Vaishaka Month: వైశాఖ మాసం 2024

 

  • చాంద్రమానంలో రెండవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు విశాఖ నక్షత్రం వుండటం చేత ఇది వైశాఖంగా పిలవబడుతోంది.
  • కార్తీక,మాఘ మాసాలవలె ఈ మాసం ఎంతో పుణ్యప్రదమైనది.
  • శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం, అందుకే మాధవ మాసం అని కూడా అంటారు.
  • పుణ్యస్నానం, విష్ణుపూజ, దానధర్మాలు ఈ మాసంలోని ముఖ్య విధులని పద్మపురాణం చెబుతోంది. 
  • ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేయడం, నక్తం అంటే పగలు ఉపవాసం ఉంది రాత్రి భోజనం చేయడం, అయాచితం అంటే ఆ సమయంలో దొరికిన దాని ఆహారంగా స్వీకరించడం వల్ల కోరికలు నెరవేరుతాయి.
  • ఈ మాసంలో పుణ్యస్నానాలు చేయడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పాపాలు హరింపబడుతాయి.
  • ఈ మాస విధులలో సముద్ర స్నానం కూడా చెప్పబడింది.
  • వైశాఖ పూర్ణిమ లేదా అమావాస్య రోజులలోనే ఈ సముద్ర స్నానాని ఆచరించాలి. 
  • ఒక వేళ ఆ రోజులలో మంగళ లేదా శుక్రవారాలు వస్తే సముద్ర స్నానం చేయకూడదు.
  • ఈ మాసంలో ఆచరించే సముద్ర స్నానం వల్ల కురుక్షేత్రంలో వేయి గోవులను, భూమిని దానం చేసినంత ఫలితం లభిస్తుంది. 
  • ఈ మాస విధులలో విష్ణుపూజ మరో ముఖ్యంశం. తులసి దళాలతో స్వామిని అర్చించడం ఎంతో ముఖ్యం.
  • ఈ మాసంలో రావిచెట్టుతో పాటు, తులసి పూజ చేయడం కూడా సంప్రదాయంగా వస్తుంది.
  • ఈ నెలలో తులసిచెట్టుకు నీరు పోసి దీపం వెలిగించడం విశేష ఫలదాయకం.
  • తులసిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. అకాల మరణాలు సంభవించవు. 
2024: మే 09  నుండి జూన్ 06 వరకు. 

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

Abyanghana Snanam: అభ్యంగన స్నానం

Random posts