Vaishaka Masam 2025: వైశాఖ మాసంలో ముఖ్యమైన పండుగలు, తిథులు.
తెలుగు పంచాంగం ప్రకారం రెండవ మాసం వైశాఖ మాసం. వైశాఖం, మాఘం, కార్తికం ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏవిధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. వసంతఋతువులో రెండవ మాసం అయిన వైశాఖ మాసంలో ఎన్నో పుణ్య తిథులు, వరుస పండుగలు.
ఏప్రిల్ 28 వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి వైశాఖ మాసం ప్రారంభమై, మే 27 వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ అమావాస్యతో ముగుస్తుంది.
ఏప్రిల్ 28 వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పాడ్యమి: వైశాఖ స్నానారంభం. భరణి కార్తె ప్రారంభం.
ఏప్రిల్ 29 వ తేదీ మంగళవారం వైశాఖ శుద్ధ విదియ: చంద్రోదయం
ఏప్రిల్ 30 వ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ తదియ: అక్షయ తృతీయ, బసవేశ్వర జయంతి, పరశురామ జయంతి, సింహాద్రి అప్పన్న చందనోత్సవం.
మే 1 వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ చవితి: మేడే కార్మికుల దినోత్సవం, అనంతాళ్వార్ ఉత్సావారంభం
మే 2 వ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ పంచమి: ఆది శంకరాచార్య జయంతి, రామానుజ జయంతి
మే 4 వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ సప్తమి: భానుసప్తమి, మృకండ మహర్షి జయంతి, డొల్లు కర్తరి ప్రారంభం
మే 5 వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ అష్టమి: అపరాజిత దేవి జయంతి
మే 6 వ తేదీ మంగళవారం వైశాఖ శుద్ధ నవమి: తిరుపతి గంగ జాతర ప్రారంభం, సీతమ్మ జయంతి
మే 7 వ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి: వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, పద్మావతి పరిణయోత్సవాలు
మే 8 వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి: మతత్రయ ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం
మే 9 వ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ ద్వాదశి: పరశురామ ద్వాదశి, పక్ష ప్రదోషం
మే 10 వ తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి: శనిత్రయోదశి
మే 11 వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి: నిజ కర్తరీ ప్రారంభం, నృసింహ జయంతి.
మే 12 వ తేదీ సోమవార వైశాఖ శుద్ధ పౌర్ణమి: వైశాఖ పౌర్ణమి, మహా వైశాఖి, గౌతమ బుద్ధ జయంతి, బుద్ధ పూర్ణిమ, కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి
మే 13 వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాడ్యమి: తిరుపతి గంగ జాతర సమాప్తం
మే 14 వ తేదీ బుధవారం వైశాఖ బహుళ విదియ: వృషభ సంక్రమణం.మే 15 వ తేదీ గురువారం వైశాఖ బహుళ తదియ: సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం, నారద జయంతి
మే 16 వ తేదీ శుక్రవారం వైశాఖ బహుళ చవితి: సంకష్ట హర చతుర్థి
మే 17 వ తేదీ శనివారం వైశాఖ బహుళ పంచమి: శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాలు ఆరంభం
మే 22 వ తేదీ గురువారం వైశాఖ బహుళ దశమి: హనుమజ్జయంతి
మే 23 వ తేదీ శుక్రవారం వైశాఖ బహుళ ఏకాదశి: సర్వ ఏకాదశి
మే 25 వ తేదీ ఆదివారం వైశాఖ బహుళ త్రయోదశి/చతుర్దశి: మాస శివరాత్రి, రోహిణి కార్తె ప్రారంభం
మే 26 వ తేదీ సోమవారం వైశాఖ బహుళ చతుర్దశి/అమావాస్య: సరస్వతి నది పుష్కరాలు సమాప్తం
మే 27 వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ అమావాస్య: సర్వేషాం అమావాస్య ఈ రోజుతో వైశాఖ మాసం సమాప్తం అవుతుంది.
Comments
Post a Comment