Skip to main content

వృక్షాలు అవి ఇచ్చే ఫలితాలు (పద్మ పురాణం)

 

మానవుల జీవితానికి రక్షణ పోషణ ఇచ్చేవి వృక్షాలు. ఇవి ఎన్నో రకాలు. వీటిలో ఒక్కో వృక్షం నాటితే ఒక్కోరకమైన ఫలితం వస్తుంది.

పాల చెట్టు - ఆయుర్దాయాన్ని పెంపొందిస్తుంది

నేరేడు చెట్టు - ఆడపిల్ల సంతానాన్ని ప్రసాదిస్తుంది

దానిమ్మ చెట్టు - ఉత్తమమైన, అనుకూలవతి అయిన భార్యనిస్తుంది

రావిచెట్టు - సకలరోగాలను నివారిస్తుంది

మోదుగ చెట్టు - సంపదల్ని ప్రసాదిస్తుంది

ఊడుగ చెట్టు - వంశాన్ని వృద్ధి చేస్తుంది

చంద్ర వృక్షం -  వ్యాధులు నిర్మూలిస్తుంది

వేపచెట్టు - సూర్యుడికి ప్రీతికరం, ఆరోగ్య ప్రదం

మారేడు - పరమేశ్వరా అనుగ్రహాన్ని కలిగిస్తుంది

పాటలీ వృక్షం - పార్వతీదేవికి ప్రీతికరమైనది

మొల్ల వృక్షం - గంధర్వులతో సమాగమం

చందన వృక్షం - ఐశ్వర్య ప్రదం, పుణ్యప్రదం

సంపెంగ - సౌభాగ్యాన్ని పెంపొందిస్తుంది

పొగడచెట్టు - కులవర్థకంగా ఉపయోగపడుతుంది 

కొబ్బరి చెట్టు - బహుభార్యత్వాన్ని కలిగిస్తుంది

ద్రాక్ష చెట్టు - సర్వాంగసుందరి అయిన భార్య లభిస్తుంది.

రేగు చెట్టు - రతి సుఖాన్ని కలుగుతుంది

కేతకి (వెలుగలిచెట్టు) -  శత్రువుల్ని నశింపచేస్తుంది.

ఈ విధంగా లోకంలో ఎన్నో వృక్షాలున్నాయి. వీటిలో ఏ అది ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది కనుక చెట్లు నాటి అందరూ మేలు చేయాలి.

Comments

Popular posts from this blog

Karthika Masam: కార్తీక మాసంలో ఏమి తినాలి ? ఏ పనులు చేయాలి ? ఏ వ్రతాలు చేయాలి ?

కార్తిక మాసంతో సమానమైన మాసం, కృతయుగంతో సమమైన యుగం, వేదానికి సరితూగే శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవని అర్థం. శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఉపవాస నిష్టలకూ, నోములకూ, వ్రతాలకూ ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే మాసం ఇది. ఈ నెల రోజులూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రాతఃకాల స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. స్నానం పూర్తయిన తరువాత దీపారాధన చెయ్యాలనీ, రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల దగ్గర దీపాలు పెట్టడం ఉత్తమమనీ పెద్దలు చెబుతారు. మాసాలలో అసమానమైనదిగా పేరు పొందిన కార్తిక మాసంలో ఎన్నో పర్వదినాలున్నాయి.  పఠించదగిన స్తోత్రాలు వామన స్తోత్రం,  మార్కండేయకృత శివస్తోత్రం,  సుబ్రహ్మణ్యాష్టకం,  శ్రీ కృష్ణాష్టకం, సూర్య స్తుతి,  గణేశ స్తుతి, దశావతార స్తుతి,  దామోదర స్తోత్రం, అర్ధ నారీశ్వర స్తోత్రం,  లింగాష్టకం, బిల్వాష్టకం, శివషడక్షరీ స్తోత్రం శ్రీ శివ స్తోత్రం,శివాష్టకం మృత్యుంజయ మహామంత్ర జపం  శ్రీ విష

Arunachala Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణ మహత్యం (స్కాంద పురాణం )

