Nirjala Ekadasi: నిర్జల ఏకాదశి
- జ్యేష్ఠా శుద్ధ ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి జరుపుకుంటారు.
- ఈనాడు నీళ్లను కూడా త్రాగకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పబడింది.
- ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మిగతా ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాన్ని ఆచరించనంత ఫలితం వస్తుంది.
- పూర్వం శ్రీకృష్ణుడు సూచనా మేరకు భీముడు ఈ వ్రతాన్ని ఆచరించి అనేక ఫలితాలు పొందాడు అని పురాణం కధనం.
- అన్ని నియమాలతో ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించినవాడు పాపవిముక్తుడు అవుతాడు.
- ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మానవుడు సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు.
- మరణ సమయంలో యమదూతలు కనపడరు, విష్ణు దూతలు విష్ణులోకానికి తీసుకువెళతారు.
- ఈ ఏకాదశి వ్రతం తరువాత జలాన్ని,గోవులను దానం చేసేవాడు సకల పాపవిముక్తుడు అవుతాడు.
- ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్నానం, దానం, వేదమంత్రోచారణం, యజ్ఞ నిర్వహణం వంటి పుణ్య కార్యాలు నశింపలేనివిగా అవుతాయని శ్రీకృషుడు భగవానుడు చెప్పాడు.
- ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠ లోకానికి వెళ్తాడు.
నిర్జల ఏకాదశి నాడు సూర్యోదయంనుండి మరుసటి రోజుసూర్యోదయం వరకు 24 గంటలు ఉపవాసం పాటించాలి. ఇతర ఏకాదశుల మాదిరిగానే, ఏకాదశినాడు కూడా విష్ణువుకు పూజలు చేస్తారు. విష్ణువు చిత్రపటం లేదా చిన్న విగ్రహం ఉంచి ఆరాధిస్తారు. పంచామృతంతో అభిషేకం చేస్తారు.
ఐదు ఆహారాల మిశ్రమం
పాలు, పెరుగు, నెయ్యి (స్పష్టమైన వెన్న), తేనె, చక్కెరలతో అభిషేకం చేస్తారు. శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. పూలు, ధూపం, దీపం సమర్పిస్తారు. భక్తులు దేవతా మూర్తిని ధ్యానిస్తారు. సాయంత్రం విష్ణువును దుర్వ గడ్డితో పూజిస్తారు. రాత్రంతా జాగరం చేస్తూ విష్ణుమూర్తిని స్తుతిస్తూ ఉంటారు. నిర్జల ఏకాదశి రోజున బట్టలు, ఆహార ధాన్యాలు, గొడుగులు, విసనకర్రలు, నీరు నింపిన కుండలు, బంగారం మొదలైన వాటిని దానం చేయాలని పెద్దలు నిర్దేశించారు.
మార్కండేయ పురాణం, విష్ణు పురాణం ప్రకారం నిర్జల ఏకాదశి రోజు చేసే వ్రతం అన్ని పాపాలను పోగొడుతుంది. విష్ణువు అనుగ్రహం, ఆనందం, శ్రేయస్సు, దిర్ఘాయువు లభిస్తుంది.
2025: జూన్ 06.
Comments
Post a Comment