Posts

Showing posts from April, 2024

Ashada Month 2024: ఆషాడ మాసం

Image
  చాంద్రమానంలో నాల్గవ మాసం ఆషాడ మాసం. ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో కాని లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో కాని కలిసివుండటం చేత ఈ మాసం ఆషాఢంగా పేరుపొందింది. ఈ మాసం శుభకార్యాలకు అంతగా అనువుకానప్పటికీ, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ మాసంలో ఒంటిపూట భోజన నియమాన్ని పాటించడం వల్ల ఐశ్వర్యం లభించి మంచి సంతానం కలుగుతుంది అని శాస్త్రం. ఈ నెలలో గృహనిర్మాణాన్ని ఆరంభించడం వల్ల గోసంపద లభిస్తుంది అని మత్య్స పురాణం చెబుతోంది. ఈ నెలలో ఆడవారు కనీసం ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు, అలాగే ఆహారంలో మూలగాకు ఎక్కువగా వాడాలి. జపపారాయణలకు ఈ మాసం అనువైనది. కొన్ని ప్రాంతాలలో ఈ మాసంలో కూడా పుణ్య స్నానాలు చేస్తారు. ఈ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది.సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి నప్పటినుండి మకరరాశిలోకి ప్రవేశించే అంత వరకు గల కాలం దక్షిణాయనం. దక్షిణాయన ప్రారంభసమయంలో పుణ్యస్నానాలను, ధాన్యజపాదులను చేయడం ఎంతో మంచిది. ఈ సంక్రమణ సమయంలో చేసే పుణ్య స్నానాల వల్ల రోగాలు నివారించడమే కాక దారిద్య్రం నిర్ములింపబడుతుంది. ఈ మాసంలో చేసే దానాలు విశేష ఫలితాలు ఇస్తాయి. పాదరక్షలు, గొడుగు,

Jyestha Month 2024: జ్యేష్ఠ మాస విశిష్టత

Image
  చాంద్రమానంలో మూడవ నెల జ్యేష్ఠ మాసం.ఈ నెలలోని పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి దగ్గరలో ఉండటం చేత ఇది జ్యేష్ఠ మాసంగా చెప్పబడింది. ఋతువులలో రెండవదైన గ్రీష్మఋతువు ఈ మాసంలో ప్రారంభం అవుతుంది. ఈ మాసం దాన, ధ్యాన, పూజ, జప, పారాయణలకు ఉత్తమమైన మాసంగా చెప్పబడింది. ఈ మాసంలో ఆచరించే విధులలో బ్రహ్మపూజ ప్రధానంగా చెప్పబడింది. ఈ నెలలో బియ్యపు పిండితోకాని, గోధుమపిండితో కానీ బ్రహ్మదేవుడి ప్రతిమను చేసిరోజు పూజించాలి. రోజు పూజ చేయలేని వారు ముఖ్యతిధులలో పూజించటం మంచిది. బ్రహ్మపూజ వల్ల మరణాంతరం సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసంలో సూర్యారాధన, సుబ్రమణ్య స్వామి ఆరాధన కూడా మంచిది అని చెబుతారు. ఈ మాసంలో పార్వతీదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా శ్రీశైల అడవులలో నెలకొని వున్నా ఇష్టకామేశ్వరిదేవి పూజించడం మంచిదే. ఈ మాసంలో మిధున సంక్రమణం జరుగుతుంది. అంటే సూర్యుడు వృషభరాశి నుండి మిధునరాశిలోకి ప్రవేశిస్తాడు.ఈ సంక్రమణ సమయానికి ముందుగల 16 ఘడియల కాలం ఎంతో పుణ్యప్రదమైనది. మిధున సంక్రమణం నాడు  వృషభాని పూజించి, సాయంకాలం లక్ష్మీపూజ చేసే సంప్రదాయం కూడా వుంది. దీనినే దీపపుజా అని కూడా అంటారు. ఈ మ

