Shravana Masam 2024: శ్రావణ మాసంలో పర్వదినాలు

శ్రావణమాసం నోములకు పూజలకు పుట్టినిల్లు. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.

శ్రావణమాసం శుద్ధ పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు ఉపవాసాలు ఉండి నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోయడం వంటివి భక్తి శ్రద్దలతో చేస్తే కుజ దోషాలు, నాగ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

శ్రావణ శుద్ధ షష్టి రోజున సంపూర్ణమైన ఆరోగ్యం కోసం 'సూపౌదన వ్రతం' ఆచరిస్తారు. ఇదే రోజున కల్కి జయంతి కూడా జరుపుకోవడం విశేషం.

ఆగష్టు 11న వచ్చే భాను సప్తమి సూర్య ఆరాధనకు విశిష్టమైనది.

ఆగస్టు 15న భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాం.

ఆగస్టు 16వ తేదీ పుత్రదా ఏకాదశి రోజు శ్రీ విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తారు.

ఆగస్టు 16వ తేదీ శ్రీ వర మహాలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటాం. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసే వరలక్ష్మీ వ్రతం విశిష్టమైనది. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి.

ఆగస్టు 17వ తేదీ దామోదర ద్వాదశి, ఇదే రోజు శని త్రయోదశిని కూడా జరుపుకుంటాం.

ఆగస్టు 19వ తేదీ శుక్ల పక్ష పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధన్ జరుపుకుంటున్నాం. ఇదే రోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ దినం.

యజ్ఞోపవీత పౌర్ణమి

శ్రావణ పౌర్ణమి రోజు జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు. వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు.

ఆగస్టు 20న శ్రావణ బహుళ కృష్ణపాడ్యమి రోజున హయగ్రీవ జయంతిగా జరుపుకుంటాం.

ఆగస్టు 21న శ్రావణ బహుళ విదియ రోజు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనగా జరుపుకుంటాం.

ఆగస్టు 24న శ్రావణ బహుళ చవితి రోజు సంకష్టహర చవితిగా జరుపుకుంటాం.

ఆగస్టు 24న తేదీ శ్రావణ బహుళ పంచమి రోజు బలరామ జయంతిగా జరుపుకుంటాం.

ఆగస్టు 26న తేదీ శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని జన్మ దినం కృష్ణాష్టమిగా జరుపుకుంటాం.

ఆగస్టు 29న శ్రావణ బహుళ ఏకాదశిని అజా ఏకాదశిగా జరుపుకుంటాం.

ఆగస్టు 31న శ్రావణ బహుళ త్రయోదశిని శని దోషాలను పోగొట్టే శని త్రయోదశిని జరుపుకుంటాం.

సెప్టెంబర్ 1న శ్రావణ బహుళ చతుర్దశి రోజు మాస శివరాత్రి పర్వదినం.

సెప్టెంబర్ 2న తేదీ శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటాం.

Comments

Popular posts from this blog

Bikkavolu Ganapati Temple: శ్రీ లక్ష్మి గణపతి ఆలయం - బిక్కవోలు

Srisailam Bramaramba Devi: శ్రీ భ్రమరాంబ దేవి - శ్రీశైలం

Mahalaya Pakshalu: మహాలయ పక్షాలు || పితృ పక్షాలు

Sri Chengalamma Temple: శ్రీ చెంగాళమ్మ అమ్మవారి ఆలయం - సూళ్లూరుపేట

Tirumala Naivedyam: తిరుమల శ్రీవారికి ఏ నైవేద్యం ? ఎప్పుడు సమర్పిస్తారు

Dasara Navratri Importance: దసరా నవరాత్రుల ప్రాముఖ్యత

Paiditali Sirimanotsavam 2024: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం 2024 - విజయనగరం

వ్రతం, నోము రెండింటికీ భేదం ఏమిటి?

Shravana Masam 2024: శ్రావణ మాసం విశిష్టత

Nellore Temples: నెల్లూరు జిల్లాలో ప్రధాన ఆలయాలు