Mallam Subramanya Temple: శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం - మల్లం

 

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలలో ఒక్కటి. 

ఈ క్షేత్రానికి పూర్వం తిరువాంబురు అనే పేరు ఉండేది. పూర్వం మల్లాసురుడు, కొల్లాసురుడు అనే రాక్షసులు ఇద్దరూ తిరువాంబురును పరిపాలిస్తూ ఉండేవారు. రాక్షసులు కనుక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండేవారని. ఇక్కడ కొలువుదీరిన సుబ్రహ్మణ్య స్వామిని కూడా లెక్కపెట్టే వారుకాదు. కష్టాలను భరించలేకపోయిన ప్రజలు వారి బారినుండి తమను కాపాడమని సుబ్రహ్మణ్యస్వామివారిని ప్రార్థించారు. వారి ప్రార్ధనలు మన్నించిన స్వామివారు. రాక్షసులతో యుద్ధంచేసి వారిని ఓడించారు. చివరిక్షణాల్లో సుబ్రహ్మణ్యస్వామివారి దివ్య రూపాన్ని చూసి పశ్చాత్తాపానికి లోనైన రాక్షసులు తమను అనుగ్రహించమని క్షమించి శరణు కోరారు. దీనితో స్వామివారు వరాన్ని ప్రసాదించాడు. దీని ప్రకారం మల్లాసురుడి పేరుమీద ఊరికి మల్లాపురం అనే పేరు ఏర్పడి, అది కాలక్రమములో మల్లాంగా మారినట్లు కథనం.

స్థల పురాణం

పూర్వం తారకాసురుడిని అంతమొందించిన అనంతరం సుబ్రహ్మణ్యస్వామి తన కర్తవ్యం ముగియడంతో ఈ ప్రాంతానికి చేరుకొని తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆయన వారి చుట్టూ పుట్టలు పెరిగి వెదురుపొదలు వ్యాపించాయి. ఆ సమయంలో ఒకసారి పాండురాజు కళింగయుద్ధం ముగించుకొని తిరిగి రాజధానికి వెళుతూ ఈ ప్రాంతంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సమయంలో వెదురుచెట్లను చూసి పొడవైన వెదురు బొంగులు పల్లకీ తయారీలో ఉపయోగపడతాయని భావించి వాటిని కొట్టేందుకు సేవకులను పంపాడు. వెదురు బొంగులు కొట్టే సమయంలో కత్తి పట్టుతప్పి పుట్టలో ఉన్న సుబ్రమణ్యస్వామివారి చేతులకు తగిలి అవి తెగి ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. దీనితో భయాందోళనలకు గురైన సేవకులు ఈ విషయాన్ని రాజుకు తెలిపారు. అదే సమయంలో రాజుకు కళ్ళు కనిపించడం మానేసాయి. ఎందువల్ల అలా జరిగిందో అర్థం కాక అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఆరోజు రాత్రి స్వప్నంలో రాజుకు సుబ్రహ్మణ్యస్వామివారు సాక్షాత్కరించి జరిగినదంతా వివరించగా, తెలియక చేసిన తప్పును మన్నించి వలసిందిగా ప్రార్ధించాడు.అందుకు "ప్రాంతంలో. పుట్టలో ఉన్న నా బాహువు లేని విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మింపజేసి ప్రతిష్ఠించి పూజలు జరిగే ఏర్పాట్లు చేయి నీ పాపం పరిహారం అవుతుంది" అని ఆదేశించాడు స్వామి. రాజు ఆ ప్రాంతానికి చేరుకొని పుట్టను తొలగించి చూడగా స్వామివారి విగ్రహం బయల్పడింది. రాజు ఆలయనిర్మాణం గావించాడు. అందులో స్వామి వారిని ప్రతిష్టింపజేసి నిత్యపూజలు జరిగేలా చేసినట్లు కథనం. ఈ విధంగా మల్లాం క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి స్వయంభువుగా కొలువుదీరినట్లు స్థలపురాణం వెల్లడిస్తూ. వుంది.

