Vaikanasa Agamam: విఖనస మహర్షి - శ్రీ వైఖానస ఆగమ శాస్త్రం

 

తిరుమలతో సహా దాదాపు కొన్ని వైష్ణవ ఆలయాలలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు  జరుగుతాయి అని మనకు తెలుసు. అసలు వైఖానస ఆగమ శాస్త్రం అంటే ఏమిటి ? క్లుప్తంగా చూదాం.

కలియుగంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తపస్సు, యజ్ఞయాగాలు సాధ్యం కాదు అని శ్రీ మహావిష్ణు భావన. అర్చామూర్తిగా  అవతరిస్తున తనకు చేయవలసిన అర్చనలు, నిత్యపూజలు నివేదనలు సులభతరమైన పద్ధతిలో నియమ నిబంధనలను రూపొందించి ఓ గ్రంధరూపం ఇవ్వవలిసింది అని బ్రహ్మను కోరాడు శ్రీ మహావిష్ణువు.

అంతటి మహత్కార్యాన్ని చేపట్ట గలిగే శక్తి తనకు లేదు అని బ్రహ్మ శ్రీ మహావిష్ణువుకు విన్నవించాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన సంకల్పాన్ని సాకారం చేసుకోవడం కోసం తన మానసం నుండి ఓ మహానుభావుడిని ఉద్బవింపజేసాడు, ఆయనే విష్ణు మానసపుత్రుడు విఖనస మహర్షి. 

విఖనస మహర్షి శ్రావణమాసం, శుక్ల పక్షం, పౌర్ణమి, శ్రావణ నక్షత్రం రోజున నైమిశారణ్యంలో ఆవిర్భవించాడు. విఖనస మహర్షి ద్వారా ఉద్బవించింది కనుక ఈ శాస్త్రం వైఖానస ఆగమం అయింది.  శ్రీ మహావిష్ణువు ఆదేశం ప్రకారం విఖనస మహర్షి మరో నలుగురు ఋషులను శిష్యులుగా చేసుకొని వారి సహాయంతో ఈ కార్యాన్ని సాధించాడు. 

అత్రి మహర్షి - దేవాలయంలో మూర్తులను అర్చించే పద్దతులను 

భృగు మహర్షి - యజ్ఞయాగాదులు నిర్వహించే పద్దతులను 

కశ్యప మహర్షి - జప విధులను 

మరీచి మహర్షి - అగ్నిహుతం అనే వైదిక కర్మను 

వీరి ద్వారా వేదాలలో వున్న సారం గ్రహించి, ఈ ఆగమ శాస్త్రాన్ని వ్యాప్తి చేసారు.

వేదాలు కర్మని బోధిస్తే, ఉపనిషదులు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఆగమ శాస్త్రం మాత్రం కర్మ, జ్ఞానం రెండిటిని కర్తవ్య బోధ చేస్తాయి. 

వైఖానస ఆగమ శాస్త్రాలలో శ్రీమహావిష్ణువుకు ఐదు రూపాలు వున్నట్లుగా చెప్పబడింది.

విష్ణువు - విశ్వమంతా వ్యాపించి యున్నవాడు.

పురుషుడు - పూర్ణత్వం కలిగిన వాడు.

సత్య - శాశ్వతమైన వాడు 

అనిరుద్ధ - పరిమితులు లేని వాడు 

అచ్యుత - మార్పు లేని వాడు. 

వైఖానస ఆగమశాస్త్రంలో మానవుడు ఆచరించవలసిన ధర్మాలను పొందుపరిచారు. 

ఈ ఆగమ శాస్త్రం పాటిస్తూ మహావిష్ణువుని అర్చించే వారిని వైఖానస అర్చకులుగా వ్యవహరిస్తారు. తిరుమలలో ఉత్తరమాడవీధిలో, ఆదివారాహ స్వామి ఆలయానికి అభిముఖంగా నిర్మించబడిన ఆలయంలో విఖనస మహర్షి కొలువైవుంటాడు. 

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Kashi Yama Aditya Temple: యమ ఆదిత్య ఆలయం - కాశీ