Jyestha Month 2024: జ్యేష్ఠ మాస విశిష్టత

 

  • చాంద్రమానంలో మూడవ నెల జ్యేష్ఠ మాసం.ఈ నెలలోని పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి దగ్గరలో ఉండటం చేత ఇది జ్యేష్ఠ మాసంగా చెప్పబడింది.
  • ఋతువులలో రెండవదైన గ్రీష్మఋతువు ఈ మాసంలో ప్రారంభం అవుతుంది.
  • ఈ మాసం దాన, ధ్యాన, పూజ, జప, పారాయణలకు ఉత్తమమైన మాసంగా చెప్పబడింది.
  • ఈ మాసంలో ఆచరించే విధులలో బ్రహ్మపూజ ప్రధానంగా చెప్పబడింది.
  • ఈ నెలలో బియ్యపు పిండితోకాని, గోధుమపిండితో కానీ బ్రహ్మదేవుడి ప్రతిమను చేసిరోజు పూజించాలి. రోజు పూజ చేయలేని వారు ముఖ్యతిధులలో పూజించటం మంచిది.
  • బ్రహ్మపూజ వల్ల మరణాంతరం సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది.
  • ఈ మాసంలో సూర్యారాధన, సుబ్రమణ్య స్వామి ఆరాధన కూడా మంచిది అని చెబుతారు.
  • ఈ మాసంలో పార్వతీదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా శ్రీశైల అడవులలో నెలకొని వున్నా ఇష్టకామేశ్వరిదేవి పూజించడం మంచిదే.
  • ఈ మాసంలో మిధున సంక్రమణం జరుగుతుంది. అంటే సూర్యుడు వృషభరాశి నుండి మిధునరాశిలోకి ప్రవేశిస్తాడు.ఈ సంక్రమణ సమయానికి ముందుగల 16 ఘడియల కాలం ఎంతో పుణ్యప్రదమైనది.
  • మిధున సంక్రమణం నాడు  వృషభాని పూజించి, సాయంకాలం లక్ష్మీపూజ చేసే సంప్రదాయం కూడా వుంది. దీనినే దీపపుజా అని కూడా అంటారు.
  • ఈ మాసంలోకూడా ఎండలు తీవ్రంగా ఉంటాయి, ఈ మాసంలో మంచినీటి కుండలు దానం చేయడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటివి చేయలని శాస్త్రం.
  • ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, విసనకర్రలు, చందనం, బెల్లం, నెయ్య మొదలైన వాటిని దానం చేయడం వల్ల గత జన్మ పాపాలు హరించబడుతాయి.
  • ఈ మాసంలో గృహనిర్మాణం ప్రారంభించడం కానీ, గృహప్రవేశాలు కానీ చేయరు. 

2024 : జూన్ 07 నుండి జులై 05 వరకు.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి