Posts

Showing posts from October, 2023

Venkatagiri Jatara: వెంకటగిరి పోలేరమ్మ జాతర 2023 తేదీలు

Image
రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర అక్టోబర్  04, 05 తేదీల్లో జరగనుంది. వినాయక చవితి పూర్తయిన రెండు వారాలకు పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీ. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరకు వెంకటగిరిలోని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా స్వస్థలాలకు చేరుకుంటారు. దేశ విదేశాలనుంచి కూడా ఆ రెండురోజుల ఉత్సవాలనూ చూసేందుకు స్థానికులు తరలి వస్తారు. 2023 ముఖ్య తేదీలు  సెప్టెంబర్ 20వ తేదీ బుధవారం మొదటి చాటింపు ఉంటుంది సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం రెండో చాటింపు ఉంటుంది.  అక్టోబర్  01 ఆదివారం ఘటోత్సవం నిర్వహిస్తారు.  అక్టోబర్ 04 బుధవారం అమ్మవారి ఉత్సవం జరుపుతారు అక్టోబర్ 05 గురువారం అమ్మవారి నిలువు, నిష్క్రమణం, నగరోత్సవంతో జాతర ముగుస్తుంది. జాతర తొలిరోజు రాత్రి అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేస్తారు, ఆ తర్వాత అమ్మగారింటినుంచి అత్తగారింటికి ఆ ప్రతిమను తీసుకొస్తారు. అక్కడ బుక్క చుక్క పెట్టి అమ్మవారి మూర్తిని దర్శనాలకు అనుమతిస్తారు. అత్తగారింటి నుంచి పోలేరమ్మ ఆలయానికి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంచుతారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అర్థరాత్రి ఈ తంతు అంతా జరుగుతుంది. అనం

Random posts