  ప్రదక్షిణ అంటే ప్ర - బలంగా పాపాల్ని కొట్టి తరిమేసేది ద - సకల కోరికలనీ తీర్చేది క్షి - కర్మ ఫలితాలని క్షీణింప చేసేది ణ - ముక్తి ప్రదాయకమైనది అని అర్థం. కైలాసవాసుడైన పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణాచలం రూపంలో భూమిమీద వెలిసాడు. ఆ దివ్య పర్వతం చుట్టూ ఎంతో మంది దేవతలు పరివేష్టించి ఉన్నారు. జన్మాంతరాల్లో చేసిన పాపాలు అన్ని కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే నశించిపోతాయి. కోటి అశ్వమేధయాగాలు, కోటి వాజపేయ యాగాలు చేస్తే వచ్చే ఫలితం, సర్వతీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలితం, కేవలం ఒక్కసారి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కలుగుతుంది.  ఎంత నికృష్ట జన్మ ఎత్తిన వారికైనా సరే, అరుణగిరి ప్రదక్షిణ ముక్తిని ప్రసాదిస్తుంది.ఆ గిరికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసేవారు, సకల యజ్ఞాలు చేసిన ఫలం పొందుతారు. అరుణాచల ప్రదక్షిణ కోసం వెళ్ళేవారు ఒక్క అడుగు వేసినంత మాత్రాన్నే భూలోకాన్ని, రెండో అడుగుతో అంతరిక్షాన్ని, మూడో అడుగుతో స్వర్గాన్ని పొందుతారు. అలాగే మొదటి అడుగుతో మానసికంగా చేసిన పాపం, రెండవ అడుగుతో వాక్కుద్వారా చేసిన పాపం, మూడో అడుగుతో శరీరం ద్వారా చేసిన పాపం తొలగిపోతుంది. ఒక్కడుగుతో సకల పాపాలూ నశిస్తాయి. రెండో అడ

Not to Eat in Karthika Masam: కార్తీక మాసం లో తినకూడనివి..?

 కార్తీక మాసం పవిత్రమైనది. ఈ మాసం మొత్తం ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు ఇంటి గడపల వద్ద, తులసి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. కార్తీకంలో అల్పాహారం తీసుకుని, ఒంటిపూట భోజనం చేసేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ నెలంతా ఉపవాసం చేయలేనివారు కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి దినాల్లో ఉపవాసం, దీపారాధన చేయాలి. అలాగే  ఈ మాసంలో ఉల్లి, పుట్టగొడులు, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాడలు, వంకాయ, గుమ్మడి, వెలగపండు, మాంసాహారం, పెసలు, సెనగలు, ఉలవలు, కందులు వాడకూడదు. కార్తీకస్నానం చేసినవారి అశ్వమేధ ఫలాన్ని పొందుతారు. కార్తీక దీపాన్ని శివలింగ సన్నిధిలో దీపారాధన చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. కార్తీకంలో శివాలయంలో ఆవునేతితోగాని, నువ్వులనూనెతోగాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని పురాణాలు చెప్తున్నాయి. 

Rama Ekadasi: రమా ఏకాదశి

  ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశిగా జరుపుకుంటారు.  పద్మపురాణం ప్రకారం  రమా ఏకాదశి వ్రతం ఆచరించే వారికి శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి.  ముందుగా సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీ లక్ష్మీ నారాయణుల చిత్ర పటాలను గంధం కుంకుమలతో అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి.  తులసి దళాలతో అర్చిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.  చక్ర పొంగలి, పరమాన్నం వంటి ప్రసాదాలను నివేదించాలి. ఏకాదశి రోజు సాయంత్రం ఇంట్లో యధావిధిగా పూజ చేసుకొని సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.  రాత్రి భగవంతుని కీర్తనలతో, పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలి.  పురాణాలలో వివరించిన ఏకాదశి వ్రత కథలను చదువుకోవాలి. ఈ రోజు చేసే దానధర్మాలు విశేషమైన పుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది.  ఈ రోజు అన్నదానం, వస్త్రదానం, జలదానం చేయడం వలన విశేషమైన ఫలితం ఉంటుంది.  ఏకాదశి రోజు గోసేవ చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఎవరైతే భక్తిశ్రద్ధలతో, నియమ నిష

