Abyanghana Snanam: అభ్యంగన స్నానం

 


  • పర్వదినాలలోనూ, జన్మదినముననూ, విశేష క్రతువుల ప్రారంభంలోనూ అభ్యంగన స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి.
  • తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం
  • శరీరానికి తైలాన్ని (నువ్వులనూనెను) బాగా రాసి మర్దన చేసి నలుగు పిండితో ఒళ్ళు రుద్దుకుని గోరువెచ్చటి నీటితో స్నానం చేయడాన్ని 'అభ్యంగన(తలంటి)స్నానం' అంటారు.
  • ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.
  • అయితే అభ్యంగన స్నానం నిత్యం చేయకూడదు. 
  • శ్రాద్ధ దినములయందు, ఆది, మంగళ వారములు, పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్ధశి తిధులయందు అభ్యంగన స్నానం చేయకూడదు. 
  • అనివార్యమై చేయవలసి వచ్చినప్పుడు ఈ కింద సూచించిన విధము చేయడం వలన దోషము తొలిగి శుభం కలుగుతుంది.


అభ్యంగన స్నాన వారదోషములు

ఆదివారం - తాపము. నివారణకు నూనెలో పుష్పములు.

సోమవారం - కాంతి, మనోల్లాసము.

మంగళవారం - మృతి. నివారణకు నూనెలో మన్ను.

బుధవారం - లక్ష్మీ కటాక్షము.

గురువారం - ధన నాశం. నివారణకు నూనెలో గరిక.

శుక్రవారం - విపత్తు. నివారణకు నూనెలో గోమయం.

శనివారం - భోగము

అయితే పండుగ, శుభదినములకు ఈ దోషము వర్తించదు. స్త్రీలకు గురు, శుక్రవారములు శుభములు. 

Comments

Popular This Week

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

Singirikona Temple: శ్రీ నరసింహ స్వామి ఆలయం - సింగిరికోన

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం

Vaikanasa Agamam: విఖనస మహర్షి - శ్రీ వైఖానస ఆగమ శాస్త్రం

Pancharatra Agamam: పాంచరాత్ర ఆగమం

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Random posts