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Image
  తిరుమలలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు గరుడసేవ నిర్వహిస్తారు. ఆ రోజు దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలను సందర్శిస్తారు. కాబట్టి తిరుమలలో గరుడసేవకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.  ఇప్పుడు ప్రతి పౌర్ణమి రోజున స్వామి వారు గరుడ వాహనం పై భక్తులను అనుగ్రహిస్తారు.  2024 తేదీలు  జనవరి 25, గురువారం ఫిబ్రవరి 24, శనివారం మార్చి 25, సోమవారం ఏప్రిల్ 23, మంగళవారం మే 23, గురువారం జూన్ 22, శనివారం జూలై 21, ఆదివారం ఆగస్టు 19, సోమవారం సెప్టెంబర్ 18, బుధవారం అక్టోబర్ 17, గురువారం నవంబర్ 15, శుక్రవారం డిసెంబర్ 15, ఆదివారం.

Veerabrahmendra Swamy Aradhana: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు 2024 తేదీలు

Image
  పదిహేడో శతాబ్దంలో జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానపల్లి వాసులకు కాలజ్ఞానాన్ని వినిపించారు. కలియుగంలో జరగబోయే సంఘటనలు తెలిపారు.  1693 లో జీవసమాధిలోకి ప్రవేశించారు. కందిమల్లయ్య పల్లెలోని శ్రీ బ్రహ్మంగారిమఠంలో వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామి వారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. 32 రోజులు దీక్షను ధరించిన భక్తులు ఆరాధన సమయంలో దీక్ష విరమణ చేస్తారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.  ఉత్సవ తేదీలు 2024 మే 18 - వైశాఖ శుద్ధ దశమి - స్వామివారి ఆరాధన  మే 19 - పుష్ప రథోత్సవం  మే 20 - మహా ప్రసాదం నివేదన 

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Image
శ్రీ విరోధి నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియ నాడు 1671లో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సశరీరంగా బృందావన ప్రవేశం చేశారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సప్త రాత్రోత్సవాల పేరిట ఆరాధనోత్సవాలను నిర్వహిస్తారు.ఇవి మంత్రాలయ పీఠాధిపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇవి ఏడు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు.దేశ, విదేశాలలోని రాఘవేంద్ర స్వామి మఠాలలో ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు జరుగుతాయి. తేదీలు : ఆగష్టు 18 - ధ్వజారోహణం, ప్రధానోత్సవం, లక్ష్మి పూజ, ధయనోత్సవం, ప్రభ ఉత్సవం. ఆగష్టు 19 - సాకోత్సవం, రజిత మంటపోత్సవం ఆగష్టు 20 - రాఘవేంద్ర స్వామి పూర్వ ఆరాధన, సింహ వాహన సేవ ఆగష్టు  21 - రాఘవేంద్ర స్వామి మధ్య ఆరాధన, పుష్ప అలంకరణ, రథోత్సవం ఆగష్టు 22 - రాఘవేంద్ర స్వామి ఉత్తర ఆరాధన, మహారథోత్సవం ఆగష్టు 23 - శ్రీ సుగుణ తీర్థుల ఆరాధన, అశ్వ వాహనం ఆగష్టు 24  - సర్వ సమర్పణోత్సవం అన్ని రాఘవేంద్ర స్వామి ఆలయాలలో ఆరాధన ఉత్సవాలు ఆగష్టు 20 నుండి ఆగష్టు 22  వరకు జరుగుతాయి. 

Mallam Subramanya Temple: శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం - మల్లం

