Posts

Showing posts from September, 2023

Maha Bharani: మహాభరణి

Image
  మహాభరణి లేదా భరణి శ్రద్ధ అనేది మహాలయ పక్షాలలో ఈ నక్షత్రం చతుర్థి (నాలుగవ రోజు) లేదా పంచమి తిధి సమయంలో ఉంటుంది. అపారహ్న కాల సమయంలో భరణి నక్షత్రం అప్పుడు దీనిని ఆచరిస్తారు. ఇది చనిపోయినవారి యొక్క ఆత్మను విముక్తి చేస్తుంది వారికీ శాశ్వత శాంతిని ఇస్తుంది. సాధారణంగా భరణి నక్షత్ర శ్రాద్ధ వ్యక్తి మరణం తర్వాత ఒకసారి చేయబడుతుంది. కానీ ధర్మ సింధు ప్రకారం ప్రతి సంవత్సరం చేయవచ్చు. మహాలయ అమావాస్య తరువాత ఈ రోజు ముఖ్యమైనది. దీనిని గురించి గరుడ పురాణం, మత్స్య పురాణం మరియు అగ్ని పురాణాలలో ప్రస్తావనలు వున్నాయి. ఈ రోజు చేసే ఆచారాల వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరి, వారసులను ఆశీర్వదిస్తారు.  2023: అక్టోబర్  02. 

Hartalika Vrat: హరితాళికా వ్రతం

Image
  భాద్రపద శుద్ధ తదియనాడు ఆచరించే ఈ వ్రతానికే స్వర్ణగౌరీ వ్రతం అని  పేరు. దీనికే ఉమాపూజ, గౌరీపూజ, గౌరీతృతీయ అనే పేర్లు కూడా వున్నాయి. ఈ వ్రతాన్ని స్వయంగా పరమేశ్వరుడే,పార్వతి దేవికి ఉపదేశించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఈ వ్రతం ఆచరణలో వుంది. స్త్రీలు దీర్ఘాయువు కొరకు సౌభాగ్యం కోసం, ఆచరించే ఈ వ్రతవిధానాన్ని ధర్మసింధువు, స్మృతికౌస్తుభం చెబుతున్నాయి ఈ వ్రతంలో  శివలింగాన్ని, పార్వతీదేవి విగ్రహాన్ని స్థాపన చేసి విధివిధానంగా పూజించాలి. ఈ రోజు ఉండగలిగినవారు ఉపవాసం వుండవచ్చు. ఆనాటి రాత్రికి  ముత్తైదువులకు తాంబూలం యివ్వాలి. తాంబూలంలో ఖర్జూరాలను వుంచడం తప్పనిసరి. తరువాత రోజు తిరిగి శివపార్వతులను పూజించి పులగాన్ని నివేదించాలి.