Bhadrakali Brahmotsavam 2024: శ్రీ భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 2024 తేదీలు - వరంగల్

శ్రీ భద్రకాళి అమ్మవారి  దేవస్థానం తెలంగాణ రాష్ట్రం, వరంగల్లులో ఉంది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది.

చాలా ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయ ప్రాంతంలో సిద్ధసంచారం ఎక్కువ వుంటుందని  అందువల్లనే ఈ  ప్రదేశంలో అడుగుపెట్టగానే మానవులు తాము తెలిసి తెలియక చేసిన తప్పులు అన్నీ తొలగుతాయి అని భక్తుల నమ్మకం. శ్రీరాముడు ఈ ఆలయాన్ని సందర్శించాడని స్థలపురాణం. 625వ సంవత్సరంలో రెండో పులకేశి భద్రకాళి ఆలయాన్ని పునర్నిర్మించాడు. కాకతీయుల పాలనలోనే కాకుండా విజయనగర రాజుల పాలనలోనూ వరంగల్ భద్రకాళి ఆలయం వైభవ ప్రాభవాలను పొందింది. దేవి విగ్రహం 9 అడుగులు ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తుంది. ప్రేతాసనంపై కూర్చున్న భద్రకాళి ఎనిమిది చేతులలో కుడి వైపున ఖడ్గం, మురిక, జపమాల, డమరుకం ఎడమ వైపు ఘంట, త్రిశూలం, నరికిన తల, పాన పాత్రలుంటాయి. పూర్వం ఈ భద్రకాళి మాత రౌద్రంగా వుండేది. తరువాతి కాలంలో అమ్మవారిని ప్రసన్న వదనగా మార్పుచేశారు.


అమ్మవారి బ్రహ్మోత్సవాలు మే 09 నుండి జరగనున్నాయి


మే  09 - అంకురార్పణ, గణపతి పూజ, మూషిక వాహన సేవ, శ్రీ సుబ్రమణ్య స్వామి పూజ, నెమలి వాహన సేవ 

మే 10 - ధ్వజారోహణం, వృషభ వాహన సేవ, మృగ వాహన సేవ 

మే 11 - ఎదురుకోలు, మకర వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ 

మే 12 - శ్రీ భద్రకాళి అమ్మవారి కళ్యాణం, సింహ వాహన సేవ, గజ వాహన సేవ

మే 13 - సద్యసం, సూర్యప్రభ వాహన సేవ, హంస వాహన సేవ

మే 14 - పల్లకి సేవ, శేష వాహన సేవ

మే 15 - గంధోత్సవం, సాలభంజిక సేవ 

మే 16 - రథోత్సవం 

మే 17 - డోలోత్సవం, అశ్వ వాహనసేవ 

మే 18 - వసంతోత్సవం, విమాన సేవ 

మే 19 - మహా పూర్ణాహుతి, శరభ వాహన సేవ, పుష్పరథ సేవ

మే 20 - చక్ర స్నానం, ధ్వజావరోహణ, పుష్ప యాగం 

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Kashi Yama Aditya Temple: యమ ఆదిత్య ఆలయం - కాశీ