Image
  శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలలో ఒక్కటి.  ఈ క్షేత్రానికి పూర్వం తిరువాంబురు అనే పేరు ఉండేది. పూర్వం మల్లాసురుడు, కొల్లాసురుడు అనే రాక్షసులు ఇద్దరూ తిరువాంబురును పరిపాలిస్తూ ఉండేవారు. రాక్షసులు కనుక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండేవారని. ఇక్కడ కొలువుదీరిన సుబ్రహ్మణ్య స్వామిని కూడా లెక్కపెట్టే వారుకాదు. కష్టాలను భరించలేకపోయిన ప్రజలు వారి బారినుండి తమను కాపాడమని సుబ్రహ్మణ్యస్వామివారిని ప్రార్థించారు. వారి ప్రార్ధనలు మన్నించిన స్వామివారు. రాక్షసులతో యుద్ధంచేసి వారిని ఓడించారు. చివరిక్షణాల్లో సుబ్రహ్మణ్యస్వామివారి దివ్య రూపాన్ని చూసి పశ్చాత్తాపానికి లోనైన రాక్షసులు తమను అనుగ్రహించమని క్షమించి శరణు కోరారు. దీనితో స్వామివారు వరాన్ని ప్రసాదించాడు. దీని ప్రకారం మల్లాసురుడి పేరుమీద ఊరికి మల్లాపురం అనే పేరు ఏర్పడి, అది కాలక్రమములో మల్లాంగా మారినట్లు కథనం. స్థల పురాణం పూర్వం తారకాసురుడిని అంతమొందించిన అనంతరం సుబ్రహ్మణ్యస్వామి తన కర్తవ్యం ముగియడంతో ఈ ప్రాంతానికి చేరుకొని తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆయన వారి చుట్టూ పుట్టలు పెరిగి వెదురుపొదలు వ్యాపించా

Srikurmam Temple: శ్రీ కూర్మం ఆలయ విశేషాలు

Image
  శ్రీ కూర్మంలో కూర్మనాథ స్వామి పశ్చిమాభిముఖంగా కొలువై ఉన్నాడు. స్వామివారు వేంచేసి ఉన్న గర్భాలయం మీద నిర్మించిన విమానాన్ని శ్రీ కుర్మా విమానం అని పిలుస్తారు. నరసింహ, కపీశ , హయగ్రీవ విగ్రహాలతో అష్టదళ పద్మాకారంగా నిర్మించిన ఈ విమానాన్ని గాంధర్వ విమానమని కపిల సంహిత పేర్కొంది.  ఈ ఆలయం చాల అరుదైనది. ఎత్తైన వేదిక మీద  స్వామి వారి మూలా విరాట్ వీపు  భాగం, తల, తోక భాగం ఇలా భాగాలుగా దర్శనమిస్తారు. శని , ఆదివారాలలో స్వామివారిని విశేషంగా అలంకరిస్తారు. ప్రతి రోజు స్వామివారికి చందనం సమర్పిస్తారు. వైశాఖ మాసంలో మాత్రం తులసీదళాలతో అర్చించడం ఆనవాయితీ. స్వామివారికి అభిషేకం చేస్తే వాస్తుదోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడా పితృదేవతలకు పిండప్రదానం చేస్తే ముక్తి లభిస్తుంది అని స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్ర పాలకుడు పాతాళ సిద్దేశ్వరుడు. దక్షిణ దిక్కున ఆలయ ప్రవేశం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. వైశాఖ పూర్ణిమనాడు కుర్మజయంతిని నిర్వహిస్తారు  పాల్గుణ మాసంలో శుద్ధ త్రయోదశి ఉత్తర నక్షత్రంనాడు స్వామికి డోలోత్సవం జరుగుతుంది .

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ

Image
  వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయగా చెప్పబడుతోంది. ఈ రోజు చేసే పూజలు, హోమాలు, దానాలు. పితృతర్పణం మొదలైనవి అక్షయ పుణ్య ఫలితాలుస్తాయి. ఈ రోజు నీటితో నిండిన కుండా,గోధుమలు, శనగలు పెరుగు అన్నంని దానం చేయడం వల్ల శాశ్వత శివసాయుజ్యం పొందవచ్చు అని భవిష్య పురాణం, దేవి పురాణం చెబుతున్నాయి. ఈ రోజు వస్త్రదానం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ రోజు లక్ష్మి సహితుడైన నారాయణుని, గౌరీ సహితుడైన పరమేశ్వరుని పూజించాలి అని శాస్త్రవచనం.ఈ పూజలో విసనకర్రలు దానం చేయడం తప్పనిసరి. ఈ పూజ వల్ల వైకుంఠప్రాప్తి, శివలోకప్రాప్తి లభిస్తాయి. ఈ రోజుకొన్నిప్రాంతాలలో గౌరీదేవికి డోలోత్సవం, శ్రీకృష్ణుడికి చందన లేపనం చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజు పరశురాముడు జన్మించాడు. ఈ రోజు ఉపవసించి, ప్రదోషకాలంలో పరశురాముని పూజించాలి.  2024: మే 10 