Udupi Temple Annaprasadam: అన్నబ్రహ్మ క్షేత్రం - ఉడిపి

ఉడుప అంటే చంద్రుడు, వెన్నల అని అర్ధం. శివునికోసం చంద్రుడు తపస్సు చేసిన ప్రదేశం ఉడుపి. కాలక్రమంలో ఉడిపి అయింది. పేరుకు తగ్గట్టు ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛముగా వెన్నెలలో ప్రకాశించే చంద్రుడులా ఉంటుంది. శ్రీ మద్వాచార్యులు రాకతో ఈ క్షేత్ర వైభవం పతాకస్థాయికి చేరింది. ఉడిపి అన్నబ్రహ్మ క్షేత్రం అని అంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని కాంచన బ్రహ్మ అని వ్యవహరిస్తారు. పండరీపుర పాండురంగ స్వామిని నాదబ్రహ్మగా పిలుస్తారు. ఉడిపి అన్నబ్రహ్మ క్షేత్రంలో శతాబ్దాలుగా ఉచిత అన్నదానం భక్తులకు లభిస్తుంది. ఈ భోజనశాలలో ఒక్కో బంతికి ఐదు వందల మంది వరకు భోజనం చేయవచ్చు. అలాగే ఆలయం బయట ఉన్న మరో అన్నక్షేత్ర భవనంలో మూడు అంతస్తులలో ఒక్కో భోజనశాలలో ఒక్కో బంతికి 1400 మంది వరకు ఒక్కేసారి అన్నప్రసాదాన్ని స్వీకరించే సదుపాయం ఉంది. 1915 సంవత్సరంలో అప్పటి పీఠాధిపతి ఈ ఉచిత అన్నదానాన్ని విస్తృతంగా అమలు చేసారు. ప్రతి రోజు సగటున 30 వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. మకర సంక్రాంతి, మద్వనవమి, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణ అష్టమి, నవరాత్రులు, మధ్వ జయంతి, విజయదశమి, నరక చతుర్దశి, దీపావళి, గీత జయంతి వంటి పండుగలను ఈ క్షేత్రంలో అంగరంగ

Thumburu Theertham: తుంబుర తీర్థం - తిరుమల

  శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తుంబుర తీర్థం. తిరుమల క్షేత్రంలోని పుణ్య తీర్థాలలో 'తుంబుర తీర్థం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు తొలగిపోయి, మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. తుంబురు తీర్థాన్ని ఒకప్పుడు ‘గోనతీర్థం’ అని పిలిచేవారు. తుంబుర తీర్థం దట్టమైన శేషాచలం అడవుల్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్లడం కష్టసాధ్యం. బ్రహ్మర్షి వశిష్ఠుడు ఈ తీర్థంలో స్నానం ఆచరించి  పాప విముక్తి పొందారని చెబుతారు. ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు తుంబుర తీర్థానికి ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.  ఈ సందర్భంగా ముక్కోటి దేవతలు తీర్థంలో స్నానం ఆచరిస్తారని నమ్మకం.   కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం వచ్చింది. అప్పుడు ఒక కొండ రెండుగా చీలిపోవడం వల్ల తుంబుర తీర్థం ఏర్పడిందని వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలోని వేంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరదిశలో, సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది తుంబుర తీర్థం. తుంబురుడి పేరు మీద వెలసిన ఈ తీర్థంలోనే స్వామి

Vadapalli Temple Brahmotsavam: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2024 తేదీలు - వాడపల్లి

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో వెలసింది. ఈ ఆలయం ఏడు శనివారాలు నోముకు ప్రసిద్ధి. 2024 తేదీలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 21 నుండి వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 21 - ధ్వజారోహణం, శేష వాహన సేవ, వాసుదేవ అలంకరణ  అక్టోబర్ 22 - మహా పుష్పయాగం, సహస్ర దీపాలంకరణ సేవ, హంస వాహన సేవ అక్టోబర్ 23 - శ్రీనివాస కళ్యాణం, కోదండరామ అలంకరణ, హనుమంత వాహన సేవ అక్టోబర్ 24 - తోమాల సేవ, సుదర్శన హోమం, యోగనరసింహ అలంకరణ, సింహ వాహన సేవ అక్టోబర్ 25 - అష్టదళపాదపద్మ ఆరాధన, మలయప్ప అలంకరణ, గరుడ వాహన సేవ అక్టోబర్ 26 - సుప్రభాత సేవ, శ్రీ కృష్ణ అలంకరణ, సూర్యప్రభ వాహన సేవ, మోహిని అలంకరణ, చంద్రప్రభ వాహన సేవ అక్టోబర్ 27 - తిరుప్పావడ సేవ, రాజాధిరాజా అలంకరణ, గజ వాహన సేవ అక్టోబర్ 28 - లక్ష కుంకుమార్చన, చూర్ణోత్సవం, కల్కి అలంకరణ, అశ్వ వాహన సేవ అక్టోబర్ 29 - పూర్ణాహుతి, చక్ర స్నానం, ఏకాంత సేవ 

Karthika Masa Snan: కార్తీక మాసంలో స్నానానికి ఎందుకంత ప్రాధాన్యం?

