈ మాసంలోని ముఖ్య విధులని పద్మపురాణం చెబుతోంది.  ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేయడం, నక్తం అంటే పగలు ఉపవాసం ఉంది రాత్రి భోజనం చేయడం, అయాచితం అంటే ఆ సమయంలో దొరికిన దాని ఆహారంగా స్వీకరించడం వల్ల కోరికలు నెరవేరుతాయి. ఈ మాసంలో పుణ్యస్నానాలు చేయడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పాపాలు హరింపబడుతాయి. ఈ మాస విధులలో సముద్ర స్నానం కూడా చెప్పబడింది. వైశాఖ పూర్ణిమ లేదా అమావాస్య రోజులలోనే ఈ సముద్ర స్నానాని ఆచరించాలి.  ఒక వేళ ఆ రోజులలో మంగళ లేదా శుక్రవారాలు వస్తే సముద్ర స్నానం చేయకూడదు. ఈ మాసంలో ఆచరించే సముద్ర స్నానం వల్ల కురుక్షేత్రంలో వేయి గోవులను, భూమిని దానం చేసినంత ఫలితం లభిస్తుంది.  ఈ మాస విధులలో విష్ణుపూజ మరో ముఖ్యంశం. తులసి దళాలతో స్వామిని అర్చించడం ఎంతో ముఖ్యం. ఈ మాసంలో రావిచెట్టుతో పాటు, తులసి పూజ చేయడం కూడా సంప్రదాయంగా వస్...

Kamada Ekadasi: కామదా ఏకాదశి

Image
ప్రతి ఏడాది చైత్ర శుద్ధ ఏకాదశిని కామదా ఏకాదశిగా జరుపుకుంటాం. కామదా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, శ్రీహరిని పూజించి కొన్ని విశేషమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయట! శ్రీరామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి కావడం వల్ల ఈ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి తెలిసి, తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ పర్వదినాన శ్రీహరిని పూజించి, విశేషమైన దానధర్మాలు చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని, భక్తుల కోరికలన్నీ తీరి మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. కామదా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, శ్రీహరిని పూజించి కొన్ని విశేషమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయట! శ్రీరామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి కావడం వల్ల ఈ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి తెలిసి, తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ పర్వదినాన శ్రీహరిని పూజించి, విశేషమైన దానధర్మాలు చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని, భక్తుల కోరికలన్నీ తీరి మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. నిర్జల ఉపవాసం కొంతమంది ...

Dharmaraja Dasami: ధర్మరాజా దశమి

చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. శ్రీరామనవమి మరుసటిరోజు వచ్చే ధర్మరాజ దశమి రోజు యముడిని పూజిస్తే మరణభయం తొలగిపోతుందని పెద్దలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ధర్మరాజ దశమి రోజు నచికేతుడి కథ వినడం వలన మరణ భయం తొలగిపోతుందని శాస్త్రవచనం.  ఎవరీ నచికేతుడు ? పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈయన కొడుకే నచికేతుడు. నచికేతుని కథ ! పూర్వం వజాశ్రవుడు ఒక యాగం చెయ్యాలి అనుకున్నాడు. ఆ యాగంలో తన దగ్గరున్న సంపదలు అన్నీ దానం చేసేయ్యాలి. కానీ వాజశ్రవుడు యాగం అయిపోయిన తరువాత అక్కడికి వచ్చిన వాళ్లకు తన దగ్గరున్న ఆవులలో పాలు ఇవ్వలేని, ఒట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నాడు. తండ్రికి అడ్డు చెప్పిన నచికేతుడు తండ్రి చేసిన పని నచికేతుడికి నచ్చలేదు. అప్పుడు నచికేతుడు తన తండ్రితో "ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏంటి? ఒకపని చెయ్యండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి" అని అన్నాడు నచికేతుడు. నచికేతుని మాటలను పిల్ల చేష్టలుగా భావించి వాజశ్రవుడు తనను విసిగించవద్దని మ...

Ashoka Ashtami: అశోకాష్టమి

Image
చైత్ర శుద్ధ అష్టమి రోజున అశోకాష్టమిగా జరుపుకుంటాం. అశోకాష్టమి విశిష్టత అశోకం అంటే శోకాన్ని తొలగించేది అర్ధం. ఈ రోజున దుర్గాదేవిని శక్తిరూపంలో, పరమశివుని లింగరాజు రూపంలో పూజించడం సంప్రదాయం. దక్షిణాదిన అంతగా కనిపించని ఈ పండుగను ముఖ్యంగా ఒడిశాలో ఘనంగా జరుపుకుంటారు. భువనేశ్వర్‌లోని ప్రసిద్ధ లింగరాజ ఆలయంలో ఒక ముఖ్యమైన ఉత్సవం. ఈ పవిత్రమైన రోజున భక్తులు శక్తి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఒడిశా ప్రజలు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అశోకాష్టమి రోజు భువనేశ్వర్‌లోని ప్రసిద్ధ లింగరాజ ఆలయంలో జరిగే రథయాత్రలో పాల్గొనడానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. అశోకాష్టమి వెనుక ఉన్న పౌరాణిక గాధ అశోకాష్టమికి సంబంధించి అనేక ఇతిహాసాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం రావణాసురుని శక్తి దేవత అనుగ్రహం ఉండడం వల్ల రాముడు రావణుని సంహరించలేకపోతాడు. అప్పుడు రావణాసురుని తమ్ముడు విభీషణుడు శక్తిని ప్రార్ధించమని రామునికి సూచిస్తాడు. విభీషణుని సూచన మేరకు శ్రీరాముడు భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయంలో చైత్రశుద్ధ పాడ్యమి...