Vaishaka Month: వైశాఖ మాసం 2024

Image
  చాంద్రమానంలో రెండవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు విశాఖ నక్షత్రం వుండటం చేత ఇది వైశాఖంగా పిలవబడుతోంది. కార్తీక,మాఘ మాసాలవలె ఈ మాసం ఎంతో పుణ్యప్రదమైనది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం, అందుకే మాధవ మాసం అని కూడా అంటారు. పుణ్యస్నానం, విష్ణుపూజ, దానధర్మాలు ఈ మాసంలోని ముఖ్య విధులని పద్మపురాణం చెబుతోంది.  ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేయడం, నక్తం అంటే పగలు ఉపవాసం ఉంది రాత్రి భోజనం చేయడం, అయాచితం అంటే ఆ సమయంలో దొరికిన దాని ఆహారంగా స్వీకరించడం వల్ల కోరికలు నెరవేరుతాయి. ఈ మాసంలో పుణ్యస్నానాలు చేయడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పాపాలు హరింపబడుతాయి. ఈ మాస విధులలో సముద్ర స్నానం కూడా చెప్పబడింది. వైశాఖ పూర్ణిమ లేదా అమావాస్య రోజులలోనే ఈ సముద్ర స్నానాని ఆచరించాలి.  ఒక వేళ ఆ రోజులలో మంగళ లేదా శుక్రవారాలు వస్తే సముద్ర స్నానం చేయకూడదు. ఈ మాసంలో ఆచరించే సముద్ర స్నానం వల్ల కురుక్షేత్రంలో వేయి గోవులను, భూమిని దానం చేసినంత ఫలితం లభిస్తుంది.  ఈ మాస విధులలో విష్ణుపూజ మరో ముఖ్యంశం. తులసి దళాలతో స్వామిని అర్చించడం ఎంతో ముఖ్యం. ఈ మాసంలో రావిచెట్టుతో పాటు, తులసి పూజ చేయడం కూడా సంప్రదాయంగా వస్తుంది. ఈ నెలలో తులస

Chaitra Purnima: చైత్ర పౌర్ణమి

   చాంద్రమాన సంవత్సరంలో మొదటి పౌర్ణమి.  ఆధ్యాత్మిక చైత్యనం పౌర్ణమి రోజు ఎక్కువగా ఉంటుంది అని అంటారు.  అందుకే మన శాస్త్రాలలో పౌర్ణమికి ఒక్క విశిష్ట వుంది. ఈ రోజు చేసే పూజలు, ఉపాసనలు, దీక్షలు విశేష ఫలితాన్నిస్తాయి  ఈ రోజు శివపార్వతుల కల్యాణాన్ని జరిపించాలి అని గ్రంధాలు చెబుతున్నాయి.  ఈ రోజు శివాలయాన్ని దర్శించాలి. కొన్ని ప్రాంతాలలో హనుమాన్ జయంతి జరుపుకుంటారు చైత్రపూర్ణిమ నుంచి 41 రోజులపాటు ఆంజనేయుని దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమాన్ జయంతి. వైశాఖ బహుళ దశమినాడు దీక్ష విరమణ చేసి వైభవంగా పూజలు చేస్తారు.  ఈ రోజు కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారికి ప్రతేక్య ఊరేగింపు మహోత్సవం జరుగుతుంది. ఈ రోజు ఇష్టదైవాన్ని పూజలు చేయడం వల్ల ఆ ఆచారం చిరకాలంపాటు కొనసాగుతుంది అని విశ్వాసం.  2024 : ఏప్రిల్ 23. 

Sri Ramanavami: శ్రీ రామనవమి

Image
  శ్రీరామచంద్రుడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమిగా చెప్పబడింది. సీతారాముల కళ్యాణం, రాముడు రావణుని వధించి అయోధ్యకి రావడం కూడా నవమినాడే జరిగాయి. మరునాడు అంటే దశమినాడు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. శ్రీరామనవమి నాడు శక్తి కొలది రాముని పూజించాలి. తరువాత శ్రీరాముని పరివార సమేతంగా అంటే సీతారామ లక్ష్మణ భరత శత్రుగ్న హనుమంతులను షోడశోపచారాలతో పూజించాలి. అవకాశాన్ని బట్టి ఈ రోజు రాత్రి జాగరణ చేసి, రామభజనతోను, సంకీర్తనలతోను కాలం గడిపి, ఆ తరువాత రోజు తిరిగి రామచందునికి పూజ చేస్తే రామనవమి వ్రతాన్ని ఆచరించినట్లు అవుతుంది.  2024:  ఏప్రిల్ 17.