మల్లాంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం విశాలమైన ప్రాంగణంలో శిల్పకళా శోభితమైన మండపాలతో, వివిధ ఉపాలయాలు, మహిమాన్వితమైన దేవతామూర్తులతో దర్శనమిస్తుంది. ప్రధాన గర్భాలయంలో సుబ్రహ్మణ్యస్వామి వారు స్థానక భంగిమలో ద్విభుజాలతో దివ్య అలంకారాలతోదర్శనమిస్తారు. స్వామివారి మూలవిరాట్టుకు ఎడమ వైపున ఒక విగ్రహం దర్శనమిస్తుంది. ఇదే సుబ్రహ్మణ్యస్వామివారి స్వయంభూమూర్తి, చోళులు పరిపాలనా కాలంలో ప్రస్తుత మూలవిరాట్టును ప్రతిష్టించిన స్వయంవ్యక్తమూర్తిని పక్కన వుంచినట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక గర్భాలయాలలో సుబ్రమణ్య స్వామి వారి దేవేరులు వల్లీదేవి, దేవసేనలు కొలువుదీరి పూజలందుకుంటున్నారు.

ఆలయంలోని సుమారు 34 శాసనాలు ఆలయ చరిత్రకు అద్దం చరిత్ర పడుతున్నాయి. వీటిని బట్టి పాండ్యరాజు 631 సంవత్సరంలో ఆలయాన్ని మొదటిసారిగా నిర్మింపజేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చోళుల పరిపాలన కాలంలో కులోత్తుంగ చోళుడు 12వ శతాబ్దం ప్రారంభంలో ప్రస్తుతమున్న ఆలయాన్ని, ఉపాయాలను నిర్మింపజేసినట్లు చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా ఆలయాన్ని నిర్మింప చేసిన కులోత్తుంగ చోళుడు ప్రస్తుతం దర్శనమిస్తున్న మూలవిరాట్టును, వివిధ దేవతామూర్తులను ప్రతిష్టింపజేసి పూజా కార్యక్రమాలు జరిగే ఏర్పాట్లు చేసినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఆలయప్రాంగణంలో శత స్తంభ మండపము భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. స్తంభాలు, వాటిపై వివిధ దేవతామూర్తుల. రామాయణ, భారత, భాగవతములలోని వివిధ ఘట్టాలకు చెందిన శిల్పాలతో నయనమనోహరంగా దర్శనమిస్తుంది. ఇంకా ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో వినాయకుడు, సోమేశ్వరస్వామి, కామాక్షిదేవి, చెన్నకేశవస్వామి, వంటి దేవతామూర్తులను భక్తులు దర్శించుకోవచ్చు.

ఆలయ వేళలు 

ఉదయం 5.00 నుండి 10.00 వరకు 

సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.15 వరకు 

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ  దశమి మొదలు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగా ధ్వజారోహణ, నంది సేవ, రథోత్సవం, కళ్యాణోత్సవం, శ్రీవల్లి పరిణయం వంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణం నాడు స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాస ఈ ప్రధాన ఉత్సవాలతో పాటు ప్రతి సంవత్సరం మార్గశిరమాసంలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగానూ, శ్రావణ కార్తిక మాసాలలో నాగుల చవితి పండుగల సందర్భంగానూ ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారు.

వసతి రవాణా సౌకర్యాలు

దేవస్థానంచారు నిర్వహిస్తున్న వసతి " గృహాలలో భక్తులకు వసతి లభిస్తుంది. మల్లా నెల్లూరుజిల్లాలో నెల్లూరుకు 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు నుంచి 96, సూళ్లూరుపేట నుంచి 50, నాయుడుపేట నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి నెల్లూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి రాపూరు వంటి ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

Abyanghana Snanam: అభ్యంగన స్నానం

Random posts