Posts

Showing posts from May, 2024

Bhadrakali Brahmotsavam 2024: శ్రీ భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 2024 తేదీలు - వరంగల్

Image
శ్రీ భద్రకాళి అమ్మవారి  దేవస్థానం తెలంగాణ రాష్ట్రం, వరంగల్లులో ఉంది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది. చాలా ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయ ప్రాంతంలో సిద్ధసంచారం ఎక్కువ వుంటుందని  అందువల్లనే ఈ  ప్రదేశంలో అడుగుపెట్టగానే మానవులు తాము తెలిసి తెలియక చేసిన తప్పులు అన్నీ తొలగుతాయి అని భక్తుల నమ్మకం. శ్రీరాముడు ఈ ఆలయాన్ని సందర్శించాడని స్థలపురాణం. 625వ సంవత్సరంలో రెండో పులకేశి భద్రకాళి ఆలయాన్ని పునర్నిర్మించాడు. కాకతీయుల పాలనలోనే కాకుండా విజయనగర రాజుల పాలనలోనూ వరంగల్ భద్రకాళి ఆలయం వైభవ ప్రాభవాలను పొందింది. దేవి విగ్రహం 9 అడుగులు ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తుంది. ప్రేతాసనంపై కూర్చున్న భద్రకాళి ఎనిమిది చేతులలో కుడి వైపున ఖడ్గం, మురిక, జపమాల, డమరుకం ఎడమ వైపు ఘంట, త్రిశూలం, నరికిన తల, పాన పాత్రలుంటాయి. పూర్వం ఈ భద్రకాళి మాత రౌద్రంగా వుండేది. తరువాతి కాలంలో అమ్మవారిని ప్రసన్న వదనగా మార్పుచేశారు. అమ్మవారి బ్రహ్మోత్సవ

Random posts