Vontimitta Brahmotsavam: శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు 2024 - ఒంటిమిట్ట

Image
  కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 16 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వాహన సేవల వివరాలు 2024 ఏప్రిల్ 16 - అంకురార్పణం  ఏప్రిల్ 17 -  ధ్వజారోహణం, శేషవాహనం. ఏప్రిల్  18 -  వేణుగాన అలంకారం, హంస వాహనం ఏప్రిల్ 19 -  వటపత్రసాయి అలంకారం, సింహ వాహనం ఏప్రిల్ 20 -  నవనీతకృష్ణ అలంకారం, హనుమంత వాహనం ఏప్రిల్ 21 - మోహినీ అలంకారం, గరుడసేవ ఏప్రిల్ 22 -  శివధనుర్భాణ అలంకారం,  శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు) ఏప్రిల్ 23 -  రథోత్సవం ఏప్రిల్ 24 -  కాళీయమర్ధన అలంకారం, అశ్వవాహనం ఏప్రిల్ 25 -  చక్రస్నానం, ధ్వజావరోహణం(రా|| 7 గం||) ఏప్రిల్ 26 -  పుష్పయాగం(సా|| 6 గం||).

Chilkuru Brahmotsavam: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు 2024 తేదీలు

Image
చిలుకూరు బాలాజీ దేవాలయం, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది.  ప్రతి ఏటా శ్రీరామనవమి తరువాత రోజున ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి  సేవల వివరాలు  ఏప్రిల్ 18 - సెల్వర్ కుతూ ఉత్సవం, అంకురార్పణం ఏప్రిల్ 19 - ధ్వజారోహణ, శేష వాహన సేవ  ఏప్రిల్ 20 - గోపా వాహన సేవ, హనుమంత వాహన సేవ ఏప్రిల్ 21 - సూర్యప్రభ వాహన సేవ, కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ ఏప్రిల్ 22 - వసంతోత్సవం, గజ వాహన సేవ ఏప్రిల్ 23 - పల్లకి సేవ, రథోత్సవం  ఏప్రిల్ 24 - ఆస్థాన సేవ, అశ్వ వాహన సేవ ఏప్రిల్ 25 - చక్ర తీర్థం. ధ్వజావరోహణం 

Bhadrachalam Brahmotsavam: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు 2024 - భద్రాచలం

Image
  శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, తెలంగాణలోని ఖమ్మం జిల్లా, భద్రాచలంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది.  ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. బ్రహ్మోత్సవ సేవలు  ఏప్రిల్ 09 - ఉగాది , తిరువీధిసేవ  ఏప్రిల్ 13  - అంకురార్పణం ఏప్రిల్ 14  - గరుడ పాఠ లేఖనం  ఏప్రిల్ 15  - అగ్ని ప్రతిష్ఠా , ధ్వజారోహణం ఏప్రిల్  16 - ఎదురుకోలు , గరుడవాహన సేవ ఏప్రిల్ 17 -  శ్రీరామనవమి కల్యాణం ఏప్రిల్  18 - పట్టాభిషేకం, రథోత్సవం ఏప్రిల్ 19 - సదస్యం , హంసవాహన  సేవ  ఏప్రిల్ 20 - తెప్పోత్సవం , చోరోత్సవం , అశ్వవాహన  సేవ  ఏప్రిల్  21 - ఉంజల్ ఉత్సవం, సింహవాహన సేవ ఏప్రిల్  22 - వసంతోత్సవం, హవనం, గజవాహన సేవ ఏప్రిల్  23 - చక్రతీర్థం, పూర్ణాహుతి 