కార్తికంలో గోష్పాదమంత (ఆవుకాలిగిట్ట) జలంలో కూడా దేవదేవుడు ఉంటాడని విశ్వసిస్తారు భక్తులు. అందుకే కార్తికమాసంలో స్నానానికి అంత ప్రత్యేకత ఉంది.  ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగా చేసే స్నానాన్ని హంసోదక స్నానం అంటారు.  శరదృతువులో సూర్యోదయానికి ముందు హంసమండలానికి సమీపంలో అగస్త్య నక్షత్రం ఉదయిస్తుంది. అటువంటి సమయంలోని నీరు స్నానపానాదులకు అమృతతుల్యంగా ఉంటుందని మహర్షి చరకుడు పేర్కొన్నాడు.  ఓషధులకు రాజు చంద్రుడు. చంద్రకిరణాలు సోకిన నీటితో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శరదృతువులో నదీప్రవాహంలో ఓషధుల సారం ఉంటుంది.  చీకటి ఉండగానే ఉషఃకాలంలో అంటే సూర్యోదయానికి పదిహేను నిమిషాల ముందు స్నానం చేయడం ఉత్తమం.  ఇందువల్ల మానసిక, శారీరక రుగ్మతలన్నీ నశిస్తాయి. పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది.

Irukalala Parameswari Temple: శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం - నెల్లూరు

శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవాలయం నెల్లూరు పట్టణంలో మూలాపేటలో స్వర్ణాల చెరువు అని పిలువబడే నెల్లూరు చెరువు ఒడ్డున నిర్మించబడింది.. ఈ స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు నిర్మించాడని ప్రతాపరుద్ర చరిత్ర తెలుపుతోంది. దేవాలయ మండపంలోను, స్తంభములపైన తెలుగు, తమిళ, దేవనాగరి భాషలలో ఉన్న శాసనాలు దేవాలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రకాంశాలను తెలుపుతున్నాయి. క్రీ.శ. 13 శతాబ్దంలో నెల్లూరును తెలుగుచోళరాజులు పరిపాలించారు. ఆ కాలంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత వల్ల తెలుగు చోళరాజైన చోడతిక్క తమ సహాయార్థం దండెత్తి రావలసినదిగా ఓరుగళ్ళు పురాధీశ్వరుడైన కాకతీయ గణపతిదేవుని వేడుకొన్నాడు. గణపతిదేవుడు మొదటిసారిగా క్రీ.శ. 1203 సంవత్సరంలో నెల్లూరు ప్రాంతంపై దండెత్తారు. అప్పటినుండి దాదాపు క్రీ.శ. 1317 వరకు కాకతీయులు అనేకమార్లు నెల్లూరుపై దండయాత్ర జరిపారు. ఈ నేపధ్యంలో ప్రతాపరుద్రదేవ మహారాజు కాలంలో (క్రీ.శ.1314- 15) ఈ ప్రాంతానికి వచ్చిన అతని సేనానులు ముప్పడి నాయకునికి అతని కొడుకు పెద్ద రుద్రునికి పుణ్యంగా నెల్లూరు భూమికి నెలమూడు వర్షాలు కురవగా ధనకనకాలు సమృద్ధిగా ఉన్న వారి భృత్యులు నాగగణ సేవకుడైన హరిదేవుని కుమారులైన నాయగానుల

Fasting in Karthika Masam: కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు చేయాలి?

శివభక్తులు కార్తిక సోమవారం లింగార్చన, పూజ, ఉపవాసం చేస్తే శివానుగ్రహాన్ని పొందుతారు. కార్తికంలో వచ్చే సోమవారాలన్నీ నియమంగా పాటిస్తే సోమవార వ్రతమవుతుంది. అది శివునికి ప్రీతిపాత్రం.  కార్తిక సోమవారం ఉపవాసం చేసినవారు స్త్రీలు, పురుషులు అందరూ నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తే శివలోకానికి వెళతారు.  కార్తిక సోమవారంనాడు శక్తిమేరకు శివాభిషేకం చేయాలి. పగలంతా ఉపవాసం చేయాలి. ప్రదోషకాలంలో అంటే సాయంత్రవేళలో నక్షత్ర దర్శనం అయ్యేంతవరకు శివారాధన కొనసాగించాలి.  కార్తికమాసంలో సోమవారంనాడు భక్తవ్రతం అంటే, ఒంటిపొద్దు భోజనం చేయడం ఆచారం. పగలంతా ఉపవాసం చేసి, నక్షత్ర దర్శనం అయ్యాక విరమిస్తారు.  కార్తీకం చలికాలం కావడం చేత మానవులకు ఆహారం అరుగుదల మందంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఆహారం తినకుండా ఉపవాసం ఉండి రాత్రి భుజించాలంటారు.  ఈ నియమాలన్నీ పాటిస్తూ శివునికి బిల్వపత్రాలతో పూజచేస్తే భక్తుల కోరికలు నెరవేరతాయి.