Buchi Kodandarama Temple: శ్రీ కోదండరామస్వామి ఆలయం - బుచ్చిరెడ్డిపాళెం

Image
శ్రీ కోదండరామస్వామి ఆలయం బుచ్చిరెడ్డిపాళెంలో నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 1715వ సంవత్సర ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రంలోని 'తిరుత్తణి'కి సమీపంలో 'రణవత్తూరు' అనే గ్రామంలోదొడ్ల అన్నారెడ్డి అనే రైతు నివసిస్తూ ఉండే వాడు. వ్యవసాయం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు. ఒకసారి కరువురావడంతో ఆ ప్రాంతం నుంచి అనేకమంది వలసవెళ్ళారు. అటువంటి పరిస్థితుల్లో అన్నారెడ్డి తన గ్రామం నుంచి బుచ్చిరెడ్డిపాలెంకు చేరి స్థిరనివాసం ఏర్పరచు కున్నాడు.వ్యవసాయం చేసుకుంటూనే మరోవైపు అవసరమైనవారికి సహాయం చేస్తూ అనతికాలంలోనే గొప్పవాడిగా పేరు పొందాడు. అప్పటికి ఈ ప్రాంతం ఆర్కాటు నవాబు పాలనక్రింద ఉండేది.రానురాను అన్నారెడ్డి విషయం నవాబుకు తెలిసింది. నవాబు అన్నారెడ్డిని బుచ్చిరెడ్డి పాలెంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు పాలనాధికారిగా నియమించాడు. ఈ పదవి వంశపారంపర్యంగా అన్నారెడ్డి తర్వాత ఆయన కుమారుడికి, అనంతరం అతని మనుమడు దొడ్ల రామిరెడ్డికి లభించింది. రామిరెడ్డి తాతను మించిన మంచివాడుగా ప్రజలందరిచేతా పిలువబడడంతోపాటు గొప్ప దైవభక్తుడుగా కూడా పేరుపొందాడు. అటువంటి రామిరెడ్డికి ఒకనాడు స్వప్నంలో శ్రీరామచంద్రమూర్తి ...

Somaramam Temple: శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయం

Image
భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక అనుభూతులు నింపే సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో సోమారామం ఒకటి. దేశంలో ఉన్న స్పటికలింగాల్లో ఇది ఒకటి. రాజమండ్రికి 59 కి.మీ. దూరంలో, విజయవాడకు 91 కి.మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చంద్ర ప్రతిష్ఠిత లింగం సోమారామంలో లింగమును చంద్రుడు ప్రతిష్ఠించినట్లుగా ఆలయ స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తుంది. సోముడు అంటే చంద్రుడు. చంద్ర ప్రతిష్ఠిత లింగం కాబట్టి ఈ క్షేత్రాన్ని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. సోమారామంలో ప్రతి కార్తికమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. రంగులు మారే శివలింగం భక్త సులభుడైన శివయ్య ఇక్కడ సోమేశ్వరస్వామి పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. దేవాలయంలో ఉన్న శివలింగం అమావాస్య నాడు నలుపు వర్ణంలోను, పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలో దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. చంద్రుడు ప్రతిష్టించిన కారణంగానే, ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగుమారుతూ ఉంటుందని చెబుతుంటారు. ఇది శతాబ్దకాలంగా జరుగుతోందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను గమనించాలంటే అమావాస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్...

Lakshmi Panchami: శ్రీ లక్ష్మి పంచమి

Image
ఉగాదితో ప్రారంభమయ్యే వసంతంలో ఐదవరోజున వస్తుంది లక్ష్మీపంచమి. ఈరోజున లక్ష్మీదేవిని పూజచేసిన వారికి ధనధాన్యాదులు కలుగుతాయని పెద్దలు తెలుపుతారు. చైత్రశుద్ధపంచమి శ్రీపంచమి. ఈనాడు లక్ష్మీపూజను ఆచరించాలి. మానవుల దారిద్య్రబాధలను తొలగించేందుకు నారాయణుని ఆదేశంతో బ్రహ్మలోకం నుండి మానవలోకానికిఅందిచబడినదే ఈ లక్ష్మీపూజ. ఈ వ్రతాన్ని ఆచరించినవారి ధనం స్థిరంగా నిలచి ఉంటుందని “హేమాద్రివ్రతఖండం” స్పష్టం చేసింది. ఈ వ్రతాచరణలో భాగంగా, బంగారమువంటి కాంతితో, శ్రీమహావిష్ణువుయందు అనురాగం కలిగినది, బంగారు, వెండి పుష్పముల మాలికలు ధరించినది, చంద్రునివలె సకలలోకాలకు ఆహ్లాదం కలిగించునది అయిన శ్రీమహాలక్ష్మిని ఆవాహన చేసి భక్తితో పూజాదికాలు నిర్వహించాలి. అమ్మవారికి తెల్లనిరంగు పువ్వులతో పూజలు, క్షీరాన్నం,నేతి పిండివంటలు, చెరుకు,అరటిపండ్లు నివేదన చేస్తే మంచిఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. చైత్ర శుద్ధ పంచమి రోజు తమ పెద్దవారిని గుర్తుచేసుకుంటూ బీదవారికి అన్నసంతర్పణ చేస్తే తత్ఫలితంగా వారి పెద్దలు పుణ్యలోకాలకు చేరుతారని “వ్రతచూడామణి” వివరిస్తోంది. ఒకానొక సందర్భంలో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు బిల్వదళాలతో పరమశివుడ్ని అర్చి...