Chaitra Navratri: చైత్ర నవరాత్రి 2024

Image
  చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను వసంత నవరాత్రి అని అంటారు.  శరదృతువులో ఆశ్వీయుజ మసంలో వచ్చే శరన్నవరాత్రులకు (దేవీ నవరాత్రులకు) ఎంతటి ప్రాశస్త్యం ఉందో, వసంత నవరాత్రులకూ అంతే ఆధ్యాత్మిక విశేషం ఉంది. వైష్ణవ క్షేత్రాలన్నీ వసంత నవరాత్రుల సంబరంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. రాముడు జన్మించిన తిథి చైత్ర శుద్ధ నవమి. రాముని జన్మోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణోత్సవం జరుపుకుంటాం. పాడ్యమి మొదలు రామకల్యాణం జరిగే నవమి వరకూ నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. నవరాత్రుల్లో రామాయణం పారాయణం చేస్తారు. రామాయణం ప్రకారం.. రాముడు-ఆంజనేయుడు తొలిసారి కలుసుకుంది వసంత రుతువులోనే. సుగ్రీవునితో రాముడి మైత్రి చిగురించిందీ వసంత రుతువులోనే. నవరాత్రుల్లో రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం చేయడం మంచిది.  రామాలయాల్లో భక్తుల భజనలు, సంకీర్తనలతో, రామనామం మార్మోగుతుంటుంది. 2024 తేదీలు : ఏప్రిల్  09  నుండి ఏప్రిల్ 17  వరకు.

Matsya Jayanti: మత్య్స జయంతి

Image
 విష్ణు భగవానుడు సత్య యుగంలో ధరించిన మొదటి అవతారం మత్య్స అవతారం. సోమకుడిని నుంచి వేదాలను కాపాడడం కోసం స్వామి వారు మత్య్స అవతారం ధరించారు. దీనిని చైత్ర మాసం శుక్ల పక్షంలో మూడవ రోజు జరుపుకుంటారు. ఈ రోజులలో దేశవ్యాప్తంగా చైత్ర నవరాత్రులు జరుగుతుంటాయి. విష్ణు ఆలయాలలో పూజలు నిర్వహిస్తారు. ఇస్కాన్ ఆలయాలలో వైభవంగా మత్య్స జయంతి జరుగుతుంది. మత్య్స అవతారంలో స్వామి వారికీ వున్నా ఆలయం, నాగలాపురంలోని వేద నారాయణ స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ రోజు ఏమి చేయాలి ? ఈ రోజు భక్తులు  విష్ణు ఆలయాన్ని దర్శిస్తారు  ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ రోజు మత్య్స పురాణం, విష్ణు సహస్రనామాలు పఠించడం మంచిది. 2024 : ఏప్రిల్ 11.

Chaitra Month: చైత్ర మాసం 2024

  చాంద్రమానంలో మొదటి నెలైన ఈ మాసానికి చైత్ర మాసం, మధుమాసం, వసంత మాసం అనే పేర్లు ఉన్నాయి. ఋతువులలో మొదటిదైన వసంత ఋతువు ఈ మాసంతో ప్రారంభం అవుతుంది. ఈ మాసం ప్రకృతి మార్పులకు కూడా నాందిగా నిలుస్తోంది.  శిశిర ఋతువులో ఆకులూ రాల్చే చెట్లు అన్ని చైత్రంలో చిగురిస్తాయి.  ఈ మాసంలో ప్రకృతి అంతా ఒక నూతన శోభను సంతరించుకుంటుంది. అందుకే ఈ మాసాన్ని నవ చైతన్యానికి ప్రతీకగా చెబుతారు. ఈ మాసంలో వసంతానవరాత్రులు, శ్రీరామనవమి నవరాత్రులను ఆచరిస్తారు. సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశి లోకి ప్రవేశిస్తాడు. దీనిని మీనసంక్రమణం అన్ని అంటారు. ఈ సంక్రమణం తరువాత ఉండే పదహారు ఘడియల కాలం ఎంతో పుణ్యకాలంగా చెప్పబడింది. ఈ నెల మొదటి రోజు నుండి మూడు, నాలుగు నెలలపాటు చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటిని వితరణ చేయడం ఒక సంప్రదాయంగా వస్తుంది.  2024 : ఏప్రిల్ 09 నుండి మే 08 వరకు. 

Random posts